Begin typing your search above and press return to search.

అప్ఘాన్ జైళ్లో చిక్కిన భారతీయ మహిళ: తిరిగొస్తుందా..?

By:  Tupaki Desk   |   17 Aug 2021 9:30 AM GMT
అప్ఘాన్ జైళ్లో చిక్కిన భారతీయ మహిళ: తిరిగొస్తుందా..?
X
అప్ఘనిస్తాన్ దేశం పేరు ఇప్పుడు ప్రపంచం మొత్తం మారుమోగుతోంది. ఈ దేశాన్ని తాలిబన్లు ఆక్రమించుకోవడంతో అక్కడి పాలన ఎలా ఉంటుందోనని స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. ఇతర దేశాలకు చెందిన వారు ఇక్కడ మకాం వేసిన వారు ఇప్పటికే తమ ప్రదేశాల నుంచి ఖాళీ చేసి సొంతూళ్లకు వెళ్లారు. అమెరికాతో పాటు భారత్ ఇతర దేశాల దౌత్య కార్యాలయ సిబ్బందిని తమ ప్రాంతాలకు తీసుకొచ్చారు. కొందరు ఆలస్యం చేయడంతో అక్కడే చిక్కిపోయారు. ఇటీవల ఓ విమానం రెక్కలపై కూడా కూర్చొని వెళ్లేందుకు యత్నించిన వీడియో చూస్తే అక్కడి పరిస్థితి ఏంటో అర్థమవుతోంది. ఈ తరుణంలో భారతదేశానికి చెందిన ఓ మహిళ అప్ఘాన్ జైళ్లో చిక్కిపోయింది. అసలు ఓ మహిళ అప్ఘాన్ కు ఎలా వెళ్లింది..? ఎందుకు అప్ఘాన్ ప్రభుత్వం ఆమెను జైల్లో పెట్టింది..?

అప్ఘాన్ తాజా పరిస్థితులు చూస్తే ప్రపంచలో ఉన్న ప్రతి ఒక్కిరికీ వెన్నులో వణకు పుట్టుకొస్తుంది. దేశం ఇప్పుడు తాలిబన్ల వశం కావడంతో వారికి అనుగుణంగా పరిస్థితులను మార్చుకుంటున్నారు. వారి నిబంధనల ప్రకారమే నడుచుకోవాలని ఆదేశాలు జారీ చేస్తున్నారు. వారి నిబంధనల ప్రకారం మోసం చేయడం.. దొంగతనం చేశారని తెలిస్తే తాలిబన్ల చేతిలో ఉన్న గన్ లకు బలవ్వాల్సిందే. ఇలాంటి పరిస్థితుల్లో ఓ భారతీయ మహిళ అప్ఘాన్ దేశంలో చిక్కుకుంది. తమ బిడ్డ రాక కోసం ఆమె తల్లి ఘోషిస్తోంది.

కేరళకు చెందిన నిమష మధ్య తరగతి కుటుంబంలో జన్మించింది. బిందు-సంపత్ అనే దంపతులు ఆమె తల్లి దండ్రులు. వీరికి ఒక్కగానొక్క కూతురు నిమిష. డెంటిస్టు డాక్టర్ గా మారిన నిమిష ఓ ముస్లిం యువకుడి ప్రేమలో పడింది. వీరి మతాలు వేరయినా పెళ్లి చేసుకున్నారు. ఆ తరువాత తన ప్రియుడి కోరిక మేరకు ఇస్లాం మతం స్వీకరించి ఫాతిమాగా పేరు మార్చుకుంది. అయితే కొన్ని రోజులు సాఫిగా సాగిన వీరి సంసారం ఆ తరువాత ఓ ములుపు తిరిగింది. తన భర్త తనతో పాటు ఉగ్రమూకలో చేరాలని ఒత్తిడి తీసుకొచ్చారు. మొదట్లో ఒప్పుకోని ఫాతిమా ఆ తరువాత చేసేదేమీ లేక భర్తతో కలిసి తీవ్రవాద సంస్థలో చేరింది. అమె గాక ఆమెతో పాటు 20 మహిళలు 2016లో దేశం దాటి ఉగ్రవాద సంస్థలో చేరారు. ఆ తరువాత ఫాతిమా ఓ బిడ్డకు జన్మనిచ్చింది.

కొన్నాళ్ల తరువాత అప్ఘాన్ సైన్యానికి, ఉగ్రవాద సంస్థకు మధ్య జరిగిన కాల్పల్లో ఫాతిమా భర్త మరణించాడు. ఆమెతో పాటు మరికొంద మంది కేరళకు చెందిన మహిళలు తమ భర్తలను కోల్పోయారు. దీంతో తమకు ప్రాణ హాని ఉందని భావించిన ఫాతిమా, ఇతర మహిళలు 2019లో అప్ఘాన్ ప్రభుత్వానికి లొంగిపోయారు. అప్పటి నుంచి నిమిష కాబుల్ జైళ్లోనే ఉంటున్నారు.

జైలుకు వెళ్లే వరకు ఫాతిమా ఆమె తల్లిదండ్రులతో కాంటాక్టులో ఉండేది. ఆ తరువాత ఇప్పిటికీ ఆచూకీ తెలియలేదు. తమ కూతురిని భారత్ కు రప్పించాలని భారత ప్రభుత్వానికి బిందు సంపత్ దంపతులు ఇప్పటి వరకు 1882 సార్లు వినతి పత్రాలు సమర్పించారు. అయితే ఉగ్రవాద సంస్థలో ఉన్నందున భారత్ స్పందించలేదు. అయితే తమ కూతురు ఉగ్రవాది కాదని, ఆమె వల్ల దేశానికి ఎటువంటి ప్రమాదం రాదని తల్లిదండ్రులు కోరుతున్నారు. మొన్నటి వరకు అప్ఘాన్ ప్రభుత్వంతో భారత్ కు సత్సంబంధాలు ఉండడంతో తమ కూతురు తిగిగొచ్చే అవకాశం ఉండేదని భావించారు. కానీ తాలిబన్లు అప్ఘానిస్తాన్ ను ఆక్రమించడంతో తమ కూతరు ఇక తిరిగొస్తుందో లేదోనని ఆవేదన చెందుతున్నారు.