Begin typing your search above and press return to search.
వల్లభనేని వంశీ కూడా జంపేనా.!?
By: Tupaki Desk | 26 Jun 2019 11:28 AM GMTటీడీపీకి షాకుల మీద షాకులు తగులుతున్నాయి. టీడీపీ దిగ్గజ నేతలందరూ పార్టీని వీడడం కలవరపెడుతోంది. తాజాగా గన్నవరం ఎమ్మెల్యే, టీడీపీ నేత వల్లభనేని వంశీ మోహన్ పార్టీ మారబోతున్నారన్న ప్రచారం జరుగుతోంది. ఆయనను ఇటీవలే టీడీపీని వీడి బీజేపీలో చేరిన ఎంపీ సుజనా చౌదరి ఆహ్వానించినట్టుగా ప్రచారం జరుగుతోంది.
కొంతకాలంగా టీడీపీ సమావేశాలకు వంశీ దూరంగా ఉంటున్నారు. ఇవాళ చంద్రబాబు నివాసంలో జరిగిన కీలక సమావేశానికి కూడా వంశీ దూరంగా ఉన్నారు. ఇప్పుడు టీడీపీని వీడి బీజేపీలో చేరాలని సుజనా కోరినందునే ఆయన పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారా.. లేక మరేదైనా కార్యక్రమాల వల్ల ఈ సమావేశానికి ఆయన హాజరు కాలేదా అన్న విషయంపై స్ఫష్టత రావాల్సి ఉంది.
కొద్దిరోజులుగా వల్లభనేని వంశీకి వైసీపీ మంత్రి కొడాలి నానితో మంచి సంబంధాలున్నాయి. ఎన్నికల్లో టీడీపీ ఓడిపోవడంతో వంశీ ఇప్పుడు టీడీపీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఇక టీడీపీ రాజ్యసభ ఎంపీలను చేర్చుకొని జోరుగా ముందుకెళుతున్న బీజేపీ కూడా వంశీకి గాలం వేసినట్టుగా ప్రచారం జరుగుతోంది.
యూరప్ పర్యటన ముగించుకొని విజయవాడ వచ్చిన చంద్రబాబు ప్రజావేదిక కూల్చివేత సహా బీజేపీ ఫిరాయింపులపై ఈరోజు తన నివాసంలో కీలక చర్చలు జరిపారు. అయితే ఈ భేటికి విజయవాడలోనే ఉన్న బోండా ఉమాతో పాటు తోట త్రిముర్తులు, జ్యోతుల నెహ్రూలు, పంచకర్ల రమేష్ బాబులు వెళ్లకపోవడంతో హాట్ టాపిక్ గా మారింది. ఈ సమావేశానికి విజయవాడ సమీపంలోనే ఉన్నా వంశీ కూడా హాజరు కాలేదు. వంశీ ఫోన్ లో కూడా అందుబాటులో ఉండకపోవడం గమనార్హం. దీంతోపాటు సుజనా చౌదరి ఫోన్ చేసి ఆహ్వానించడంతో వంశీ పార్టీ మార్పు ఊహాగానాలు పెద్ద ఎత్తున చెలరేగుతున్నాయి.