Begin typing your search above and press return to search.

మోడీని ఫాలో అవుతున్న జ‌గ‌న్‌!

By:  Tupaki Desk   |   12 July 2019 7:21 AM GMT
మోడీని ఫాలో అవుతున్న జ‌గ‌న్‌!
X
నీతిగా.. నిజాయితీగా.. ఎలాంటి ఆరోప‌ణ‌లు లేకుండా.. ప్ర‌జాభిప్రాయానికి త‌గ్గ‌ట్లుగా పాల‌న చేయాల‌న్న‌ది ఏపీ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి సంక‌ల్పం. చంద్ర‌బాబు పాల‌న‌లో ఇష్టారాజ్యంగా వ్య‌వ‌హ‌రించిన నేత‌లు.. అధికారుల‌తో పాటు అవినీతి భారీ ఎత్తున జ‌రిగింద‌న్న ఆరోప‌ణ‌లు ఉన్నాయి. ఇదే బాబు ఇమేజ్ ను డ్యామేజ్ చేయ‌ట‌మే కాదు.. గ‌డిచిన ఎన్నిక‌ల్లో దారుణ ఓట‌మికి కార‌ణంగా చెబుతారు. ఇదిలా ఉంటే ఏపీ ముఖ్య‌మంత్రిగా వ్య‌వ‌హ‌రిస్తున్న జ‌గ‌న్.. ఏ చిన్న త‌ప్పు దొర్ల‌టానికి అవ‌కాశం ఇవ్వ‌కూడ‌ద‌ని డిసైడ్ అయిన‌ట్లుగా చెబుతున్నారు.

ఇప్ప‌టికే మంత్రివ‌ర్గం మొద‌లు పార్టీ నేత‌ల‌తో నిర్వ‌హించిన స‌మావేశాల్లో పైర‌వీలు.. అవినితి లాంటివి చేయొద్ద‌ని చెప్పినా కొంద‌రు మాత్రం ఒక చెవిన విని మ‌రో చెవి నుంచి వ‌దిలేస్తున్న ప‌రిస్థితి. ఇలాంటివేళ‌.. వారికి ఊహించ‌ని షాకులు ఇస్తున్నారు జ‌గ‌న్‌. ఇప్ప‌టికే బ‌దిలీల కోసం డ‌బ్బులు తీసుకున్న నేత‌ల‌కు పిలిచి మ‌రీ వార్నింగ్ ఇచ్చిన జ‌గ‌న్‌.. త‌న పార్టీ మంత్రులు మొద‌లు ఎమ్మెల్యేల వ‌ర‌కూ ఎవ‌రేం చేస్తున్నార‌న్న విష‌యాన్ని.. వారి కార్య‌క‌లాపాల‌కు సంబంధించిన స‌మాచారాన్ని ఎప్ప‌టిక‌ప్పుడు స‌మాచారాన్ని సేక‌రించ‌టానికి కొత్త త‌ర‌హా విధానాన్ని అమ‌లు చేస్తున్న‌ట్లుగా తెలుస్తోంది.

పార్టీ నేత‌ల కార్య‌క‌లాపాల‌పై ఒక క‌న్నేసి ఉంచేలా ఇప్ప‌టికే ఒక వ్య‌వ‌స్థ‌ను సిద్ధం చేసిన‌ట్లుగా చెబుతున్నారు. డైలీ బేసిస్ లో ఈ విభాగం నేత‌ల తీరుపైనా.. వారు చేసే కార్య‌క‌లాపాల మీదా ఒక క‌న్నేసి ఉంచుతున్న‌ట్లుగా తెలుస్తోంది. కేంద్రంలో ప్ర‌ధాని మోడీ త‌న మంత్రివ‌ర్గ స‌హ‌చ‌రుల‌పై ఏ తీరులో వ్య‌వ‌హ‌రిస్తారో.. స‌రిగ్గా అదే తీరునురాష్ట్రంలో జ‌గ‌న్ త‌న పార్టీ నేత‌లంద‌రిపైనా నిఘా పెట్టిన‌ట్లుగా తెలుస్తోంది. ఎద‌వ ప‌నులు చేసిన నేత‌ల్ని వ్య‌క్తిగ‌తంగా పిలిచి క్లాసులు పీకి.. వారు చేస్తున్న త‌ప్పుల్ని ఎత్తి చూపించ‌టం ద్వారా వారి స్పీడ్ కు బ్రేకులు వేసే ప్ర‌య‌త్నం చేస్తున్నారు.

ఇటీవ‌ల ప్రకాశం జిల్లాకుచెందిన నేత ఒక‌రు ల‌క్ష‌లాదిరూపాయిలు ఒక‌రి నుంచి వ‌సూలు చేస్తే.. ఈ విష‌యం తెలిసిన సీఎం జ‌గ‌న్‌.. స‌ద‌రు నేత‌ను పిలిపించి వార్నింగ్ ఇవ్వ‌టమేకాదు.. తీసుకున్న పైస‌ల్ని బాధితుడికి తిరిగే ఇచ్చేలా చేసిన‌ట్లుగా తెలుస్తోది. అంతేకాదు.. మంత్రుల్ని త‌మ పేషీల్లోకి బంధువులు.. స్నేహితుల్ని రానివ్వొద్ద‌ని స్ప‌ష్టం చేసిన‌ట్లు చెబుతున్నారు. ఈ కార‌ణంగా అన‌వ‌స‌ర‌మైన లాబీయింగ్ కు అవ‌కాశం ఉండ‌దంటున్నారు. మంత్రులు ఎవ‌రైనా స‌రే.. ఆరోప‌ణ‌లు వ‌స్తే స‌హించేది లేద‌ని.. ప‌ద‌వులు గ్యారెంటీ అన్న భ‌రోసా వ‌ద్ద‌ని తేల్చి చెబుతున్న‌ట్లుగా తెలుస్తోంది. ఎంత‌టి నేత‌లైనా స‌రే.. క‌ష్ట‌ప‌డిప‌ని చేయాలే త‌ప్పించి అడ్డ దారుల్లో వెళ్లే విధానాన్ని చెక్ పెట్టేసిన వైనం ఇప్పుడు హాట్ టాపిక్ మారింది. త‌న హ‌యాంలో ఎలాంటి ఆరోప‌ణ‌లు లేకుండా క్లీన్ చిట్ ఉండాల‌న్న‌ది జ‌గ‌న్ సంక‌ల్పంగా చెబుతున్నారు. ఈ కార‌ణంతోనే ఆయ‌న ప్రస్తుతం అనుస‌రిస్తున్న విధానాలు ఇప్పుడు అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తున్నాయి.