Begin typing your search above and press return to search.

మెప్పించ‌ని పాల‌న‌.. మ‌ళ్లీ మెరిసేనా..?

By:  Tupaki Desk   |   14 Oct 2022 3:51 AM GMT
మెప్పించ‌ని పాల‌న‌.. మ‌ళ్లీ మెరిసేనా..?
X
ఔను.. వైసీపీ పాల‌న మెప్పించ‌డం లేద‌నే టాక్ ఏపీ వ్యాప్తంగా వినిపిస్తోంది. అదేంటి.. అంతా బాగుంద‌ని.. కొన్ని ప్ర‌తిప‌క్షాలు కావాల‌ని రాద్ధాంతం చేస్తున్నాయ‌ని.. వైసీపీ నేత‌లు ప్ర‌చారం చేస్తున్నారు క‌దా! అంటా రా.. అది పైపైకే! నేత‌ల ముందే.. అంతా బాగుంద‌ని అంటున్నారు. కానీ, వారివెనుక‌.. వారి అనుచ‌రులే.. పాల‌న‌పై పెద‌వి విరుస్తున్నారు. సాధార‌ణంగా.. కుటుంబానికి వ‌చ్చేస‌రికి.. అప్పులు చేయ‌డం కొంత‌వ‌ర‌కు మాత్రమే.. స‌హిస్తారు.

అలాంటిది.. రాష్ట్రానికి సంబంధించి విచ్చ‌ల‌విడి అప్పులు చేయ‌డాన్ని ఎవ‌రు మాత్రం స‌హిస్తారు? ఇదే ఇప్పుడు ప్ర‌శ్నిస్తున్నారు. పోనీ.. ఇంత‌గా అప్పులు చేస్తున్నా.. జిల్లాల్లో అయినా.. రాష్ట్రంలో అయినా.. అభివృద్ధి ఉందా? అంటే.. నేతి బీర‌లో నెయ్యిని చూపించిన‌ట్టుగానే ఉంటుంద‌నే టాక్ వినిపిస్తోంది. దీంతో జ‌గ‌న్ పాల‌న‌పై ప్ర‌జ‌లు పెదవి విరుస్తున్నారు. ముఖ్యంగా.. ఏ సామాజిక వ‌ర్గం కూడా.. జ‌గ‌న్ పాల‌న‌పై పాజిటివ్ టాక్ వినిపించ‌డం లేదు.

నిజానికి 66 కులాల‌కు సంబంధించి 56 కార్పొరేష‌న్లు ఏర్పాటు చేశారు. కానీ, నిధులు ఇవ్వ‌లేదు. ఇక, కార్పొరేష‌న్లు ఏర్పాటు చేసినా.. ప్ర‌యోజ‌నం ఏముంటుంది? అనేది ప్ర‌శ్న‌. దీంతో ఒక‌రిద్ద‌రు కార్పొరేష‌న్ల చైర్మ‌న్లు కూడా.. రాజీనామాలు చేసి రెడీగా పెట్టుకున్నారు.

అయితే.. ఎవ‌రూ బ‌య‌ట ప‌డ‌డం లేదు. కేసుల‌కు భ‌య‌ప‌డో.. లేక మ‌రొక‌టో తెలియ‌దు కానీ.. ప్ర‌స్తుత‌తం కార్పొరేష‌న్ల వ్య‌వ‌హారం.. అంత‌ర్గ‌తంగా చ‌ర్చ‌కు దారితీస్తోంద‌.ఇది వైసీపీకి ప్ర‌దానంగా.. ఇబ్బంది అవుతుంద‌ని అంటున్నారు.

మ‌రోవైపు.. పంచాయ‌తీల‌కు ఇచ్చిన నిధుల‌ను ప్ర‌భుత్వం వివిధ కార‌ణాలు చూపుతూ.. త‌న ఖాతాలోకి మ‌ళ్లించుకుంటోంది. దీనిపై నా అంత‌ర్గతంగా చ‌ర్చ సాగుతోంది. నిజానికి వైసీపీకి వ‌చ్చిన ఓట్ల‌ను గ‌మ‌నిస్తే.. గ్రామ‌స్థాయిలోనే ఎక్కువ‌గా ప‌డ్డాయి.

ఇప్పుడు అదే గ్రామ‌స్థాయిలో జ‌గ‌న్ పాల‌న‌పై విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. పంచాయ‌తీ సర్పంచులు భిక్షాట‌న చేసుకుంటున్నారు. దీనిని ప్ర‌భుత్వం లైట్ తీసుకున్నా.. గ్రామ స్థాయిలో తీవ్రంగా నే చ‌ర్చ సాగుతోంది. సో.. ఇక‌, అర్బ‌న్ ప‌రిస్థితి మ‌రింత దారుణంగా ఉంది. ఈ ప‌రిణామాల‌ను గ‌మ‌నిస్తే.. వైసీపీపై పెద‌వి విరుపులు.. నొస‌టి వెక్కిరింపులే క‌నిపిస్తున్నాయ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.




నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.