Begin typing your search above and press return to search.
కొత్త స్లోగన్ టీడీపీకి సెట్టవుతుందా ?
By: Tupaki Desk | 31 Oct 2021 2:30 PM GMTఎన్నికలను ఎదుర్కొనే రాజకీయ పార్టీలు ఒక్కో ఎన్నికకు ఒక్కో స్లోగన్ను జనాల్లో పాపులర్ చేస్తాయి. 2014 ఎన్నికల్లో టీడీపీ 'జాబు రావాలంటే బాబు రావాలి' అనే నినాదాన్ని జనాల్లోకి తీసుకెళ్ళింది. తెలుగుదేశం పార్టీతో పాటు దానికి మద్దతుగా పనిచేసిన సోషల్ మీడియా కూడా ఇదే స్లోగన్ను విపరీతంగా ప్రచారం చేయటంతో జనాల్లోకి అది బాగా ఎక్కింది. అలాంటి స్లోగన్నే మళ్ళీ టీడీపీ జనాల్లోకి తీసుకుని వెళుతోంది. ఇంతకీ కొత్త స్లోగన్ ఏమిటంటే 'మళ్ళీ నువ్వే రావాలి'.
ఇక వైసీపీ విషయానికి వస్తే 2014 ఎన్నికల్లో వైసీపీ కేవలం దివంగత ముఖ్యమంత్రి 'వైఎస్సార్ పరిపాలన' అన్నదాన్ని మాత్రమే ప్రచారం చేసింది. అయితే వివిధ కారణాల వల్ల ఆ ప్రచారం జనాల్లోకి అంతగా ఎక్కలేదు. కారణం ఏదైనా జగన్మోహన్ రెడ్డి అయితే అధికారంలోకి రాలేకపోయారు. ఇక 2019 ఎన్నికల విషయానికి వస్తే తెలుగుదేశం పార్టీ 'మీ భవిష్యత్తు-నా బాధ్యత' అని చెప్పినా జనాలు పట్టించుకోలేదు. ఎందుకంటే అప్పటికే చంద్రబాబునాయుడు పాలన ఎలాగుందో జనాలకు చూశారు కాబట్టి.
ఇదే సమయంలో వైసీపీ రెండు స్లోగన్లతో జనాల్లోకి వెళ్ళింది. మొదటిదేమో 'అన్నొస్తున్నాడు' అని, రెండో స్లోగన్ ఏమో 'బై బై బాబు' అని. అన్నొస్తున్నాడు అనే స్లోగన్ జగన్ పాదయాత్ర సందర్భంగా జనాల్లోకి విపరీతంగా ఎక్కేసింది. అలాగే బైబై బాబు అనే స్లోగన్ తో వైఎస్ షర్మిల జరిపిన రోడ్డు షో ల్లో బాగా క్లిక్ అయ్యింది. జగన్ కు పాజిటివ్ గా అన్నొస్తున్నాడని, చంద్రబాబుకు నెగిటివ్ గా బైబై బాబు అనే స్లోగన్ జనాల్లో బాగా పాపులరైంది. నెగిటివ్ స్లోగన్ తో పాటు జనాలు కూడా చంద్రబాబు పాలనపై వ్యతిరేకంగా ఉండటంతో వైసీపీ 151 సీట్లతో అధికారంలోకి వచ్చింది.
మరి వచ్చే ఎన్నికల నాటికి వైసీపీ ఏ స్లోగన్ను కాయిన్ చేస్తుందో తెలీదు. అయితే టీడీపీ మాత్రం 'మళ్ళీ నువ్వే రావాలి' స్లోగన్ను జనాల్లోకి తీసుకెళ్ళాలని డిసైడ్ అయిపోయింది. అందుకనే చంద్రబాబు కుప్పం పర్యటనలో ఇదే స్లోగన్ను పదే పదే వినిపిస్తున్నారు. అంటే ఇదే స్లోగన్ తో వచ్చే ఎన్నికలకు వెళ్ళబోతోందని అర్ధమైపోతోంది. అయితే ఇక్కడో సమస్యుంది. అదేమిటంటే మళ్ళీ నువ్వే రావాలి అంటే జగన్ను ఉద్దేశించి చెబుతున్నారా అని జనాలు కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంది.
స్లోగన్లలో క్లారిటి గనుక లేకపోతే అది రివర్సు కొట్టే ప్రమాదం కూడా ఉంది. కాబట్టి టీడీపీ జాగ్రత్తగా ఆలోచించి మరొ కొత్త స్లోగన్ను కాయిన్ చేస్తుందా లేదా అనేది చూడాలి.