Begin typing your search above and press return to search.
అన్ని వర్క్ వీసాలను రద్దు చేయనున్న ట్రంప్?
By: Tupaki Desk | 21 Jun 2020 2:20 PM ISTఅమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్ని వర్క్ వీసాల రద్దు దిశగా రంగం సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తోంది. దీంతో విదేశాల్లో భయాందోళనలు నెలకొన్నాయి.విదేశీ వర్క్ వీసాాలకు సంబంధించిన ట్రంప్ కీలక నిర్ణయం తీసుకున్నారని వార్తలు వస్తున్నాయి.
హెచ్1బీ, ఎల్1 వీసాలతోపాటు అన్ని వర్క్ వీసాలను ఈ ఏడాది చివరి నాటికి రద్దు చేయడానికి నిర్ణయించారని సమాచారం. ఇందుకు సంబంధించిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పై ట్రంప్ త్వరలోనే సంతకం చేయనున్నారని నేషనల్ పబ్లిక్ రేడియో పలు సంచలన కథనాలను ప్రచురించింది. దీంతో అమెరికాలో పనులు చేసుకుంటున్న విదేశీ నిపుణుల్లో తీవ్ర ఆందోళనలు ఏర్పడ్డాయి.
అమెరికా అధ్యక్షుడు అయినప్పటి నుంచి అమెరికన్స్ ఫస్ట్ నినాదంతో విద్యా, ఉద్యోగాల్లో వారికే అగ్రతాంబూలం ఇస్తున్నారు ట్రంప్. విదేశాల నుంచి వచ్చి అమెరికాలో డాలర్లు సంపాదిస్తున్న వారిని ఉండనీయకుండా నిబంధనలు, వీసాల్లో మెలికలు పెడుతూ ఇబ్బంది పెడుతున్నారు. అెమెరికన్ కంపెనీలు వ్యతిరేకిస్తున్న ట్రంప్ మాత్రం తీరు మార్చుకోవడం లేదు. అమెరికన్లకే ఉద్యోగాలు ఇవ్వాలని కరోనాతో కుదేలైన ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దడానికి ఇతర దేశాల వారిని ఈ ఏడాది చివరి నాటికి వారి దేశాలకు పంపాలని నిర్ణయించారట.. ఇందులో భాగంగానే డిసెంబర్ వరకు విదేశీ వర్క్ వీసాల రద్దు దిశగా నిర్ణయం తీసుకున్నారని సమాచారం. ఈ వార్త అమెరికాలో ఉన్న విదేశీలయులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది.