Begin typing your search above and press return to search.

కేసీఆర్ హామీ ఇచ్చిన తర్వాత కూడా ఇలా జరగటమా?

By:  Tupaki Desk   |   24 May 2021 10:30 AM GMT
కేసీఆర్ హామీ ఇచ్చిన తర్వాత కూడా ఇలా జరగటమా?
X
తెలంగాణరాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నోటి నుంచి మాట వచ్చిందంటే.. ఇక పని అయిపోయినట్లే. ఆయన ఏదైనా అంశం మీద ఫోకస్ చేస్తే.. ఆ పని ఎంత వేగిరంగా పూర్తి అవుతుందో తెలిసిందే. కరోనా కష్టకాలంలో ఈటల భూ కబ్జా మీద ఆరోపణలు వచ్చినంతనే.. విచారణకు ఆదేశించినంతనే రికార్డు సమయంలో ఉరుకులు పరుగులు తీసి అధికారులు నివేదిక ఎంత తక్కువ వ్యవధిలో ఇచ్చారో తెలిసిందే కదా?

కేసీఆర్ మాటకు అంత పవర్ ఉన్నప్పుడు.. మొన్న గాంధీ ఆసుపత్రికి వచ్చిన సందర్భంగా తనను కలిసిన వైద్య సిబ్బంది.. జూనియర్ డాక్టర్ల సమస్యల గురించి తెలుసుకొని.. వారి సమస్యల చిట్టాను తనకు పంపాలని.. తాను వెంటనే నిర్ణయం తీసుకుంటానని హామీ ఇచ్చారు. దీంతో.. వారంతా చాలా హ్యపీగా ఫీలయ్యారు. ఆ మాటకు వస్తే.. తమ కష్టాలన్ని తీరిపోయినట్లేనని తలచారు.

సీఎం కేసీఆర్ వచ్చి వెళ్లి మూడు.. నాలుగు రోజలు గడిచిపోయింది. తమ కష్టాలు.. దీర్ఘకాలంగా ఎదుర్కొంటున్న సమస్యల గురించిన వివరాల్ని సీఎం కేసీఆర్ కు అప్పటికప్పుడు ంపపారు. అయితే.. ఇప్పటివరకు ఎలాంటి స్పందన లేకపోవటంతో జూనియర్ వైద్యులకు ఎక్కడో కాలింది. దీంతో.. వారు నిరసన తెలిపారు. అంతేకాదు.. తమ సమస్యలపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించని పక్షంలో ఈ నెల 26 (బుధవారం) నుంచి సమ్మెకు దిగుతామని ప్రకటించారు.

జూనియర్ డాక్టర్ల డిమాండ్లలో అత్యంత ముఖ్యమైనది.. కరోనా వేళ.. ఎవరైనా జూనియర్ డాక్టర్ కు ప్రాణాపాయం కలిగితే వారి కుటుంబానికి రూ.50 లక్షలు..నర్సింగ్ సిబ్బందికి రూ.25 లక్షలు పరిహారం చెల్లించాలని.. గతంలో ప్రభుత్వం ప్రకటించిన 10 శాతం కరోనా అలవెన్సుల్ని వర్తింపచేయాలని డిమాండ్ చేస్తున్నారు. చూస్తుంటే.. వారి డిమాండ్లు సమంజసంగా ఉన్నాయని చెప్పాలి. మరి.. సారు చెప్పిన తర్వాత కూడా సమస్యలకు సొల్యూషన్ లభించకపోవటం ఏమిటి? ఏందిది కేసీఆర్.. మీరే నేరుగా హామీ ఇచ్చిన తర్వాత కూడా ఇంత ఆలస్యమైతే.. మీ ట్రాక్ రికార్డులో డాట్స పడవు?