Begin typing your search above and press return to search.

వివేకా నిందితుల‌ను చంపేస్తారా? చంద్ర‌బాబు చేసిన కామెంట్ ఏంటి?

By:  Tupaki Desk   |   12 Feb 2022 4:55 PM GMT
వివేకా నిందితుల‌ను చంపేస్తారా?  చంద్ర‌బాబు చేసిన కామెంట్ ఏంటి?
X
ఏపీ సీఎం జ‌గ‌న్ చిన్నాన్న‌.. మాజీ మంత్రి వివేకానంద‌రెడ్డి హ‌త్య కేసుకు సంబంధించి తాజాగా ఏపీ మాజీ సీఎం, టీడీపీ అధినేత‌ చంద్ర‌బాబు సంచ‌ల‌న కామెంట్లుచేశారు. వ‌రుణ్‌రెడ్డి అనే అధికారిని వినియోగిం చి.. జ‌గ‌న్ స‌ర్కారు ఈ కేసులో నిందితులుగా ఉన్న‌వారిని హ‌త్య‌చేసేందుకు ప‌క్కా ప్లాన్ సిద్ధం చేసిన‌ట్టుగా ఆయ‌న ఆరోప‌ణ‌లు చేశారు. కడప జైలులో ఉన్న మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్యకేసు నిందితుల హత్యకు.. జైలర్ వరుణ్ రెడ్డి ద్వారా కుట్ర జరుగుతోందని చంద్రబాబు సంచలన ఆరోపణలు చేశారు.

పరిటాల రవి హత్య కేసు నిందితుడు మొద్దు శ్రీను హత్య జరిగినప్పుడు అనంతపురం జైలర్గా ఉన్న వరుణ్ రెడ్డినే.. ఇప్పుడు కడప జైలర్గా నియమించార‌ని.. దీనిపై అనుమానాలు ఉన్నాయ‌ని బాబు అన్నారు. దీనివెనుక కుట్ర కోణం దాగుందన్నారు. ఈ విషయమై సీబీఐకి లేఖ రాయనున్నట్లు చంద్రబాబు వెల్లడించారు.

వివేకా హత్య కేసుతో సీఎం జగన్, ఎంపీ అవినాశ్ రెడ్డికి సంబంధం ఉందని ఆరోపించిన చంద్రబాబు.. వరుణ్ రెడ్డి సాయంతో వారు నిందితుల హత్యకు కుట్ర పన్నుతున్నారన్నారు. మొద్దు శ్రీను హత్య తర్వాత చాలా కాలం సస్పెన్షన్లో ఉన్న వరుణ్ రెడ్డిని ఇప్పుడు వివేకా హత్య కేసు నిందితులు ఉన్న కడప జైలుకు జైలర్గా నియమించటం వెనుక కుట్ర దాగి ఉందన్నారు.

వివేకా హత్య కేసు నిందితుల హత్యకు కుట్ర జరుగుతోంద‌న్న చంద్ర‌బాబు... మొద్దు శ్రీను హత్య సమయంలో అనంతపురం జైలర్‌గా వరుణ్‌రెడ్డి ఉన్నారని తెలిపారు. వరుణ్ రెడ్డిని ఇప్పుడు కడప జైలర్‌గా నియమించారని, వివేకా హత్యకేసులో నిందితులు ప్రస్తుతం కడప జైలులో ఉన్నారని, కడప జైలర్‌గా వరుణ్‌ రెడ్డి నియామకంపై సీబీఐకి లేఖ రాస్తామ‌ని చెప్పారు.

కడప జైల్లో ఉన్న వివేకా హత్య కేసు నిందితులకు ప్రాణహాని ఉందని చంద్ర‌బాబు వ్యాఖ్యానించారు. సీఎం జగన్ రెడ్డి, ఎంపీ అవినాష్ రెడ్డి సాయంతో వరుణ్ రెడ్డి ద్వారా ప్రాణహాని ఉందని చెప్పారు. ప్ర‌స్తుతం చంద్ర‌బాబు వ్యాఖ్య‌లు.. సంచ‌ల‌నంగా మారాయి.