Begin typing your search above and press return to search.

చలికాలంలో శృంగారం.? మంచిదేనా?

By:  Tupaki Desk   |   16 Oct 2020 2:30 AM GMT
చలికాలంలో శృంగారం.? మంచిదేనా?
X
ఆలుమగలు కానీ.. ప్రేమికుల మధ్య కానీ ప్రేమ, ఆప్యాయత పెరగాలంటే శృంగారం వల్లే సాధ్యమని నిపుణులు చెబుతున్నారు. కలయికతో సంతోషాన్నిచ్చే హార్మోన్లు విడుదల అయ్యి తలనొప్పి తగ్గిపోయి ఒత్తిడంతా మాయమై హాయిగా నిద్రపడుతుందని చెబుతున్నారు. అన్ని కాలాల్లోకెల్లా చలికాలం శృంగారానికి అత్యంత అనువైనదని తాజా పరిశోధనలో తేలింది.

ఆలుమగలిద్దరూ నవంబర్ నుంచి ఫిబ్రవరి వరకు చలికాలంలో శృంగారంలో ఎక్కువగా పాల్గొంటే మంచిదని.. ఈ కాలంలో సెక్స్ ను బాగా ఎంజాయ్ చేస్తారని.. పిల్లలు కనాలనుకునేవారికి ఇదే తగిన సమయం అని నిపుణులు చెబుతున్నారు. వేసవితో పోలిస్తే చలికాలంలో పురుషుల్లో వీర్యకణాల సంఖ్య ఎక్కువగా ఉంటుందట.. కాబట్టి చలికాలంలో సెక్స్ లో పాల్గొంటే పిల్లలు పుట్టే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని తాజా పరిశోధనలో తేలింది. చలికాలంలో టెస్టోస్టీరాన్ హార్మోన్ పురుషుల్లో ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది.. ఇది సంతానం కలుగ చేస్తోందని తేలింది.

ఇప్పటికీ మిగతా కాలాల్లో కంటే చలికాలంలోనే జంటలు ఎక్కువగా సెక్స్ కోసం పరితపిస్తుంటారు. చాలా దేశాల్లో వర్షకాలంలో జంటలకు పెళ్లిళ్లు చేస్తారు. చలికాలంలో వారు శృంగారంలో ఎక్కువగా పాల్గొని పిల్లలను కంటారట.. చలికాలంలో జీవితానికి సెక్స్ లైఫ్ బాగుంటుందని చెబుతున్నారు.

ఎండాకాలంలో వేసవి వేడి ఉష్ణోగ్రత వల్ల జంటలు దగ్గరయ్యేందుకు ఇష్టపడరు. చలికాలంలో శరీరాలు వెచ్చదనాన్ని కోరుకుంటాయి. దీంతో ఎక్కువ సేపు శృంగారం చేయడానికి చలికాలం బెటర్ అని.. పురుషుల అంగం, స్త్రీ రుతుక్రమ సమస్యలు చలికాలంలో తక్కువగా ఉంటాయని పరిశోధనలో తేలింది.