Begin typing your search above and press return to search.
అభినందన్ ను అలా వాడేస్తున్నారుగా?
By: Tupaki Desk | 16 April 2019 6:38 AM GMTఎన్నికల వేళ వచ్చే ఏ చిన్న మైలేజీని వదిలిపెట్టటానికి ఏ రాజకీయ పార్టీ సిద్ధంగా ఉండదు. అయితే.. పార్టీ సంగతమేమో కానీ.. బీజేపీ అభిమానులు.. వారి సానుభూతిపరులు చేస్తున్న చేష్టలు వెగటు పుట్టించేలా ఉంటున్నాయి.
పార్టీ ఇమేజ్.. మోడీ నాయకత్వాన్ని మెచ్చుకునేలా అందరూ ఉన్నారన్న భావన కలిగించేందుకు వారు చేస్తున్న ప్రయత్నాలు షాకింగ్ గా మారాయి.
తాజాగా అలాంటిదే మరొకటి తెర మీదకు వచ్చింది. భారత వాయుసేన వింగ్ కమాండర్ అభినందన్ వర్తమాన్ బీజేపీకి మద్దతు పలుకుతున్నారా? అన్న ప్రశ్న తలెత్తేలా ప్రచారం సాగుతుంది. సోషల్ మీడియాలోనూ.. వాట్సాప్ గ్రూపుల్లోనూ ఇందుకు సంబంధించిన పోస్టు ఒకటి వైరల్ గా మారింది.
వింగ్ కమాండర్ అభినందన్ బహిరంగంగా బీజేపీకి మద్దతు పలకటంతో పాటు ఓటు వేశారు. మోడీ ప్రధాని కావాలని కోరుకుంటూ అభినందన్.. మోడీ కంటే మంచి ప్రధాని మరొకరు ఉండరు. కాంగ్రెస్ వర్గీయులు ఏ ఒక్క జవాన్ ను సజీవంగా తీసుకురాలేదన్నట్లుగా ఉన్న మెసేజ్ ఒకటి వైరల్ గా మారింది.
ఈ పోస్టు దగ్గర ఉన్న అభినందన్ ఫోటోలో ఆయన మెడలో బీజేపీ కండువా ఉంది. ఈ ఫోటోను జాగ్రత్తగా పరిశీలిస్తే.. అది మార్ఫింగ్ చేసినదిగా కనిపించక మానదు. అభినందన్ మెడలో నల్లటి తాడు ఉండదు. తాజా ఫోటోలో మెడ దగ్గర నల్ల తాడు కనిపిస్తుంది. అభినందన్ ముఖానికి.. ఈ పోస్టులో పెట్టిన ముఖానికి మధ్య తేడాలు కనిపిస్తున్నాయి. మీసాలు తప్పించి.. మిగిలిన వాటిల్లో తేడాలు ఉండటం చూస్తే.. మార్ఫింగ్ చేసిన ఫోటోగా తెలుస్తుంది. మైలేజీ కోసం బీజేపీ వర్గాలు మరీ ఈ స్థాయిలో దిగజారాలా? అన్న వ్యాఖ్యలు పలువురి నోట వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే.. భారతవాయుసేన అధికారులు తెలిపిన వివరాల ప్రకారం అభినందన్ కు సోషల్ మీడియాలో ఎలాంటి అకౌంట్ లేదు. ఎవరో ఆయన పేరుతో అకౌంట్ క్రియేట్ చేసి తప్పుదారి పట్టిస్తున్నట్లుగా భావిస్తున్నారు. రానున్న రోజుల్లో ఇలాంటివెన్ని చూడాల్సి వస్తుందో?