Begin typing your search above and press return to search.
ఆ వైసీపీ ఎమ్మెల్యే రాకను వారు ఒప్పుకుంటారా?
By: Tupaki Desk | 27 Dec 2022 11:30 AM GMTఆంధ్రప్రదేశ్ లో వైఎస్సార్సీపీ అత్యంత బలంగా ఉన్న జిల్లాల్లో నెల్లూరు జిల్లా ఒకటి. గత ఎన్నికల్లో నెల్లూరు జిల్లాలో ఉన్న 10 అసెంబ్లీ స్థానాలను వైఎస్సార్సీపీ గెలుచుకుంది. కాగా ప్రస్తుతం అదే జిల్లాలో వెంకటగిరి నుంచి ఆనం రాంనారాయణరెడ్డి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
నెల్లూరు జిల్లాలో ఆనం కుటుంబం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. రాష్ట్రంలోనే రాజకీయంగా ప్రత్యేకత కలిగిన కుటుంబాల్లో ఆనం కుటుంబం ఒకటి. ఈ కుటుంబం నుంచి గతంలో ఆనం రాంనారాయణరెడ్డి సోదరుడు ఆనం వివేకానందరెడ్డి కూడా ఎమ్మెల్యేగా పలుమార్లు గెలిచారు. ఆ తర్వాత ఆయన అనారోగ్యంతో కన్నుమూశారు.
కాగా ఆనం రామనారాయణరెడ్డి 2004, 2009లో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, తర్వాత ఆయన మరణించాక రోశయ్య, కిరణ్ కుమార్‌రెడ్డి మంత్రివర్గాల్లో ఆర్థికం వంటి కీలక శాఖలకు మంత్రిగా చక్రం తిప్పారు. ఒకానొక దశలో ముఖ్యమంత్రి పదవికి కూడా ఆయన పేరు వినిపించింది. ఆ సమయంలో వైఎస్ జగన్ కాంగ్రెస్ నుంచి వేరుపడి వేరే పార్టీ ఏర్పాటు చేసినప్పుడు జగన్‌పై ఘాటు విమర్శలు చేసినవారిలో ఆనం రాంనారాయణరెడ్డి ఒకరు. అయితే మారిన పరిస్థితుల్లో 2019 ఎన్నికల ముందు వైఎస్సార్సీపీలో చేరిన ఆనం రాంనారాయణరెడ్డి వెంకటగిరి నుంచి గెలుపొందారు.
అయితే ఆయనకు వైఎస్సార్సీపీలో ఎలాంటి ప్రాధాన్యత లభించలేదనే అసంతృప్తి ఉందని అంటారు. ఆయన సీనియారిటీని గుర్తించి జగన్ తగిన పదవి ఇవ్వలేదని ఆనం అనుచరుల్లోనూ అసంతృప్తి ఉందని అంటుంటారు.
ఈ నేపథ్యంలో ఈ ఏడాది మే నెల చివరలో టీడీపీ మహానాడు సందర్బంగా ఆనం రాంనారాయణరెడ్డి కుమార్తె కైవల్యా రెడ్డి.. నారా లోకేష్ తో భేటీ కావడం ఆసక్తికర చర్చకు దారి తీసింది. కైవల్యా రెడ్డి టీడీపీ తీర్థం పుచ్చుకుంటారని.. గతంలో తన తండ్రి గెలిచిన ఆత్మకూరు నుంచి టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దిగుతారని వార్తలు వచ్చాయి.
మరోవైపు తన కుమార్తె కైవల్యా రెడ్డిని ఆనం రాంనారాయణరెడ్డే టీడీపీలోకి పంపుతున్నారని గాసిప్స్ వినిపించాయి. అంతేకాకుండా గత కొంతకాలం ఆనం రాంనారాయణరెడ్డి రాష్ట్ర ప్రభుత్వంపై పలు వ్యాఖ్యలు చేస్తున్నారు. అధికారులను సైతం తూర్పూరబడుతున్నారు. ఆనం రాంనారాయణరెడ్డి టీడీపీలోకి వెళ్లనున్నారని.. అందుకే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని గాసిప్స్ వినిపిస్తున్నాయి.
జగన్ మొదటి మంత్రివర్గ విస్తరణలో నెల్లూరు నుంచి అనిల్ కుమార్ యాదవ్ కు మంత్రి పదవి దక్కింది. ఇక రెండోసారి మంత్రివర్గ విస్తరణలో కాకాణి గోవర్ధన్ రెడ్డి మంత్రి పదవి దక్కించుకున్నారు.ఈ నేపథ్యంలోనే ఆనం రాంనారాయణరెడ్డి టీడీపీ వైపు చూస్తున్నారని గాసిప్స్ వినిపిస్తున్నాయి. ఇప్పటివరకు ఈ దిశగా ఆయనైతే ఎక్కడా బయటపడలేదు. మరోవైపు ఆయన వైఎస్సార్సీపీలో కొనసాగినా వచ్చే ఎన్నికల్లో సీటు దక్కడం కష్టమేనంటున్నారు. అందుకే ఈసారి టీడీపీలో చేరి తన పాత నియోజకవర్గం ఆత్మకూరు నుంచి బరిలోకి దిగుతారని గాసిప్స్ వస్తున్నాయి.
వాస్తవానికి నెల్లూరు పట్టణంలో ఆనంకు మంచి పట్టు ఉన్నప్పటికీ పక్కనే ఉన్న వెంకటగిరి నుంచి ఆయన పోటీ చేశారు.తాజా జిల్లాల పునర్వ్యవస్థీకరణలో నెల్లూరు జిల్లాలో ఉన్న వెంకటగిరి నియోజకవర్గం తిరుపతి జిల్లాలో చేరింది. ఇప్పుడు నియోజకవర్గంలోని మూడు మండలాలు తిరుపతి జిల్లాకు చెందినవే. దీంతో ఆయన తన సొంతగడ్డ కాని, చిత్తూరు జిల్లాపై కానీ దృష్టి సారించాల్సి వస్తుంది. దీంతో నెల్లూరు పట్టణం, నెల్లూరు రూరల్ నియోజకవర్గాలతో ఆనం రామనారాయణరెడ్డికి సంబంధాలు తెగిపోతాయి.
అందుకే మళ్లీ నెల్లూరు నగరంలో అడుగుపెట్టి 2024 ఎన్నికల్లో అక్కడి నుంచి పోటీ చేయాలని ఆనం రామనారాయణరెడ్డి యోచిస్తున్నట్టు సమాచారం. ఆయన వెంకటగిరి నుంచి వెళ్లాలని అనుకోవడానికి మరో కారణం కూడా ఉంది. ఓడిన టీడీపీ అభ్యర్థి కురుగుండ్ల రామకృష్ణ వెంకటగిరిపై దృష్టి సారించారు. సొంతంగా అన్న క్యాంటీన్లు ప్రారంభించి అనేక కార్యక్రమాలు చేపట్టారు. దీంతో వెంకటగిరిలో ఆనంకు ఈసారి కష్టమేనంటున్నారు. ఆయన నెల్లూరు అర్బన్ వైపు చూడడానికి ఇదొక కారణమని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.
అయితే నెల్లూరు పట్టణంలో రవికుమార్, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్ వంటి నేతలు గట్టి నేతలు ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆనం ప్రణాళికలు ఫలిస్తాయా? లేదా అనేది వేచిచూడాల్సిందే!
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.