Begin typing your search above and press return to search.
ఏపీ టీడీపీ.. ప్రక్షాళనపై బాబు సంచలన నిర్ణయం.!?
By: Tupaki Desk | 7 Feb 2020 5:30 AM GMTఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కొలేక టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు చతికిలపడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి ముందు చంద్రబాబు నాయుడి చాణక్యం పని చేయడం లేదు. వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఎంత కట్టడి చేయాలన్న సాధ్యపడటం లేదు. సీఎం జగన్మోహన్ రెడ్డి ఏపీలో వికేంద్రీకరణ బిల్లు తీసుకురావడంతో టీడీపీ పార్టీకి కొంత నష్టం జరిగింది. చంద్రబాబు నాయుడు రాజధానిగా అమరావతినే కొనసాగించాలని పట్టుబడుతుండటంతో ఉత్తరాంధ్ర, రాయలసీమలో టీడీపీ గల్లంతయ్యే అవకాశం కన్పిస్తుంది. దీంతో ఆ ప్రాంతాల్లో పార్టీని చక్కదిద్దటంతోపాటు జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కొనేందుకు కొత్త సైన్యాన్ని చంద్రబాబు రెడీ చేస్తున్నారు. అందులో భాగంగా త్వరలో ఏపీ టీడీపీ ప్రక్షాళన ఉంటుందని ప్రచారం జరుగుతుంది. పార్టీ పదవుల్లో యువతకు, వైసీపీని బలంగా ఎదుర్కొనే వారికే పదవులు దక్కే అవకాశం కన్పిస్తోంది.
చంద్రబాబు నాయుడు ఇప్పటికే వైసీపీని బలంగా ఎదుర్కొనే వారికి పదవులు కట్టబెట్టారు. మహిళా అధ్యక్ష పదవికి వంగలపూడి అనితను నియమించారు. ఆమె వైసీపీని ధీటుగా ఎదుర్కొంటోంది. దీంతో మరి కొందరికీ పార్టీ పదవులను కట్టబెట్టే ఆలోచన చేస్తున్నరని తెలుస్తోంది. రాజధాని నిర్ణయంతో ఉత్తరాంధ్ర లో టీడీపీ కొంత ఇబ్బందికర పరిస్థితి ఎదుర్కొంటుంది. దీంతో ఆ ప్రాంతానికి చెందిన మాజీ మంత్రి అచ్చెనాయుడి ని ఏపీ టీడీపీ అధ్యక్షుడి గా చేయాలని భావిస్తున్నారని సమాచారం. ప్రస్తుత ఏపీ టీడీపీ అధ్యక్షుడు కళా వెంకట్రావ్ కిందటి అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. పార్టీని కూడా ముందుండి నడిపించ లేకపోతున్నారని చంద్రబాబు భావిస్తున్నారు. ఈ పదవీని కొత్త వారికి కట్టబెట్టాలని యోచిస్తున్నారు.
ఏపీ టీడీపీ అధ్యక్ష పదవీని అచ్చెన్నెయుడికి కట్టబెట్టాలని చంద్రబాబు భావిస్తున్నారట. ప్రస్తుతం ఆయన టెక్కలి నుంచి అచ్చెన్నాయుడు ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆయనకు శ్రీకాకుళం, విశాఖపట్నంతో మంచి సంబంధాలు ఉన్నాయి. అంతేకాకుండా టీడీపీ వీరవిధేయుడిని పేరు తెచ్చుకున్నాడు. అంతేకాకుండా అసెంబ్లీలో చంద్రబాబు నాయుడికి కుడిభుజంలా పని చేస్తున్నారు. దీంతో ఏపీ టీడీపీ అధ్యక్ష పదవీ అచ్చెన్నాయుడికి దక్కుతుందని ప్రచారం జరుగుతుంది. చంద్రబాబు నాయుడు పార్టీ ని సంస్థాగతం చేసే పనిలో పడ్డారు. దీంతో టీడీపీ భారీ మార్పులను చేయాలని భావిస్తున్నారు. దీనిలో భాగంగా ముందు ఏపీ టీడీపీ అధ్యక్షుడిని మార్చాలని భావిస్తున్నారు. అంతేకాకుండా యువతకు, పార్టీలోని వీరవిధేయులకు పెద్దపీట వేయాలని భావిస్తున్నారు. త్వరలోనే టీడీపీలో భారీ మార్పులతోపాటు, పార్టీ పదవులు పందేరం మొదలు కానుందని తెలుస్తోంది.