Begin typing your search above and press return to search.
ప్రపంచం గ్లోబల్ విలేజేస్ గా మారిపోతుందా..!
By: Tupaki Desk | 4 Jan 2023 3:30 PMఇంటర్నెట్ ఆవిర్భావం తర్వాత మనిషి జీవన విధానం చాలా వరకు సులువైంది. ఇక స్మార్ట్ ఫోన్ అందరికీ అందుబాటులోకి రావడంతో పాటు కారుచౌకగా డాటా ప్యాకేజీలు లభ్యమవుతుండంతో యావత్ ప్రపంచం అరచేతిలోనే ఇమిడిపోయింది. ఫోన్లో ఒక్క బటన్ నొక్కితే చాలు కాలు కదపకుండానే పనులన్నీ క్షణాల్లో జరిగిపోతున్నాయి.
ఇలాంటి సమయంలోనే కరోనా ఎంట్రీ ఇవ్వడంతో ఉద్యోగాల స్వరూపమే మారిపోయింది. కరోనా ముందుకు చాలా మంది ఉదయాన్నే లేచి.. రెడీ అయి.. టిఫిన్ చేసి.. బస్సో.. కారో పట్టుకొని పొలోమంటూ ఆఫీసుకు వెళ్లిపోయేవారు. తిరిగి సాయంత్రం అదే కారో.. బస్సో పట్టుకొని ఇంటికి చేరుకునేవారు. రాత్రి ఫ్యామిలీతో కొంత సమయం గడిపి తిరిగి పొద్దున మళ్లీ అదే పని రోటిన్ గా చేసేవారు.
అయితే కరోనా పరిస్థితుల నేపథ్యంలో కార్యాలయాన్నీ మూతపడ్డాయి. దీంతో ఉద్యోగులను కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకునేందుకు అవకాశం కల్పించాయి. దీంతో ఉద్యోగులంతా తమ తమ గ్రామాల్లోని ఇంటి నుంచి స్వచ్ఛమైన గాలిని పీలుస్తూ ఉద్యోగాలు చేసుకునే అవకాశం లభించింది. ఈ అవకాశాన్ని వారంతా సద్వినియోగం చేసుకున్నారు.
భారత్ అన్ని దేశాలు కరోనా సమయంలో ఈ విధానాన్ని ఎంతగానో ప్రోత్సహించాయి. ఆ తర్వాత కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో ఉద్యోగులంతా తిరిగి కార్యాలయాల నుంచి విధులు నిర్వహిస్తున్నారు. అయితే అమెరికాలోని పలు నగరాలు తిరిగి ఖాళీ అవుతున్నాయి. ఉద్యోగులంతా ఇంటి నుంచే రిమోట్ సెన్సింగ్ విధానంలో పని చేస్తుండడంతో ఈ పరిస్థితి వచ్చింది.
పార్టనర్ షిప్ ఫర్ న్యూయార్క్ సిటీ అనే సంస్థ నిర్వహించిన సర్వే ప్రకారంగా వారంలో కొన్ని రోజులైన రిమోట్ వర్క్ విధానం అమల్లో ఉండనుంది. అంటే ఆఫీసుకు వెళ్లకుండా పని చేసే విధానం. రాబోయే రోజుల్లో ఇది కొనసాగుతోందని పేర్కొంది. కరోనా కారణంగా గత రెండేళ్లలో న్యూయార్క్‌లోని మన్‌హాటన్ దీవిలో నివసించే జనంలో ఎక్కువమంది ఇతర నగరాలు.. రాష్ట్రాల్లో ఇళ్లు.. అపార్ట్‌మెంట్ల కోసం వెదుకుతున్నారు.
2020 మార్చి నాటికి ఇలాంటి వారి సంఖ్య 2 లక్షలుగా ఉంది. న్యూయార్క్ లోని క్వీన్స్.. బ్రూక్లిన్ కౌంటీల నుంచి చాలామంది బయటకు వెళ్లిపోయారు. క్వీన్స్ కౌంటీ నుంచి 51 వేల మంది.. బ్రూక్లిన్ కౌంటీ నుంచి 88 వేల మంది వేరే చోటుకు తరలి పోయినట్లు తెలుస్తోంది. వీరంతా కూడా తమ ఇళ్ల నుంచి రిమోట్ వర్క్ విధానంలో పని చేస్తున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. దీని ప్రభావంతో న్యూయార్క్ నగర జనాభా తగ్గిపోవటం.. పన్ను ఆదాయం పడిపోవటం.. వ్యాపారాలు తరలిపోతున్నాయి.
ఉద్యోగులంతా ఇంటి నుంచే వర్క్ ఫ్రమ్ హోం.. రిమోట్ విధానంలో పని చేస్తుండడంతో న్యూయార్క్ కు ప్రతి రోజు ఆఫీసుకు వచ్చే వారి సంఖ్య 8 శాతానికి పడిపోయింది. గత సెప్టెంబర్‌లో నిర్వహించిన సర్వే ప్రకారం 16 శాతం మంది వర్క్ ఫ్రమ్ హోమ్ కొనసాగిస్తుండగా.. కేవలం 9 శాతం మంది మాత్రమే ప్రతి రోజు ఆఫీసుకు ప్రయాణిస్తున్నారని వెల్లడైంది.
ఫలితంగా చాలా ఆఫీసులు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. దీంతో వ్యాపార సంస్థలు.. నగర నివాసుల నుంచి పన్ను ఎగవేత సమస్య తలెత్తుతోంది. ఈ మేరకు న్యూయార్క్ నగరంలోని కొన్ని ఆఫీస్ కార్యాలయాలు నివాస కేంద్రాలుగా మారుతున్నాయి. దీని వల్ల వ్యాపారాలు మళ్లీ పుంజుకునే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఏది ఏమైనా కరోనా ఎఫెక్ట్ ఉద్యోగులకు మాత్రం ఉన్నచోటే కొత్త అవకాశాలు కల్పించిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.