Begin typing your search above and press return to search.

2024లో 70 శాతం సీట్లు వాళ్ల‌కే ఇస్తారా వైసీపీలో!

By:  Tupaki Desk   |   13 April 2022 8:48 AM GMT
2024లో 70 శాతం సీట్లు వాళ్ల‌కే ఇస్తారా వైసీపీలో!
X
ఏపీలో 2019 ఎన్నిక‌ల్లో ఘ‌న విజ‌యం సాధించిన జ‌గ‌న్‌.. ఇప్ప‌టి నుంచే పార్టీని 2024 ఎన్నిక‌ల‌కు సిద్ధం చేసే క‌స‌ర‌త్తులు మొద‌లెట్టారు. వ‌రుస‌గా రెండోసారి సీఎం పీఠాన్ని అధిరోహించాల‌నే ల‌క్ష్యంతో జ‌గ‌న్ ఉన్నార‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. అందుకే ఆ ఎన్నిక‌ల్లో విజ‌య‌మే ల‌క్ష్యంగా ఇటీవ‌ల కొత్త మంత్రివ‌ర్గాన్ని ఆయ‌న ప్ర‌క‌టించారు. వేటు ప‌డ్డ మంత్రుల‌కు జిల్లాల వారీగా పార్టీ బాధ్య‌త‌లు అప్ప‌జెప్పి ఎన్నిక‌లకు పార్టీని సిద్ధం చేసే ప్ర‌య‌త్నాలు చేయ‌నున్నారు. ఈ నేప‌థ్యంలో పార్టీ వ‌ర్గాల్లో ఒక వార్త ఆస‌క్తిక‌రంగా మారింది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో 70 శాతం సీట్లు బీసీ, ఎస్సీ, ఎస్టీల‌కే ఇస్తార‌నే ప్ర‌చారం జోరుగా సాగుతోంది.

2024 ఎన్నిక‌ల‌పై దృష్టి సారించిన వైసీపీ అధిష్ఠానం ఆ దిశ‌గా సామాజిక స‌మీక‌ర‌ణాల‌పై ఫోక‌స్ పెట్టింద‌నే టాక్ వినిపిస్తోంది. ముఖ్యంగా బీసీ, ఎస్సీ, ఎస్టీల‌కు అగ్ర‌పీఠం వేసేందుకు హైక‌మాండ్ సిద్ధ‌మ‌వుతుంద‌ని జోరుగా ప్ర‌చారం సాగుతోంది. బీసీ లాంటే బ్యాక్‌వ‌ర్డ్ క్యాస్ట్ కాద‌ని పార్టీకి బ్యాక్ బోన్ అని పార్టీ అగ్ర‌నాయ‌కులు అంటున్నారు. కానీ దీనిపై పార్టీ వ‌ర్గాల్లోని విభిన్న అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. 70 శాతం సీట్లు వ‌చ్చే ఎన్నిక‌ల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ నేత‌ల‌కు ఇవ్వ‌డం అసాధ్య‌మ‌ని పార్టీలోకి మ‌రో వ‌ర్గం చెబుతోంది. ఇప్పుడు హైక‌మాండ్ ఎన్ని మాట‌లైనా చెబుతుంద‌ని కానీ ఆచ‌ర‌ణ‌లో మాత్రం సాధ్యం కాద‌ని అంటున్నారు.

అధికారంలో ఉన్న‌పుడు ఎన్ని మాట‌లైనా చెప్తార‌ని తీరా ఎన్నిక‌ల స‌మ‌యం వ‌చ్చే నాటికి ప్లేట్ ఫిరాయిస్తార‌ని స్వ‌యంగా వైసీపీ వ‌ర్గాలే మాట్లాడుకుంటుండం గ‌మ‌నార్హం. ఒక‌వేళ బీసీలంటే అంత ప్రేమ ఉంటే ఇప్పుడు జ‌గ‌న్ త‌న సీఎం ప‌ద‌విని బీసీ నేత‌కు ఇవ్వాల‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. జ‌గ‌న్ త‌న సీఎం కూర్చీని బీసీ నేత‌కు ఇచ్చి ఆయ‌న పార్టీ అధ్యక్షుడిగా వైసీపీని ఎన్నిక‌ల్లో న‌డిపించాల‌ని పార్టీ వ‌ర్గాలు అంటున్నాయి.

కొత్త ఎమ్మెల్యేల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ క‌లిపి 70 శాతం అని చెప్తున్నారు కానీ 2024 ఎన్నిక‌ల్లో 70 శాతం సీట్లు వాళ్ల‌కే కేటాయిస్తామ‌ని క‌చ్చితంగా ఎందుకు వైసీపీ అధిష్ఠానం ప్ర‌క‌టించ‌డం లేద‌నే ప్ర‌శ్న‌లు వినిపిస్తున్నాయి. పార్టీ అధినాయ‌క‌త్వం ఉద్దేశ‌పూర్వ‌కంగానే అలా చెప్ప‌డం లేద‌ని పార్టీ వ‌ర్గాలు చెబుతున్నాయి.

వైసీపీ అధిష్ఠానంపై పార్టీలోని ఓ వ‌ర్గం నుంచి తీవ్ర అసంతృప్తి వ్య‌క్త‌మ‌వుతుండ‌డం గ‌మ‌నార్హం. పార్టీకి వాడుకుని వ‌దిలేయడం అల‌వాట‌ని కొంద‌రు నేత‌లు అంటున్నారు. ఒక‌వేళ ఎస్సీ, ఎస్టీ నేత‌ల‌కు ప్రాధాన్య‌త ఇవ్వాల‌ని నిజంగానే అనుకుంటే మ‌రి జ‌న‌ర‌ల్ సీట్ల‌లో ఎస్సీ, ఎస్టీల‌ను నిల‌బెడ‌తారా? అనే ప్ర‌శ్న‌లు వేస్తున్నారు. అలా ఆ అభ్య‌ర్థుల‌ను నిల‌బెట్టి గెలిపించుకుంటే జ‌గ‌న్ చ‌రిత్ర‌ల నిలిచిపోతార‌ని కానీ అలా చేయ‌డం క‌ష్ట‌మేన‌ని పార్టీలో చ‌ర్చ జోరుగా సాగుతోంది.

ఇప్ప‌టికే పార్టీ కోసం ప‌ని చేసిన వాళ్ల‌ను అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత హైక‌మాండ్ మ‌ర్చిపోయింద‌ని కార్య‌క‌ర్త‌లు, నేత‌ల నుంచి తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్త‌మ‌వుతున్న సంగ‌తి తెలిసిందే. అందుకే పార్టీని న‌మ్మ‌లేని ప‌రిస్థితుల్లో ఉన్నామ‌ని వాళ్లు అంటున్నారు.