Begin typing your search above and press return to search.

తుమ్మలకు మళ్లీ పూనింది.. పార్టీ మారుతారా?

By:  Tupaki Desk   |   10 Nov 2022 11:30 AM GMT
తుమ్మలకు మళ్లీ పూనింది.. పార్టీ మారుతారా?
X
తెలంగాణ తొలి ప్రభుత్వంలో పిలిచి మరీ మంత్రి పదవి ఇచ్చి.. ఎమ్మెల్సీని చేసి తుమ్మల నాగేశ్వరరావును గౌరవించారు కేసీఆర్. అయితే ఖమ్మం జిల్లాలో రెండో దఫా ఎన్నికల్లో అసమ్మతి, అనైఖ్యతతో టీఆర్ఎస్ కేవలం ఒక ఎమ్మెల్యే సీటునే గెలిచింది. దీంతో తుమ్మలను పక్కనపెట్టి గెలిచిన ఆ ఒక్క ఎమ్మెల్యేనే మంత్రిని చేసి ఖమ్మం రాజకీయాలకు దూరం పెట్టాడు కేసీఆర్

అప్పటి నుంచి అలకబూనిన తుమ్మల నాగేశ్వరరావు అసమ్మతితో రగిలిపోతున్నారు. ఆయన పార్టీ మారేందుకు యోచిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి.ఇప్పటికే పలు మార్లు ట్రై చేసినా ఆగిపోయిన తుమ్మల తాజాగా ‘ఆత్మీయ సమ్మేళనం’ పేరిట ఒక కొత్త సమావేశానికి పూనుకోవడం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.

ములుగు జిల్లా వాజేడులో తన అభిమానులతో తుమ్మల నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనం పార్టీ మార్పుకేనన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. గురువారం ఉదయం భద్రాద్రి రామాలయం లో పూజలు చేసిన తుమ్మల దాదాపు 350 కార్లతో ర్యాలీగా వాజేడుకు వెళ్లారు.

ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఉన్న తన అనుచరులతో ఈ ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈక్రమంలోనే మరోసారి తుమ్మల పార్టీ మార్పుపై జోరుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

తుమ్మల ఆత్మీయ సమ్మేళనంపై ఇంటెలిజెన్స్ వర్గాలు ఆరాతీసినట్టు తెలిసింది. కొంతకాలం నుంచి తుమ్మల నాగేశ్వరరావు టీఆర్ఎస్ లో పొలిటికల్ గా యాక్టివ్ గా లేరు. దీంతో ఆయన పార్టీ మారుతున్నారనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. కొంతకాలంగా టీఆర్ఎస్ పార్టీ కార్యక్రమాలకు తుమ్మల దూరంగా ఉంటున్నారు.

ఇటీవల తుమ్మల కాంగ్రెస్, బీజేపీ కీలక నేతలతో టచ్ లోకి వెళ్లారని తెలిసింది. పైకి అలాంటిదేమీ లేదంటున్నా.. వచ్చే ఎన్నికల నాటికి టీఆర్ఎస్ కు తుమ్మల హ్యాండిచ్చి వేరే పార్టీలోకి మారడం ఖాయమంటున్నారు. ఈక్రమంలోనే ఏ పార్టీ మంచిదో తన అనుచరులతో కలిసి శూలశోధన చేస్తున్నట్టుగా సమాచారం.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.