Begin typing your search above and press return to search.

నిరుద్యోగ భార‌త్ నిరుప‌మాన్ భార‌త్ అవుతుందా ?

By:  Tupaki Desk   |   22 July 2022 2:30 PM GMT
నిరుద్యోగ భార‌త్ నిరుప‌మాన్ భార‌త్ అవుతుందా ?
X
చట్ట సభల్లో కేవ‌లం వ్య‌క్తిగ‌త దూషణ ధూష‌ణ‌ల‌కే ప‌రిమితం అవుతున్నార‌న్న విమ‌ర్శలు పెరుగుతున్నాయి. ఛైర్ ను అడ్ర‌స్ చేయ‌డం చాలా మంది ఎంపీలకు ఎలానో కూడా తెలియ‌డం లేద‌ని, అంత వీక్ గా క‌మ్యూనికేష‌న్ స్కిల్స్ ఉన్నాయ‌ని రాజ్య‌స‌భ చైర్మ‌న్ హోదాలో వెంక‌య్య నాయుడు లాంటి లీడ‌ర్లు కూడా ఆవేద‌న చెందిన దాఖ‌లాలు ఉన్నాయి.

ఈ నేప‌థ్యంలో నిన్న‌టి వేళ పార్ల‌మెంట్ లో నిరుద్యోగ భార‌తం గురించి ప్ర‌స్తావ‌న వ‌చ్చింది. దేశంలో ఉన్న ప్ర‌స్తుత స్థితిగతుల‌ను అద్దం పట్టే విధంగానే కేంద్రం జ‌వాబు కూడా ఉంద‌ని ఈ సంద‌ర్భంగా టీఆర్ఎస్ వాదిస్తోంది. సోష‌ల్ మీడియాలో కూడా ఇదే విధంగా త‌న వాద‌న‌ను వినిపిస్తోంది.

లక్షలాది కేంద్ర సర్వీసు రెగ్యుల‌ర్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. అయినా ఇచ్చిందీ లేదు చేసిందీ లేదు కానీ అదిగో నోటిఫికేష‌న్, ఇదిగో నోటిఫికేష‌న్ అంటూ కేంద్ర ప్ర‌భుత్వ వ‌ర్గాలు ఊరిస్తున్నాయి అని పేర్కొంటూ సోష‌ల్ మీడియాలో కూడా ఆగ్ర‌హావేశాలు వ్య‌క్తం చేస్తోంది. తాజాగా తొమ్మిదిన్న‌ర ల‌క్ష‌ల ప్రభుత్వ ఉద్యోగాలు దేశ వ్యాప్తంగా భ‌ర్తీ చేయాల్సి ఉంద‌ని పార్ల‌మెంట్ సాక్షిగా ఒప్పుకున్నారు మోడీ అని గుర్తు చేస్తోంది.

ఇదే విషయాన్ని లోక్‌సభలో కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ సహాయమంత్రి జితేంద్ర సింగ్ వెల్ల‌డించార‌ని, అప్ప‌ట్లో అంటే అధికారం ద‌క్క‌క ముందు ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామ‌ని చెప్పిన బీజేపీ ఇప్పుడెందుకని ఆ మాట మ‌రిచిపోయింద‌ని తెలంగాణ రాష్ట్ర స‌మితి ప్ర‌శ్నిస్తోంది. దేశంలోని కోట్ల మంది నిరుద్యోగులు ఎదురుచూస్తున్నా కేంద్రంలో ఉన్న మోడీ స‌ర్కారు పట్టించుకోని దాఖ‌లాలే లేవ‌ని మండిప‌డుతోంది.

ఎత్తైన విగ్ర‌హాలు ఓ దేశ ప్ర‌గ‌తిని నిర్దేశిస్తాయా, మత రాజకీయాలు దేశ భవితకు ఉపయోగపడతాయా? అని మోడీ సర్కారును విమర్శకులు ఎప్ప‌టి నుంచో ప్రశ్నిస్తున్నారు. విగ్రహాలు కట్టే బదులు ఆ నిధుల‌తోనే యువ శ‌క్తిని వినియోగించుకునేందుకు ఏమ‌యినా వీలుంటే దారులు వెత‌కాలి అని కూడా అంటున్నారు.

ఏం జ‌రిగినా కూడా మోడీ స‌ర్కారు మాత్రం దిగివ‌చ్చేందుకు వీల్లేని విధంగానే ఉంది. ఓ వైపు నిరుద్యోగ భార‌తం పెరిగిపోతోంది. చిన్న, చిన్న అసహ‌నాలే పెద్ద పెద్ద నిర‌స‌న‌ల‌కు కార‌ణం అవుతున్నాయి. కానీ పార్ల‌మెంట్ లో ఇవేవీ పెద్ద‌గా చ‌ర్చ‌కు రావ‌డం లేదు. వ‌చ్చినా మునుప‌టి విధంగా అర్థ‌వంతం అయిన రీతిలో స‌భ్యులు త‌మ బాధ‌ను వెళ్ల‌గ‌క్క‌లేక‌పోతున్నారు.