Begin typing your search above and press return to search.
ఉగ్రదాడిని యుద్ధమంటున్న ఫ్రాన్స్ అధ్యక్షుడు
By: Tupaki Desk | 14 Nov 2015 2:35 PM GMTదారుణ మారణకాండకు తెగబడిన తాజా ఉగ్రవాద చర్యపై ఫ్రాన్స్ అధ్యక్షుడు కన్నెర్ర చేశాడు. తాజాగా ప్యారిస్ నగరంలో కాల్పులు.. బాంబు దాడులతో దద్దరిల్లేలా చేసి.. 127 (ఫ్రాన్స్ సర్కారు వెల్లడించిన అధికారిక మృతుల సంఖ్య) మంది మృతి కారణంపై ఆ దేశ సర్కారు సీరియస్గా తీసుకుంది. తీవ్రవాదుల దుశ్చర్యను సీరియస్ గా తీసుకున్న ఆ దేశాధ్యక్షుడు.. ఉగ్రవాదుల చర్యను యుద్ధ చర్యగా వ్యాఖ్యానించారు.
సిరియా.. ఇరాక్ దేశాల్లో ఇస్లామిక్ స్టేట్ తీవ్రవాదుల హింసాయుత కార్యకలాపాలకు చెక్ పెట్టేందుకు అగ్రరాజ్యమైన అమెరికాతో కలిసి ఫ్రాన్స్ చేతులు కలిపి ఐసిస్ కార్యకలాపాలపై చెక్ పెడుతున్న వేళ.. దానికి ప్రతీకార చర్యగా తాజా ఉగ్రదాడికి తెగబడినట్లుగా భావిస్తున్నారు. తాజాగా తామే ఈ దాడికి పాల్పడినట్లుగా ఇస్లామిక్ స్టేట్ తీవ్రవాదులు ప్రకటించటంపై ఫ్రాన్స్ అధ్యక్షుడు హోలాండే స్పందిస్తూ.. ఉగ్రవాదుల చర్యను తాము సీరియస్ గా తీసుకుంటున్నట్లు ప్రకటించారు. తాజా దాడి నేపథ్యంలో.. ఇస్లామిక్ స్టేట్ పై చేస్తున్న దాడుల్ని మరింత తీవ్రతరం చేయొచ్చన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.