Begin typing your search above and press return to search.

సెకండ్ ఛాన్స్ మిస్ అవుతుందా? వైసీపీ నేత‌ల త‌ర్జ‌న భ‌ర్జ‌న‌

By:  Tupaki Desk   |   19 Jan 2023 2:30 AM GMT
సెకండ్ ఛాన్స్ మిస్ అవుతుందా? వైసీపీ నేత‌ల త‌ర్జ‌న భ‌ర్జ‌న‌
X
ఔను! ఇప్పుడు వైసీపీ నేత‌ల మ‌ధ్య ఇదే చ‌ర్చ సాగుతోంది. గ‌త ఎన్నిక‌ల్లో ఒక్క ఛాన్స్ అంటూ.. జ‌గ‌న్ ప్రజల్లోకి వెళ్లారు. ఇది స‌క్సెస్ అయింది. అయితే.. ఇప్పుడు సెకండ్ ఛాన్స్ కోసం సీఎం స‌హా నేత‌లు అందరూ ఎదురు చూస్తున్నారు. కానీ, ఇది సాకారం అయ్యేలా క‌నిపించ‌డం లేదు. ఇదే నేత‌ల మ‌ధ్య త‌ర్జ‌న భర్జ న‌కు గుర‌య్యేలా చేస్తోంది. ఎందుకంటే.. ఇప్ప‌టి వ‌రకు కూడా.. సంక్షేమం పెద్ద ఎత్తున చేస్తున్నామ‌ని.. అది కాపాడుతుంద‌ని నాయ‌కులు ఆశ‌లు పెట్టుకున్నారు.

ఈ ప్ర‌భావం ఎలా ఉన్న‌ప్ప‌టికీ.. మ‌రోవైపు ప్ర‌తిప‌క్షాల దూకుడు పెర‌గ‌డం.. జ‌న‌సేన‌-టీడీపీ పొత్తు అంశం ప్ర‌జ‌ల్లో చ‌ర్చ‌కు రావ‌డం.. ఇది హైప్ తీసుకురావ‌డంతో నాయ‌కులు ఆలోచ‌న‌ల్లో ప‌డ్డారు.

దీంతో వైసీపీ అనుకూల వ‌ర్గం ఎలా ఉన్న‌ప్ప‌టికీ.. గ‌త ఎన్నిక‌ల‌కు ముందు.. పార్టీలోకి వ‌చ్చిన త‌ట‌స్థ నేత‌లు మాత్రం ప‌క్క చూపులు చూస్తున్నారు. సెకండ్ ఛాన్స్ వ‌చ్చేది లేద‌ని.. పెద్ద ఎత్తున చ‌ర్చ జ‌రుగుతున్న నేప‌థ్యం లో నాయ‌కులు ముందుగానే క‌ర్చీఫ్ ప‌రుచుకుంటున్నారు.

ఈ నేప‌థ్యంలో చాలా వ‌ర‌కు నియోజ‌క‌వ‌ర్గాల్లో మార్పున‌కు నాయ‌కులు ప్ర‌యత్నిస్తున్నారు. ఉదాహ‌ర‌ణ కు విజ‌యవాడ సెంట్ర‌ల్ నియోజ‌కవ‌ర్గంలో మ‌ల్లాది విష్ణు గ‌త ఎన్నిక‌ల్లో వైసీపీ త‌ర‌ఫున పోటీ చేసి విజ యం ద‌క్కించుకున్నారు.

అయితే.. ఇప్పుడు ఈయ‌న పార్టీ మారేందుకు ప్ర‌య‌త్నిస్తున్నార‌నే కామెంట్లు వినిపిస్తున్నాయి. బీజేపీవైపు చూస్తున్నార‌ని పెద్ద ఎత్తున ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇంకో వైపు.. విశాఖ ప‌ట్నంలోని భీమిలి నియోజ‌క‌వ‌ర్గం నుంచి గ‌త ఎన్నిక‌ల్లో టీడీపీ నుంచి వ‌చ్చి గెలిచిన అవంతి ప‌రిస్థితి కూడా ఇలానే ఉంది.

అవంతి శ్రీనివాస్ కూడా పార్టీ మారేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు. ఇక‌, జ‌గనేస‌ర్వ‌స్వం అని ప్ర‌క‌టించి మాజీ ఎంపీ బుట్టా రేణుక బీజేపీలోకి చేరేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు.ఇలా.. రాష్ట్ర వ్యాప్తంగా 40 మంది నాయ‌కులు సెకండ్ ఛాన్స్ లేద‌నే నమ్మ‌కంతో ప‌క్క చూపులు చూస్తున్నారు. దీంతో వైసీపీలో ఈ విష‌యం ఇప్పుడు ఆస‌క్తిక‌ర చ‌ర్చ‌కు దారితీస్తోంది. మ‌రి దీనిని క‌ట్ట‌డి చేసేందుకు పార్టీ అధిష్టానం ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటుందో చూడాలి.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.