Begin typing your search above and press return to search.

సీఎంతో ఎమ్మెల్యేల‌కు పెద్ద‌గ్యాప్ అందుకేనా?

By:  Tupaki Desk   |   25 Oct 2021 12:30 PM GMT
సీఎంతో ఎమ్మెల్యేల‌కు పెద్ద‌గ్యాప్ అందుకేనా?
X
ఏ రాష్ట్రంలో అయినా.. అధికారంలో ఉన్న పార్టీలో.. ముఖ్య‌మంత్రి, ఎమ్మెల్యేల‌కు మ‌ధ్య అవినాభావ సం బంధాలు ఉండాలి. అప్పుడే రాష్ట్రంలో అభివృద్ధి సాధ్య‌మ‌వుతుంది. అంతేకాదు.. ప్ర‌భుత్వం ఏం చేస్తు న్నా.. ప్ర‌జ‌ల‌కు, నాయ‌కుల‌కు మ‌ధ్య కూడా అవినాభావ సంబంధాలు కొన‌సాగుతాయి. అయితే.. ఏపీలో చిత్ర‌మైన ప‌రిస్థితి నెల‌కొంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఇక్కడ ముఖ్య‌మంత్రికి, పార్టీ ఎమ్మెల్యేల‌కు మ‌ధ్య పెద్ద గ్యాప్ పెరిగిపోయింద‌ని అంటున్నారు. ఇదే.. ఈ మ‌ధ్య నేష‌న‌ల్ స‌ర్వేలోనూ ఎమ్మెల్యేల‌పై ప్ర‌జ‌లు భారీగా కోపం ఉంద‌నే రిజ‌ల్ట్‌ను కూడా తెప్పించింద‌ని అంటున్నారు.

నిజానికి రెండున్న‌రేళ్ల వైసీపీ పాల‌న‌లో.. ఎక్కువ మంది కొత్త ఎమ్మెల్యేల‌ను గెలిపించుకున్న వైసీపీకి ఆనందం ఉండాలి. కానీ, ఇప్పుడు ప్ర‌జ‌లు ఆగ్ర‌హంతో ఉన్నార‌ని స‌ర్వే చెప్పింది. దీంతో ఎమ్మెల్యేలు చాలా మంది తీవ్ర ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. అస‌లు త‌మ‌పై ప్ర‌జ‌లకు ఎందుకు ఆగ్ర‌హం.. అంటూ.. వారు త‌మ అనుచ‌రుల వ‌ద్ద ఆవేద‌న వ్య‌క్తం చేశారు. దీనిని బ‌ట్టి..అంటేస‌ద‌రు ఎమ్మెల్యేలు చెబుతున్న మాట‌ల‌ను బ‌ట్టి.. వాళ్లు ఏమీ చేయ‌లేని స్థితిలో ఉన్నార‌ని అంటున్నారు. మాకే దిక్కులేద‌.. ఇక‌. పార్టీ కేడ‌ర్‌కు దిక్కేముంటుంది!? అని వారు ప్ర‌శ్నిస్తున్నార‌ట‌.

అభివృద్ధి నిధులు ఇచ్చి.. చేసుకోమంటే.. గ్రామాల్లో తిరిగి.. ప్ర‌జ‌ల ద‌గ్గ‌ర‌కు వెళ్లి.. వారి స‌మ‌స్య‌లు తెలుసు కుని ప‌నులు చేయిస్తామ‌ని, కానీ, నిధులే ఇవ్వ‌న‌ప్పుడు.. తాము ఏం చేస్తామ‌ని.. వారు ప్ర‌శ్నిస్తున్నారు. చేతి లో పైసా లేన‌ప్పుడు.. ప్ర‌జ‌ల ద‌గ్గ‌ర‌కు వెళ్లినా.. ఏం ప్ర‌యోజ‌నం.. ఏం చేస్తాం.. అని వారు అంటున్నారు. ఇక‌, ఇదిలావుంటే.. ఎమ్మెల్యేల‌పై ప్ర‌జ‌ల‌కు ఆగ్ర‌హం ఉంద‌నే స‌ర్వేలో.. కొన్ని విష‌యాలు సూటిగా పేర్కొ న్నార‌ట‌. ఇప్పుడు వాటిపైనా ఎమ్మెల్యేల మ‌ధ్య చ‌ర్చ సాగుతుండ‌డం గ‌మ‌నార్హం.

స‌ర్వేలో తేలిన మ‌రిన్న విష‌యాలు.. ఇవే..

+ ఎమ్మెల్యేల‌కు సీఎం అప్పాయింట్‌మెంట్ ఇవ్వ‌డం లేదు.
+ సీఎంకు ఉన్న స‌ల‌హాదారులు.. స‌రైన స‌ల‌హాలు ఇవ్వ‌క‌పోవ‌డం
+ పాల‌నా ప‌రంగా ముఖ్య‌మంత్రికి స‌ల‌హాలు ఇచ్చేవారు లేక పోవ‌డం
+ ముఖ్య‌మంత్రిగా ప‌గ్గాలు చేప‌ట్టాక‌.. ఒక్క‌సారి కూడా పార్టీ కేడ‌ర్‌తో మాట్లాడ‌క‌పోవ‌డం
+ వలంటీర్ వ్య‌వ‌స్థ‌ను రాజ‌కీయ వ్య‌వ‌స్థ‌కు స‌మాంత‌రంగా మార్చ‌డం
+ అభివృద్ధి లేక పోవ‌డం
+ ఎమ్మెల్యేకు కేడ‌ర్‌కు గ్యాప్ ఏర్ప‌డ‌డం
+ బూత్ స్థాయిలో పీకే టీం బ‌ల‌ప‌రిచి ఇప్పుడు ప‌ట్టించుకోక‌పోవ‌డం
+ టీడీపీ నుంచి జంప్ చేసిన వారికే ప‌నులు చేయ‌డం
+ ఇండైరెక్ట్‌గా బీజేపీకి స‌పోర్ట్ చేసినా..నిధులు ఇవ్వ‌క‌పోవ‌డం
+ ప్రాజెక్టులు పూర్తికాక‌పోవ‌డం
+ మ‌ళ్లీ పీకే వ‌స్తున్నాడంటే.. ఎమ్మెల్యేల్లో వ‌ణుకు
ఇలా.. అనేక స‌మ‌స్య‌ల్లో ఉన్నార‌ని.. స‌ర్వేలో తేలిన‌ట్టు.. వైసీపీ నేత‌లు గుస‌గుస‌లాడుకుంటున్నారు.