Begin typing your search above and press return to search.
వైసీపీ వ్యూహాలు ఇలా మారిపోతాయా...!
By: Tupaki Desk | 17 Nov 2021 3:30 AM GMTఏపీలో వైసీపీ ప్రభుత్వం వచ్చి.. ఈ నెల ఆఖరుతో రెండున్నరేళ్లు గడిచిపోయాయి. అయితే.. ఈ రెండున్నరే ళ్లలో ప్రభుత్వం ఏం చేసినా.. ప్రజలకు ఇచ్చిన.. నవరత్నాల హామీలను అమలు చేయడంపైనే దృష్టి పెట్టింది. ఖజానాకు ఇబ్బందిగా మారినా .. కూడా ప్రభుత్వం వెనక్కి తగ్గకుండా.. వాటిని అమలు చేసింది. రైతులు, విద్యార్థులు, మహిళలు, వృద్ధులు.. ఇలా అనేక రూపాల్లో.. ప్రజలకు పథకాలు అందించింది. అయితే.. రాష్ట్రంలో ఇంత చేస్తున్నా.. కూడా..అభివృద్ధి లేదు..! అనే మాట ప్రతిపక్షాల నుంచి వినిపిస్తోంది.
ఈ నేపథ్యంలో తాము ఎంతో చేస్తున్నామని.. ప్రభుత్వం చెబుతున్నా.. రోడ్లు.. ప్రాజెక్టులను చూపిస్తూ.. విపక్షాలు విమర్శలు చేస్తూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో జగన్ సర్కారు వ్యూహాత్మకంగా అడుగులు వేయాలని నిర్ణయించుకున్నట్టు.. సీనియర్ల మాటల మధ్య వినిపిస్తున్న వ్యాఖ్యలను బట్టి తెలుస్తోంది. ``ఇప్పటి వరకు ప్రభుత్వం అనుసరించిన విధానం ఒక ఎత్తు. ఇక, నుంచి రాబోయే రెండేళ్లు అనుసరించే విధానం మరో ఎత్తు!`` అంటూ.. సీనియర్లు చెబుతున్నారు.
ఏ ఇద్దరు సీనియర్ నాయకులు కలిసినా.. ఫోన్లు చేసుకున్నా.. వచ్చే రెండేళ్లు ఏం చేస్తారనే అంశాలపైనే చర్చించుకుంటున్నారు. వచ్చే రెండేళ్లలో రాష్ట్రంలో ప్రధాన సమస్యలుగా ఉన్న రహదారుల నిర్మాణానికి ప్రభుత్వం పెద్ద పీట వేయనుంది. అదేవిధంగా.. మూడు రాజధానుల అంశాన్ని కీలకంగా ముందుకు తీసుకువెళ్లే ప్రయత్నం చేయనుంది. అదేవిధంగా సామాజిక వర్గాల వారీగా.. ఇప్పటి వరకు ఉన్న సమస్యలను పరిష్కరించేందుకు ప్రాధాన్యం ఇవ్వనుంది. ఇక, కీలకమైన.. పెట్టుబడులు రాబట్టే అంశంపైనా.. జగన్ సర్కారు అడుగులు వేయనుంది.
పోలవరం ప్రాజెక్టు పూర్తికి ప్రధానంగా ప్రాధాన్యం ఇవ్వనుంది అదేవిధంగా కడప ఉక్కు కర్మాగారం పూర్తి చేయాలని నిర్ణయించుకున్నట్టు సీనియర్లు చెబుతున్నారు. ఉపాధి, ఉద్యోగాలు కల్పించడంలోనూ.. జగన్ సర్కారు.. ఇప్పటి వరకు ఉన్న విమర్శలను తోసిరాజనేలా వ్యవహరించనుంది. అదేవిధంగా పెట్టుబడులు వచ్చేలా.. కూడా విదేశీ కంపెనీలను ప్రోత్సహించనుంది. ఇలా.. వచ్చే రెండేళ్లపాటు.. ప్రభుత్వం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుందని అంటున్నారు సీనియర్లు. మరి ఏం జరుగుతందో చూడాలి.