Begin typing your search above and press return to search.

వీళ్లంతా మాల్యా అన్నయ్యలు

By:  Tupaki Desk   |   10 April 2016 5:43 AM GMT
వీళ్లంతా మాల్యా అన్నయ్యలు
X
విజ‌య్‌ మాల్యా...బ్యాంకుల నుంచి ఎడా పెడా అప్పులు తీసుకొని ఎగ్గొట్టిన పారిశ్రామిక‌వేత్త‌. బ్యాంకులు ప్ర‌శ్నించేస‌రికల్లా విదేశాల‌కు చెక్కేసిన ఈ జ‌ల్సారాయుడును చూసి ఇదేం బుద్ధి అనుకుంటున్న‌వారు ఎంద‌రో. అయితే మాల్యాను త‌ల‌ద‌న్నే వారు ఎంద‌రో మ‌న దేశంలో ఉన్నారు. వారంతా బ‌డాబ‌డా పారిశ్రామిక‌వేత్త‌లు. అధికారంలో ఉన్న‌వారు. అంతేకాదండోయ్ అందులో మ‌న తెలుగు దిగ్గ‌జాలు కూడా ఉన్నారు.

అగ్రశ్రేణి పారిశ్రామికవేత్త ముకేశ్‌ అంబానీ బావ.... ప్రధాని మోడీకి అత్యంత ఇష్టుడైన కార్పొరేట్‌ దిగ్గజం గౌతం అదానీకి అన్న‌ వినోద్ అదానీ స్వయానా వియ్యంకుడు... బిర్లా గ్రూపు చైర్మన్‌ కుమారమంగళం బావమరిది.... అమితాబ్‌ బచ్చన్‌ కనిష్ఠ సోదరుడు అజితాబ్‌ బచ్చన్‌... ఒకరు మోడీ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న తెలుగు ప్రాంతవాసి.... మరొకరు గత పదిహేనేళ్లుగా బీజేపీతో అంటకాగుతున్న తెలుగుదేశం ఎంపీ.... వీరంతా ఎంత ప్రముఖులో వేరే చెప్పాల్సిన పనే లేదు. అయితే వీళ్లంతా 'విల్‌ ఫుల్‌ డిఫాల్టర్స్‌' (ఉద్దేశపూరిత ఎగవేతదారులు) అనే విషయం మాత్రం చాలా మందికి తెలియనిది! ఈ హేమాహేమీలు బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలను తిరిగి చెల్లించడం లేదు. చాలా ఏళ్ల కింద తీసుకొన్న అప్పులను కావాలనే (డబ్బు లేక కాదు) తిరిగి కట్టకుండా నిక్షేపంగా ఉన్నారు.

లక్షో - రెండు లక్షలో అప్పు తీసుకున్న సామాన్యులైతే ఆ అప్పు చెల్లించలేక - చెల్లిస్తావా లేదా అని పీడించే బ్యాంకులోళ్ల బాధలు భరించలేక ఉరేసుకొనో, పురుగు మందు తాగో చనిపోవడం మనం నిత్యం చూస్తున్నాం. ఒక మీడియా సంస్థ ఇలాంటి ఉద్దేశపూరిత ఎగవేతదారులను పది మందిని గుర్తించి దీనిపై వివరణ కోరగా, ఒకరిద్దరు మినహా మిగతా వాళ్లెవ్వరూ నోరైనా మెదపలేదు. 'మేం చెప్పం పో' అని ముఖం మీదే చెప్పిన వాళ్లూ ఉన్నారు.

ఈ డిఫాల్టర్లు ఎగవేసిన మొత్తం డబ్బు భారత చరిత్రలో నమోదైన ఏ భారీ కుంభకోణం కన్నా కూడా పెద్దదే. బ్యాంకులకు ఐపీ పెడుతున్న వీవీఐపీల జాబితా చాంతాడంత పొడవుంది! దేశంలో మొత్తం 18,176 మంది వ్యక్తులు/కంపెనీలు ఉద్దేశపూరిత ఎగవేతదారులుగా ఉన్నారు. వీరందరూ బకాయి పడ్డ మొత్తం 2.35 లక్షల కోట్ల రూపాయలు. ఇది ఇప్పటి వరకు భారీ కుంభకోణాలుగా పేరుమోసిన బొగ్గు కుంభ‌కోణం (రూ. 1,86 లక్షల కోట్లు) - 2జి స్కాం (రూ. 1.76 లక్షల కోట్లు) కన్నా ఎక్కువ. వీళ్లంతా కోటి రూపాయలకు పైగా బకాయి పడిన వాళ్లే. క్రెడిట్‌ ఇన్‌ ఫర్మేషన్‌ బ్యూరో ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ (సిబిల్‌) ఈ గణాంకాలను వెల్లడి చేసింది. అయితే వీళ్లెవరికీ ప్రభుత్వం తమను ఏదో చేస్తుందనే భయాలు ఏ మాత్రం లేవు. ఎందుకంటే విజరు మాల్యా ఉదంతాన్ని గమనిస్తే ఆయనకు దేశం వదిలి వెళ్లేందుకు వీలు కల్పించింది ప్రభుత్వ యంత్రాంగమేననేది అందరికీ తెలిసిందే. ఇప్పుడు మాల్యా వివాదం ముందుకు రావడంతో అందరి దృష్టి ఆయనపైనే ఉంది గానీ, బడా డిఫాల్టర్లపై చర్య తీసుకోవడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తున్న దాఖలాలు కానరావడం లేదు. రూ. 500 కోట్లకు మించి ఎగవేసిన డిఫాల్టర్ల జాబితాను ఇటీవల ఆర్‌ బీఐ సీలు చేసిన కవర్‌ లో సుప్రీంకోర్టుకు అందజేసింది కూడా. వాటిలో మాల్యా సహా 10 మంది ప్రముఖ ఎగవేతదారుల వివరాలివి:

జతిన్‌ మెహతా

ఈయన గుజరాతీ పారిశ్రామికవేత్త గౌతం అదానీ సోదరుడైన వినోద్‌ అదానీకి స్వయాన వియ్యంకుడు. ఈయన కంపెనీ విన్సమ్‌ డైమండ్స్‌ అండ్‌ జ్యూవెలరీ. ఈ కంపెనీ మార్కెట్‌ విలువ రూ. 7 కోట్లు మాత్రమే. కానీ ఈయన బ్యాంకుల నుంచి తీసుకొని ఎగవేసింది రూ. 2,346 కోట్లు.

నితిన్‌ కాస్లీవాల్‌

కుమార మంగళం బిర్లాకు స్వయానా బావమరిది. ఈయన కంపెనీ ఎస్‌. కుమార్స్‌ గ్రూపు మార్కెట్‌ విలువ రూ. 70 కోట్లు. ఈయన బ్యాంకులకు ఎగనామం పెట్టిన మొత్తం రూ. 2018 కోట్లు.

ఆర్‌. సాంబశివరావు

గుంటూరుకు చెందిన రాయపాటి సాంబశివరావు మోడీ ప్రభుత్వంలో భాగస్వా మిగా ఉన్న తెలుగుదేశం పార్లమెంటు సభ్యుడు. ఈయన కంపెనీ జయలక్ష్మి స్పిన్నింగ్‌ మార్కెట్‌ విలువ కేవలం రూ. 3 కోట్లే. కానీ ఈయన బ్యాంకులకు ఎగవేసిన మొత్తం రుణం రూ. 1150 కోట్లు.

వై. సుజనాచౌదరి

తెలుగుదేశం పార్లమెంటు సభ్యుడు - మోడీ ప్రభుత్వంలో సైన్స్‌ E టెక్నాలజీ మంత్రి. ఈయన నిర్వహణలోని సజనా గ్రూప్‌ ఆఫ్‌ కంపెనీస్‌ మార్కెట్‌ విలువ రూ. 157 కోట్లు. ఈయన ఎగవేసిన రుణాల మొత్తం రూ. 940 కోట్లు.

వెంకట్రామిరెడ్డి

కాంగ్రెస్‌ మాజీ ఎంపీ చంద్రశేఖర్‌ కుమారుడు - ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ ఆర్‌ రెడ్డికి దగ్గరివాడు. రూ. 118 కోట్ల మార్కెట్‌ విలువ గల డెక్కన్‌ క్రానికల్‌ హౌల్డింగ్స్‌ అధిపతి అయిన రెడ్డి ఎగవేసిన బ్యాంకు రుణం రూ. 3,950 కోట్లు.

మనోజ్‌ జైస్వాల్‌

యూపీఏ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న శ్రీప్రకాశ్‌ జైస్వాల్‌ బంధువు. మహారాష్ట్ర మాజీ మంత్రి రాజేంద్ర దర్డా బిజినెస్‌ పార్టనర్‌. ఈయన నడిపించే మైనింగ్‌ కంపెనీ పేరు అభిజీత్‌ గ్రూపు. ఈయన బ్యాంకులకు ఎగవేసింది రూ. 4087 కోట్లు.

బి.హెచ్‌. కోఠారీ

ధీరూభారు అంబానీ కూతురు (ముకేశ్‌ అంబానీ సోదరి) నీనా భర్త. ఈయన నిర్వహణలోని కొఠారీ పెట్రోకెమికల్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ మార్కెట్‌ విలువ రూ. 225 కోట్లు. ఈయన ఎగ్గొట్టిన మొత్తం బ్యాంకు రుణాలు రూ. 90 కోట్లు.

దీపక్‌ పూరీ

2010లో యూపీఏ హయాంలో పద్మశ్రీ అవార్డు గెల్చుకున్న దీపక్‌ మోజర్‌బియర్‌ ఇండియా లిమిటెడ్‌ అధిపతి. దీని మార్కెట్‌ విలువ రూ. 195 కోట్లు కాగా, బ్యాంకులకు ఎగవేసిన రుణం రూ. 1,004 కోట్లు.

అజితాబ్‌ బచ్చన్‌

బాలీవుడ్‌ మహానటుడు అమితాబ్‌ బచ్చన్‌ సోదరుడు. రిలయన్స్‌ సిలికాన్స్‌ ఇం డియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ అనే కంపెనీని నడిపించే అజితాబ్‌ బ్యాంకులకు రూ. 25 కోట్లు టోపీ పెట్టారు.