Begin typing your search above and press return to search.

సీబీఐ వివేకా హత్య దర్యాప్తు అప్పుడే తేల్చుతుందా...?

By:  Tupaki Desk   |   27 July 2022 1:30 AM GMT
సీబీఐ వివేకా హత్య  దర్యాప్తు అప్పుడే  తేల్చుతుందా...?
X
దాదాపుగా మూడున్నర ఏళ్ల క్రితం మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్య జరిగింది. అది 2019 ఎన్నికల వేళ అంతా ఆ వేడిలో హడావుడిలో ఉన్నారు. సరిగ్గా మార్చి 15న ఉదయం చూస్తే వివేకా పులివెందులలో తన ఇంట్లో రక్తపు మడుగులో ఉన్నారు. అది నాడు దావానలంగా వ్యాపించింది. ఆ హత్యను నాడు అధికారంలో ఉన్న చంద్రబాబు చేశారు అని కూడా వైసీపీ విమర్శలు చేసింది.

ఒక విధంగా చూస్తే ఈ హత్య వల్ల టీడీపీకి ఎంతో కొంత రాజకీయ నష్టం జరిగింది అంటారు. అంటే వైసీపీకి అది బాగా సానుభూతిగా మారి ఉపయోగపడింది అన్న మాట. అలా వైసీపీ అధికారాన్ని చేజిక్కించుకుంది. తీరా జగన్ సీఎం అయ్యాక తన సొంత బాబాయ్ హత్యను కూడా ఏమీ పట్టించుకోలేదని విమర్శలు వచ్చాయి. దాని మీద వివేకా కూతురు వత్తిడి మేరకు చివరికి సీబీఐకి కేసు అప్పగించారు. అయినా కూడా నత్తనడకగానే దర్యాప్తు సాగుతోంది. మరి ఇది ఎపుడు తేలుతుంది అన్న ప్రశ్నలు సందేహాలు జనాలలో ఉన్నాయి.

అయి ఇపుడు వినిపిస్తున్న దాని బట్టి కొన్ని రకాలైన ప్రచారాలను తీసుకుంటే మాత్రం సరైన సమయంలోనే ఈ హత్య కేసు దర్యాప్తు వేగం పుంజుకుంటుందని అంటున్నారు. అదెలా అంటే ఏపీలో వైసీపీని నియంత్రించే పనిలో ఇప్పటికే బీజేపీ కేంద్ర నాయకత్వం విజయవంతం అయింది. 151 సీట్లు దక్కినా కూడా ఏపీ నుంచి బిగ్ సౌండ్ వినిపించలేని స్థితిలో నాయకత్వం పడిపోవడం అంటే అది కమల విజయం అనే అంటున్నారు.

అయితే ఆ తరువాత చూస్తే అనేక ఇబ్బందుల వల్ల కూడా బీజేపీ వైపు తేరిపారా వైసీపీ పెద్దలు చూడలేకపోతున్నారా అన్న డౌట్లు వస్తున్నాయి. ఇక ఏపీలో బీజేపీ ఏమీ ఆశలు వదులుకోవడంలేదు, అలా చేయడానికి బీజేపీ రాజకీయ సన్యాసం కూడా స్వీకరించలేదు. తెలంగాణాలో దూకుడు చేస్తోంది. ఏపీని వదిలేసిందని ఎవరైనా అనుకుంటే వట్టి పొరపాటే.

అయితే బీజేపీ ఏపీలో తన యాక్షన్ ప్లాన్ ని కరెక్ట్ ముహూర్తంలో స్టార్ట్ చేస్తుంది అని అంటున్నారు. ఏపీలో బీజేపీ ఈసారి సొంతంగా ఎన్నో కొన్ని సీట్లు అయినా గెలవాలని టార్గెట్ పెట్టుకుంది. అందువల్ల ముందుగా అగ్ర తాంబూలం వైసీపీకే ఇస్తుంది. వైసీపెతో సీట్ల సర్దుబాటుకు చూస్తుంది అని అంటున్నారు. అంటే ఎన్నికల్లో పొత్తుల లాంటివి అన్న మాట.

అలా వైసీపీ నాయకత్వం నుంచి ఏమైనా అసంతృప్తికరమైన వాతావరణం ఉంటే కనుక సీబీఐ అపుడు ఏపీలో ఎంటర్ అవుతుంది అని అంటున్నారు. అంటే 2019 ఎన్నికల ముందు వివేకా హత్య జరిగితే అది 2024 ఎన్నికల ముందు కూడా తమ చేతిలో ఆయుధంగా బీజేపీ ఏమైనా మార్చుకుంటుందా అన్న చర్చ అయితే వస్తోంది. మరి దానికి సిద్ధంగా ఉంటేనే ఏపీలో వైసీపీ రాజకీయం ముందుకు సాగుతుంది అని అంటున్నారు.

ఇపుడు జరుగుతున్న ఈ దర్యాప్తు అంతా కూడా చాలా నెమ్మదించడం వెనక అనేక రాజకీయ కారణాలు ఉన్నాయని అంటున్నారు. మొత్తానికి ఈ హత్య కేసు సీబీఐ చేతిలో ఉంది. సీబీఐ అంటే కేంద్రం ఆద్వర్యంలో పనిచేసే ఏజెన్సీ. మరి పంజరంలో చిలకను ఈ సంస్థనే నాడు విమర్శలు గుప్పించారు. అందువల్లనే ఈ కేసు కానీ ఈ విచారణ కానీ అతి పెద్ద ట్విస్ట్ తో మలుపు తిప్పే చాన్స్ అయితే బీజేపీకే ఉంది అని అంటున్నారు. అలాగే దీనికి ఒక విధమైన లాజిక్ ఎండింగ్ ని ఇచ్చే చాన్స్ కూడా కమలదళానిదే అని చెబుతున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో.