Begin typing your search above and press return to search.

ఇక్కడ తెలుగుదేశం పార్టీ గెలుస్తుందా ?

By:  Tupaki Desk   |   26 May 2022 7:30 AM GMT
ఇక్కడ తెలుగుదేశం పార్టీ గెలుస్తుందా ?
X
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఉపఎన్నికకు షెడ్యూల్ విడుదలైపోయింది. నెల్లూరు జిల్లాలోని ఆత్మకూరు అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నికలు జూన్ 23వ తేదీ జరుగుతుందని కేంద్ర ఎన్నికల కమీషన్ షెడ్యూల్ విడుదల చేసింది. మూడు రోజుల తర్వాత అంటే జూన్ 26వ తేదీన ఫలితం వస్తుంది. ఇక్కడి నుండి ప్రాతినిధ్యం వహించిన వైసీపీ ఎంఎల్ఏ మేకపాటి గౌతమ్ రెడ్డి మరణంతో ఉప ఎన్నిక అనివార్యమైంది.

వైసీపీ తరపున మేకపాటి కుటుంబసభ్యుడు, గౌతమ్ సోదరుడు విక్రమ్ రెడ్డి పోటీ చేయబోతున్నారు. టీడీపీ నుండి ఎవరు పోటీచేయబోతున్నారనే విషయంపై క్లారిటీ లేదు. మిత్రపక్షాల తరపున బీజేపీ తరఫున అభ్యర్థి పోటీ చేయబోతున్నట్లు బీజేపీ చీఫ్ సోము వీర్రాజు ఇప్పటికే ప్రకటించేశారు. అయితే అభ్యర్థి ఎవరన్నదే తేలాలి. సో స్ధూలంగా చూస్తే ఇక్కడ ముక్కోణపు పోటీ తప్పదనే అనిపిస్తోంది.

ఇదే సమయంలో ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలకూడదంటే ఆత్మకూరు నియోజకవర్గం ఉపఎన్నికను ప్రతిపక్షాలు ప్రయోగాత్మకంగా తీసుకుంటాయేమో చూడాలి. మిత్రపక్షాల తరపున పోటీచేయబోయేది బీజేపీ అభ్యర్ధి కాబట్టి ప్రయోగం కాస్త అనుమానమే.

సరే విషయం ఏదైనా ఇంతకాలం చంద్రబాబునాయుడు చెబుతున్నట్లు వైసీపీ అభ్యర్థి ఓడిపోతారేమో చూడాలి. ప్రజలంతా జగన్మోహన్ రెడ్డిపై మండిపోతున్నారని, ఎన్నికలు ఎప్పుడు వస్తాయా ఎప్పుడు వైసీపీ ప్రభుత్వాన్ని ఎంత చిత్తుగా ఓడిద్దామా ? అని ఎదురుచూస్తున్నట్లు చంద్రబాబు చెబుతున్నారు.

మరి చంద్రబాబు చెబుతున్నదే టీడీపీ అభ్యర్థి కచ్చితంగా గెలవాలి. జగన్ ప్రభుత్వంపై నిజంగానే జనాల్లో అంతటి వ్యతిరేకతే ఉంటే గౌతమ్ మరణం తాలూకు సానుభూతిని అధిగమించి టీడీపీ గెలవాలి. మామూలుగా అయితే సానుభూతి వర్కవుటయితే మరణించిన నేత కుటుంబసభ్యులే గెలవాలి.

కానీ ఇపుడు చంద్రబాబు చెబుతున్న మాటలు అలా అనిపించటం లేదు. కాబట్టి జగన్ పై ప్రజావ్యతిరేకత ముందు సానుభూతి పని చేయకూడదు. నంద్యాలలో వైసీపీ అభ్యర్ధి భూమా నాగిరెడ్డి మరణం కారణంగా జరిగిన ఉపఎన్నికలో టీడీపీ అభ్యర్ధి గెలిచిన విషయం గుర్తుండే ఉంటుంది. అదే పద్ధతిలో రేపటి ఎన్నికల్లో సానుభూతి పనిచేయకండా టీడీపీ అభ్యర్ధే గెలవాలి. మరి చంద్రబాబు మాట నిజమవుతుందా ?