Begin typing your search above and press return to search.
మాజీ మంత్రితో వైసీపీకి లాభమా నష్టమా...?
By: Tupaki Desk | 2 Dec 2022 12:30 AM GMTరాజకీయాల్లో చేరికలు వల్ల లాభాలు ఉంటాయి. కానీ అదే టైంలో తెలియని నష్టాలు ఉంటాయి. కొన్ని అప్పటికపుడు బయటపడతాయి. మరి కొన్ని సుదీర్ఘ కాలంలో బయటపడి చాలా ట్రబుల్స్ క్రియేట్ చేస్తాయి. వైసీపీ విషయానికి వస్తే జగన్ మనసును చూరగొన్నవారే వైసీపీలో ఉండగలరు, కొత్తవారు చేరాలన్నా కూడా ఆయన వారి పట్ల పూర్తి విశ్వాసంతో ఉండాలి.
ఇక ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తే ప్రస్తుత రెబెల్ ఎంపీ రఘు రామక్రిష్ణం రాజు 2014 ఎన్నికలకు ముందు వైసీపీలో చేరినవారే. చివరి నిముషంలో ఆయన వైసీపీ నుంచి టీడీపీలోకి చేరిపోయారు. దాంతో పాటు ఆయన ఒక టీడీపీ అనుకూల మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో జగన్ మీద నాడే దారుణమైన కామెంట్స్ చేశారు. దీంతో ఆయన మళ్ళీ వైసీపీలో చేరరు అని అంతా అనుకున్నారు. చేరినా అక్కడ తీసుకునే సీన్ లేదని భావించారు.
కానీ చిత్రంగా రఘురామ రాజు వైసీపీలో చేరారు. జగన్ సైతం ఆయన్ని ఆదరించి కండువా కప్పారు. వైసీపీ ఎంపీగా ఆయన గెలిచారు. జగన్ సీఎం అయ్యారు, ఆరు నెలలు తిరగకుండానే ఆయన రెబెల్ ఎంపీగా మారిపోయారు. ఒక విధంగా మూడేళ్ళుగా వైసీపీకి ఆయన ఒక ఇబ్బందిగా మారారు. సరే ఎవరి వైపు ఎంత న్యాయం ఉంది నిజం ఉంది అనుకున్నా తన పార్టీ తరఫున గెలిచి తనకు ఎదురు నిలవడం నిత్యం విమర్శలు చేయడం అంటే ఏ రాజకీయ పార్టీ అధినాయకుడు అయినా తట్టుకోలేని విషయమే. కానీ రఘురామ రాజు విషయంలో అదే జరుగుతోంది.
ఇక ఇపుడు చూస్తే టీడీపీకి చెందిన ఒక బిగ్ షాట్ మాజీ మంత్రి వైసీపీలోకి వస్తారు అని ప్రచారం సాగుతోంది. ఆయన గట్టి పిండమే. పైగా అర్ధబలం, అంగబలం దండీగా కలిగిన వారు. ఇక ఆయన ఏ పార్టీలో ఉన్నా సొంతంగా ఉంటారు అని పేరు. ఆయన పుట్టి పెరిగిన టీడీపీకే ఝలక్ ఇచ్చిన ఘనాపాటీ అని పేరుంది. అలాంటి మాజీ మంత్రి వైసీపీలోకి రానున్నారు అంటే అది ఎంతవరకూ రాజకీయ లాభం చేకూరుస్తుంది. భవిష్యత్తులో ఎంతమేరకు ఇబ్బంది పెడుతుంది అన్న చర్చ అయితే పార్టీలో మొదలైంది.
సదరు మాజీ మంత్రి పార్టీలకు అందని ఇమేజ్ తో కొనసాగాలనుకుంటారు. ఆయన్ని తెచ్చి పార్టీలో పెట్టుకుంటే సీట్లు ఓట్లు రావచ్చేమో కానీ సరైన సమయంలో ఆయన అడ్డం తిరిగితే మాత్రం వైసీపీకి మరో రఘురామ రాజు తయారు కావడం ఖాయమని చెప్పేవారూ ఉన్నారు. నిజానికి వచ్చే ఎన్నికలు చావో రేవో అన్నట్లుగా ఏ పార్టీకైనా ఉంటాయి.
వైసీపీకి నిజంగా గెలుపు అవకాశాలు ఉన్నా కూడా 151 సీట్లు అయితే రావు, అవి ఏ వంద దగ్గరో ఆగిపోయినా ఆశ్చర్యం లేదు అంటున్నారు. అలాంటపుడు మాజీ మంత్రి లాంటి వారు, దిగ్గజ నేతలు రెబెల్ గా మారినా లేక సొంతంగా బలం చూపించాలనుకున్నా ఆ టైట్ పొజిషన్ లో అసలుకే ఎసరు వచ్చే ప్రమాదం ఉందని వైసీపీలో హితైషులు అంటున్న మాట. రాజకీయంగా ఓట్లూ సీట్లు వచ్చినా విధేయత కూడా ముఖ్యం అని వాదించే వారూ ఆ పార్టీలో ఉన్నారుట.
మరికొంతమంది అయితే ఈ రోజున వైసీపీలోకి కొంతమంది నాయకులు చేరినా వారిని ఎంతవరకూ నమ్మవచ్చు అన్న చర్చ కూడా లేవదీస్తున్నారుట. వారే రేపటి రోజున కోవర్టులుగా మారితే అపుడు పార్టీ పరిస్థితి ఎలా ఉంటుందో అని కూడా ముందస్తు ఆలోచనలు చేసేవారూ ఉన్నారు అంటున్నారు. మొత్తానికి చూస్తే ఆచీ తూచీ చేరికలు ఉండాలి తప్ప వచ్చిన వారిని వచ్చినట్లే చేర్చుకుంటే రెబెల్ ట్రబుల్స్ తో వైసీపీ ఇబ్బంది పడడం ఖాయమని అంటున్నారుట.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.