Begin typing your search above and press return to search.
యుద్ధం మరింత తీవ్రమవుతుందా?
By: Tupaki Desk | 24 Aug 2022 9:32 AM GMTయుద్ధం సందర్భంగా ఉక్రెయిన్ పై రష్యా సైన్యం మరింతగా రెచ్చిపోనున్నదా ? బుధవారం ఉక్రెయిన్ స్వాతంత్ర్య దినోత్సవం కాబట్టి తీవ్రస్థాయిలో విరుచుకుపడాలని రష్యా డిసైడ్ అయినట్లు ఇటు అమెరికా అటు ఉక్రెయిన్ ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికే దేశంలోని అనేక నగరాలు యుద్ధం కారణంగా దాదాపు నాశనమైపోయాయి. కీలకమైన తీరప్రాంత నగరాలు, వాణిజ్య నగరాలు, విద్యా సంస్ధలకు పేరున్న నగరాలు కూడా ధ్వంసమైపోయాయి.
యుద్ధం కారణంగా వర్తక, వాణిజ్య సంస్థలు, సముదాయాలు, రెసిడెన్షియల్ ప్రాంతాలు కూడా దాదాపుగా దెబ్బతినేశాయి. లక్షలాది మంది ప్రజలు దేశం విడిచి పారిపోయారు. వేలాదిమంది మామూలు జనాలతో పాటు సైనికులు కూడా చనిపోయారు. ఇదంతా సరిపోదన్నట్లుగా బుధవారం నుండి ఉక్రెయిన్ పై మరింత తీవ్రంగా విరుచుకుపడాలని రష్యా డిసైడ్ అయ్యిందట. ఇదే విషయాన్ని అమెరికా తన పౌరులకు పదే పదే హెచ్చరికలు చేస్తోంది.
వెంటనే ఉక్రెయిన్ దేశం నుండి అందుబాటులో ఉన్న మార్గాల్లో అమెరికా పౌరులంతా ఇతర దేశాలకు వెళ్ళిపోవాలని హెచ్చరించింది. ఉక్రెయిన్ పై రష్యా సైన్యం ఏ నిముషంలో అయినా అణ్వాయుధాలతో దాడులు చేసే అవకాశాలు ఉన్నాయని అమెరికాతో పాటు దాని మిత్ర దేశాలు ఆందోళన వ్యక్తంచేస్తున్నాయి.
అణ్వాయుధాలను ప్రయోగించే ఉద్దేశం తమకు లేదని రష్యా అధినేత పుతిన్ చెప్పినప్పటికీ మిత్రదేశాలు నమ్మటంలేదు. అయితే తాజాగా ఉక్రెయిన్లోని రష్యా సైనికులపై విష ప్రయోగాలు జరుగుతున్నాయి. తమ సైనికులపై ఉక్రెయిన్ విషప్రయోగం చేస్తుండటాన్ని రష్యా చాలా తీవ్రంగా పరిగణిస్తోంది.
తమ సైనికులపై ఉక్రెయిన్ విష ప్రయోగం చేసి చంపే ప్రయత్నాలు చేస్తున్నపుడు తాము మాత్రం ఉక్రెయిన్ పై అణ్వాయుధాలను ఎందుకు ప్రయోగించకూడదనే అంశాన్ని పుతిన్ పరిశీలిస్తున్నారట. నిషేధిత పద్దతుల్లో యుద్ధం చేయటాన్ని మొదటి ఉక్రెయినే ఉల్లంఘించిందని రష్యా సైన్యాధికారులు ఆరోపిస్తున్నారు.
కాబట్టి ఇపుడు తాము ఏ పద్దతుల్లో యుద్ధాన్ని తీవ్రతరం చేసినా ఎవరూ అభ్యంతరాలు చెప్పేందుకు లేదని పుతిన్ భావిస్తున్నారట. అందుకనే ఎప్పుడేం జరుగుతుందోని అమెరికా, మిత్రదేశాలు టెన్షన్ పడుతున్నాయి.