Begin typing your search above and press return to search.

బాలయ్య అన్ స్టాపబుల్ : టీడీపీ జనసేనలను కలుపుతుందా...?

By:  Tupaki Desk   |   8 Oct 2022 7:32 AM GMT
బాలయ్య అన్ స్టాపబుల్ : టీడీపీ జనసేనలను కలుపుతుందా...?
X
రాజకీయాలు సినిమాలు కలగలసిపోయాయి. ఇక రియాల్టీ షోలు కూడా పాలిటిక్స్ తో మిక్స్ అవుతున్న పరిస్థితి. వారూ వీరూ తేడా లేకుండా అంతా ఒక్కటిగా కనిపిస్తున్నారు. ఒకే వేదిక మీద అటు సినీ జీవులు ఇటు రాజకీయ నాయకులు చెట్టాపట్టాలు వేసుకుంటున్నారు. రెండూ జనంతో కనెక్ట్ అయి ఉన్న రంగాలే. రెండింటికీ జనాదరణ కావాలి. రెండూ గ్లామర్ కోసం చూసేవే. దాంతో ఈ రెండు రంగాలు వెండి తెర బుల్లి తెర మొబైల్ తెర అన్న తేడా లేకుండా కలసిపోయి కొత్త సమీకరణలకు తెర తీస్తున్నాయి.

ఇదిలా ఉంటే తన టోటల్ కెరీర్ లో ఇప్పటిదాకా బుల్లి తెర మీద ఎక్కడా కనిపించని నందమూరి అందగాడు బాలక్రిష్ణ ఏకంగా మొబైల్ తెర మీదనే సడెన్ గా గత ఏడాది దర్శనం ఇచ్చారు. ఆయన ఆహా వారి ఓటీటీ ఫ్లాట్ ఫారం మీద అన్ స్టాపబుల్ రియాల్టీ షోకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడమే ఒక మ్యాజిక్ అయితే అందులో సూపర్ డూపర్ సక్సెస్ కావడం మరో మ్యాజిక్, సీజన్ వన్ తో టీయార్పీ రేటింగులో దూసుకుపోయిన అన్ స్టాపబుల్ సీజన్ టూ ని లేటెస్ట్ గా స్టార్ట్ చేశారు.

ఈసారి ఫస్ట్ గెస్ట్ బాలయ్య బావయ్య, మాజీ సీఎం టీడీపీ అధినాయకుడు నారా చంద్రబాబునాయుడు కావడం విశేషం. ఆయనతో బాలయ్య చేసే ఈ షో టాప్ రేపుతుంది అని అంటున్నారు. ఇక రానున్న రోజుల్లో పవన్ తో కూడా బాలయ్యను జత చేర్చి కొత్త షో చేస్తారు అని అంటున్నారు. అలాగే మెగాస్టార్ చిరంజీవితో బాలయ్య షో కూడా మరోటి డిజైన్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది.

వీటిని బట్టి చూస్తూంటే రాజకీయంగా కూడా ఈ కలయికలు ఏమైనా కొత్త ఆలోచనలకు దారి తీస్తాయా అన్న చర్చ అయితే ఉంది. ఎలాగంటే ఏపీ రాజకీయాల్లో చూస్తే వైసీపీ తో ఢీ అంటే ఢీ అన్నట్లుగా టీడీపీ జనసేన ఫైట్ చేస్తున్నాయి. ఈ రెండు పార్టీల మధ్య 2014లో పొత్తు ఉంది. 2019 ఎన్నికల్లో లేరు. 2024 నాటికి పొత్తులు కుదురుతాయి అని అంటున్నారు.

అయితే దానికి సంబంధించి ఊహాగానాలే తప్ప ఇంకా ఆచరణలో ఏదీ లేదనే అంటున్నారు. ఈ నేపధ్యంలో అల్లు అరవింద్ లాంటి మెగా ప్రోడ్యూసర్ మెగా ఫ్యామిలీ చుట్టం ఈ విధంగా నందమూరి మెగా హీరోలను కలపడానికి ప్లాన్ చేయడం అంటే ఆలోచించాల్సిందే అంటున్నారు. నిజానికి వచ్చే ఎన్నికల్లో పొత్తులకు అటు జనసేన ఇటు టీడీపీ సుముఖంగా ఉన్నాయి. కానీ కొన్ని లెక్కలు తేలాలి. మరి అలాంటి లెక్కలకు మొహమాటాలు అడ్డు రాకుండా మరింత సాన్నిహిత్యం చేకూర్చేలా ఈ రియాల్టీ షోలో గెస్టులను బాలక్రిష్ణతో కలిపి డిజైన్ చేస్తున్నారా అన్నదే చర్చగా ఉంది మరి.

ఇదిలా ఉంటే అల్లు అరవింద్ ఏం చేసినా పక్కా కాస్ట్ ఈక్వేషన్స్ తో చేస్తారు అని చెబుతారు. ఆయన ఇపుడు తన అహా ఓటీటీ ఫ్లాట్ ఫారం మీద ఈ విధంగా కొత్త కాంబోలను ఫిక్స్ చేయడం అంటే ఫ్యూచర్ పాలిటిక్స్ ని దృష్టిలో పెట్టుకునే అని అంటున్నారు. అన్ స్టాపబుల్ రియాల్టీ షో ద్వారా రాబోయే ఎన్నికల్లో టీడీపీ జనసేనలను కలపబోయేందుకు యాక్షన్ ప్లాన్ సెట్ చేస్తున్నారా అంటే జరుగుతున్న పరిణామాలను చూస్తే అవును అనే అనుకోవాల్సి వస్తుందేమో చూడాలి మరి.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.