Begin typing your search above and press return to search.

ముంద‌స్తే వ‌స్తే.. బాబు నిలుస్తారా? పార్టీని గెలిపిస్తారా?

By:  Tupaki Desk   |   26 Aug 2021 4:30 PM GMT
ముంద‌స్తే వ‌స్తే.. బాబు నిలుస్తారా?  పార్టీని గెలిపిస్తారా?
X
ఏపీలో ముంద‌స్తు ఎన్నిక‌లు వ‌స్తాయా? వ‌స్తే.. ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీ ప‌రిస్థితి ఏంటి? పార్టీ నిల‌దొక్కు కుని తిరిగి అధికారంలోకి రాగ‌ల‌దా? ఇదీ.. ఇప్పుడు టీడీపీ శ్రేణుల‌నే కాదు.. రాజ‌కీయ వ‌ర్గాల్లోనూ తీవ్రంగా ఆలో చింప‌జేస్తున్న విష‌యం. నిజానికి టీడీపీ అధినేత చంద్ర‌బాబు.. కొన్నాళ్లుగా.. అంటే.. తొలిద‌శ క‌రోనా త‌ర్వా త‌.. కేంద్రం నుంచి వ‌చ్చిన సంకేతాల నేప‌థ్యంలో పార్టీ నేత‌ల‌తో ఎప్పుడు మాట్లాడినా.. `జ‌మిలి వ‌స్తుంది.. ఎన్నిక‌ల‌కు సిద్ధంగా ఉండండి!` అంటూ.. హ‌డావుడి చేశారు. ఈ క్ర‌మంలోనే పార్టీలో గ‌తంలో లేని విధంగా పార్ల‌మెంట‌రీ పార్టీ అధ్య‌క్షుల‌ను నియ‌మించారు. మండ‌ల‌స్థాయి నేత‌ల‌ను నియ‌మించారు.

అదేస‌మ‌యంలో మ‌హిళ‌ల‌కు కూడా భారీ ఎత్తున ప‌ద‌వులు పందేరం చేశారు. నిత్యం జూమ్ యాప్ ద్వా రా.. మీటింగులు పెట్టారు. మొత్తంగా జ‌మిలి వ‌స్తుంద‌నే ఊహ‌ల‌కు తెర‌దీశారు. అయితే..అనూహ్యంగా ఈ విష‌యంపై కేంద్రంలోని న‌రేంద్ర మోడీ ప్ర‌భుత్వం మ‌ళ్లీ సైలెంట్ అయిపోయింది. వ‌చ్చే ఏడాది యూ పీ ఎన్నిక‌లు స‌హా ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు రెడీ అయిపోయింది. దీనిని బ‌ట్టి జ‌మిలి లేద‌ని స్ప‌ష్ట మైంది. ఇక‌.పోతే.. ఏపీ సర్కారే ఎన్నిక‌ల‌కు రెడీ అవుతోంద‌నే వాద‌న వినిపిస్తోంది. విప‌క్షాలు చేస్తున్న విమ‌ర్శ‌ల‌కు చెక్ పెట్టేలా. జ‌గ‌న్ ప్ర‌భుత్వం ముంద‌స్తు ఎన్నిక‌ల‌కు వెళ్లి.. ప్ర‌జ‌ల్లో త‌మ‌కు తిరుగులేని ప్ర‌జాద‌ర‌ణ ఉంద‌ని నిరూపించుకునేందుకు ప్ర‌య‌త్నిస్తోంద‌ని.. అంటున్నారు.

అయితే, దీనిపై అధికారికంగా ఎలాంటి ప్ర‌క‌ట‌నా రాక‌పోయినా.. రాజ‌కీయ వ‌ర్గాల్లో మాత్రం చ‌ర్చ‌కు దారి తీసింది. ఈక్ర‌మంలో ముంద‌స్తు క‌న‌నుక వ‌స్తే.. టీడీపీ ప‌ట్టు బిగించి.. ఎన్నిక‌ల్లో గెలుపు గుర్రం ఎక్క‌గ‌లదా ? అనేది మిలియ‌న్ డాల‌ర్ల ప్ర‌శ్న‌గా మారిపోయింది. ఎందుకంటే.. పార్టీ పైకి క‌నిపిస్తున్న‌ట్టుగా.. క్షేత్ర‌స్థాయి లో మాత్రం బ‌లంగా లేద‌నేది వాస్త‌వం. ఎందుకంటే.. చాలా మంది నాయ‌కులు.. పార్టీలో ఉన్నా.. మౌనంగా ఉంటున్నారు. కేడ‌ర్‌ను ప‌ట్టించుకోవ‌డం లేదు. చంద్ర‌బాబు పిలుపు ఇస్తే.. ఆ ప‌ది మంది త‌ప్ప‌.. ఇత‌ర నేత‌లు ఎవ‌రూ రియాక్ట్ కావ‌డం లేదు. ఈ ప‌రిణామ‌మే ఈ నెల మార్చిలో జ‌రిగిన స్థానిక ఎన్నిక‌ల‌పై ప్ర‌భా వం చూపించింది.

తిరుప‌తి పార్ల‌మెంటు ఉప ఎన్నిక‌లోనూ చంద్ర‌బాబు అక్క‌డే ఉండి ప్ర‌చారం చేసినా.. ఫ‌లితం ద‌క్క‌లేదు. అంటే.. దీనిని బ‌ట్టి పార్టీ ఇబ్బందుల్లో ఉంద‌నే విష‌యం స్ప‌ష్ట‌మ‌వుతోంది. ఇక‌, ఇదే స‌మ‌యంలో 40 నియోజ‌క‌వ‌ర్గాల్లో పార్టీకి నాయ‌కులు లేక‌పోవ‌డం గ‌మ‌నార్హం. రాష్ట్ర వ్యాప్తంగా.. 40 నియోజ‌క‌వ‌ర్గాల్లో.. టీడీపీ ని న‌డిపించే వారు ఇప్ప‌టికిప్పుడు లేక‌పోవ‌డం గ‌మ‌నార్హం. వీటిలో విజ‌య‌న‌గ‌రం నుంచి అనంత‌పురం వ‌ర‌కు ఉన్నాయి. గ‌త ఎన్నిక‌ల్లో పోటీ చేసిన వారు.. చాలా మంది ఓడిపోయారు. అయితే..త మ ఓట‌మికి.. అంత‌ర్గ‌త రాజ‌కీయమే కార‌ణమంటూ.. వీరంతా దూరంగా ఉన్నారు. కొంద‌రు పార్టీ వైఖ‌రిపై గుస్సాగా ఉన్నారు.

దీంతో పార్టీలో ప‌రిస్థితి ఇబ్బందిక‌రంగానే ఉంది. వీటికితోడు.. పార్టీ అధినేత చంద్ర‌బాబును ఫాలో అయ్యే వారిలోనూ ఇప్పుడు విభేదాలు పెరిగిపోయాయి. క‌మ్మ సామాజిక వ‌ర్గంలోనూ.. గ‌తంలో అధికారంలో ఉన్నప్పుడు.. ప‌నులు చేయించుకున్న నేతలు.. ఇప్పుడు పార్టీకి దూరంగా ఉంటున్నారు. కొంద‌రు పార్టీ మారిపోయారు. ఇక‌, గ‌త ప్ర‌భుత్వ హ‌యాంలో ప‌నులు చేయించుకోలేక‌.. ప‌ద‌వులు కూడా పొంద‌లేని క‌మ్మ సామాజిక వ‌ర్గం పార్టీలోనే ఉన్నా.. అధికార పార్టీ నేత‌ల‌తో మిలాఖ‌త్ అయి.. ప‌నులు నిర్వ‌హించుకుం టోంద‌నే వాద‌న వినిపిస్తోంది. ఈ ప‌రిణాలు స‌హ‌జంగానే ఆయా నియోజ‌క‌వ‌ర్గాల్లో టీడీపీని డైల్యూట్ చేశాయి. అంటే.. ఒక‌ర‌కంగా చెప్పాలంటే.. టీడీపీ ప‌రిస్థితి అస్త‌వ్య‌స్థంగాఆ ఉంద‌నేది స్ప‌ష్ట‌మ‌వుతోంది. ఇలాంటి ప‌రిస్థితిలో ముంద‌స్తు వ‌స్తే.. టీడీపీ ఘోరంగా దెబ్బ‌తిన‌డం ఖాయ‌మ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.