Begin typing your search above and press return to search.

ద‌ర్శి ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే మ‌ధ్య విభేదాల‌తో వైఎస్సార్సీపీకి త‌ల‌పోటేనా?

By:  Tupaki Desk   |   12 July 2022 3:53 AM GMT
ద‌ర్శి ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే మ‌ధ్య విభేదాల‌తో వైఎస్సార్సీపీకి త‌ల‌పోటేనా?
X
ప్ర‌కాశం జిల్లా ద‌ర్శిలో నేత‌ల మ‌ధ్య విభేదాల‌తో వైఎస్సార్సీపీ అధిష్టానానికి త‌ల‌పోటు ఎదుర‌వుతోందా అంటే అవున‌నే అంటున్నారు. ప్ర‌స్తుతం ద‌ర్శి నియోజ‌క‌వ‌ర్గం నుంచి వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేగా మ‌ద్దిశెట్టి వేణుగోపాల్ ఉన్నారు. మ‌ద్దిశెట్టి వేణుగోపాల్ కాపు సామాజిక‌వ‌ర్గానికి చెందిన‌వారు. అలాగే మాజీ ఎమ్మెల్యే బూచేప‌ల్లి శివ‌ప్ర‌సాద్ రెడ్డి 2009లో ద‌ర్శి నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిచారు. ప్ర‌స్తుతం ఈయ‌న కూడా వైఎస్సార్సీపీలోనే ఉన్నారు. శివ‌ప్ర‌సాద్ రెడ్డి త‌ల్లి బూచేప‌ల్లి వెంకాయ‌మ్మ ప్ర‌కాశం జిల్లా ప‌రిష‌త్ చైర్మ‌న్ గా కూడా చేశారు.

బూచేప‌ల్లి శివ‌ప్ర‌సాద్ రెడ్డి ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ కు అత్యంత స‌న్నిహితుడు. ఈయ‌న‌కు గ్రానైట్ వ్యాపారాలున్నాయి. ఈ నేప‌థ్యంలో ద‌ర్శిలో ఓవైపు ఎమ్మెల్యే మ‌ద్ధిశెట్టి వేణుగోపాల్, మ‌రోవైపు బూచేప‌ల్లి శివ‌ప్ర‌సాద్ రెడ్డి ఇద్ద‌రూ పెత్త‌నం కోసం ప్ర‌య‌త్నిస్తుండ‌టం పార్టీ అధిష్టానానికి త‌ల‌నొప్పిగా మారింది.

బూచేప‌ల్లి త‌న వ్యాపార అవ‌సరాల నిమిత్తం, రాజ‌కీయ ప్ర‌యోజ‌నాల కోసం అధికారులను బ‌దిలీ చేయించ‌డం, త‌న‌కు అనుకూల‌మైన‌వారికి పోస్టింగులు ఇప్పించ‌డం చేస్తున్నార‌ని స‌మాచారం. దీనిపై స‌హజంగానే ఎమ్మెల్యే మ‌ద్దిశెట్టి వేణుగోపాల్, ఆయ‌న అనుచ‌రులు మ‌న‌స్తాపానికి గుర‌వుతున్నార‌ని తెలుస్తోంది.

స్థానిక ఎమ్మెల్యేగా ఉన్న త‌న‌ను సంప్ర‌దించ‌కుండా బూచేప‌ల్లి ఏక‌ప‌క్షంగా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని మ‌ద్దిశెట్టి వేణుగోపాల్ వాద‌న‌గా ఉంది. దీన్ని ఆయ‌న పార్టీ అధిష్టానం దృష్టికి కూడా తీసుకెళ్లిన‌ట్టు కూడా చెబుతున్నారు. అయితే మ‌ద్దిశెట్టి కాపు సామాజిక‌వ‌ర్గానికి చెందిన‌వారు కావ‌డంతో ఆయ‌న‌ను ఇబ్బంది పెట్టే ప‌రిస్థితుల్లో వైఎస్సార్సీపీ అధిష్టానం లేదంటున్నారు.

మ‌రోవైపు బూచేప‌ల్లి శివ‌ప్ర‌సాద్ రెడ్డి మొద‌టి నుంచీ వైఎస్సార్సీపీతో కొన‌సాగుతున్నారు. వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి ముఖ్య‌మంత్రిగా ఉన్న‌ప్పుడు తొలిసారి 2009లో బూచేప‌ల్లి ఎమ్మెల్యే అయ్యారు. ఆ స‌మ‌యంలోనే ఆయ‌న త‌ల్లి వెంకాయ‌మ్మ కూడా జెడ్పీ చెర్మ‌న్ గా ఉన్నారు.

ఈ నేప‌థ్యంలో అటు బూచేప‌ల్లికి, ఇటు మ‌ద్దిశెట్టికి చెప్ప‌లేక వైఎస్సార్సీపీ అధిష్టానం జుట్టు పీక్కుంటోంద‌ని చెబుతున్నారు. ఈ విబేధాల‌తో ద‌ర్శి ఎంపీపీ, జెడ్సీటీసీల‌ను సైతం టీడీపీ గెలుచుకుంది. ఇప్ప‌టికైనా వైఎస్సార్సీపీ అధిష్టానం దిద్దుబాటు చ‌ర్య‌లు చేప‌ట్ట‌క‌పోతే వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఓట‌మి త‌ప్ప‌ద‌ని అంటున్నారు.