Begin typing your search above and press return to search.
సుబెందు అధికారి మోడీకి షాక్ ఇవ్వనున్నారా?
By: Tupaki Desk | 10 Feb 2022 4:30 PM GMTసుబేందు అధికారి గుర్తున్నారా? మాజీ టీఎంసీ నేత. పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి నమ్మినబంటుగా ఉండి అనంతరం బీజేపీలో చేరారు. గత ఎన్నికల్లో మమతను ఓడించారు.
అనంతరం బీజేపీ శాసనసభా పక్షనేత పదవి పొందారు. అయితే, ఆయనపై కొత్త చర్చ తెరమీదకు వచ్చింది. సుబేందు తిరిగి తృణమూల్‌లో చేరుతున్నారని, బీజేపీలో ఇమడలేకపోతుండటమే దీనికి కారణమని ప్రచారం జరుగుతోంది.
తమ పార్టీని వీడి బీజేపీలో చేరిన సుబేందు గురించి తృణమూల్ అధికార ప్రతినిధి కునాల్ ఘోష్ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యే సుబేందు అధికారి తిరిగి తృణమూల్‌లో చేరడానికి సిద్ధపడిపోయారని, బీజేపీలో ఆయన ఇమడలేకపోతున్నారని వ్యాఖ్యానించారు.
బీజేపీలో చేరిన తర్వాత ఆయన కన్న కలలన్నీ కల్లలైపోయాయని, మానసికంగా దెబ్బతిన్నారని కునాల్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బీజేపీలో చేరిన తర్వాత తమ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ, పార్టీ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారన్నారు. ఆయన మానసిక దెబ్బతిన్న కారణంగానే తమ పార్టీ నేతలపై విమర్శలకు దిగుతున్నారని మండిపడ్డారు.
అతి కొద్ది రోజుల్లోనే సుబేందు అధికారితో సహా మరో ముగ్గురు తిరిగి తృణమూల్‌లో చేరడానికి రంగం సిద్ధం చేసుకున్నారన్న సమాచారం తమకు అందిందని, కానీ.. వారికి తృణమూల్ తలుపులు తెరుచుకోవని కునాల్ ఘోష్ కుండబద్దలు కొట్టారు. సుబేందు అధికారిని తిరిగి పార్టీలోకి తీసుకోవడానికి ఏమాత్రం సిద్ధంగా లేమని కునాల్ ఘోష్ స్పష్టం చేశారు. కాగా, సుబేందు తిరిగి టీఎంసీ గూటికి చేరనున్నారన్న వ్యాఖ్యలు ఇప్పుడు బెంగాల్ రాజకీయాల్లో చెక్కర్లు కొడుతున్నాయి.