Begin typing your search above and press return to search.
విప్రో/ఇన్ఫోసిస్ సీఈవో సత్యనాదెళ్ల.. నోరుజారిన రేవంత్ రెడ్డి
By: Tupaki Desk | 26 Aug 2021 7:37 AM GMTరాజకీయ నేతలు ఎవరైనా సరే చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. లేకుంటే నెటిజన్లకు దొరికిపోయి తెగ ట్రోల్స్ కు గురవుతారు. తాజాగా రేవంత్ రెడ్డి సైతం అలానే అడ్డంగా బుక్కయ్యాడు. తెలంగాణ పీసీసీ చీఫ్ సత్యనాదెళ్లకు టెక్నికల్ నాలెడ్జ్ తక్కువన్నసంగతి తాజాగా వీడియో సాక్షిగా బయటపడింది.
సీఎం కేసీఆర్ దత్తత గ్రామం అయిన మూడు చింతలపల్లిలో రెండు రోజుల నిరాహార దీక్ష ముగించిన సమయంలో రేవంత్ రెడ్డి కొన్ని షాకింగ్ వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ.. ‘2023లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పుడు ప్రతీ పేద, గిరిజన , మైనారిటీ పిల్లలకు ఉన్నత నాణ్యమైన విమ్య అందిస్తామని.. విద్య మాత్రమే పేదరికాన్ని తొలగిస్తుందని ’ తెలిపారు.
‘బాగా చదువుకుంటే ప్రతి ఒక్కరూ ఒక్కో కంపెనీకి సీఈవోలు అవుతారని.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అగ్రశ్రేణి కంపెనీలకు మన బిడ్డలే నాయకులుగా ఉన్నారని’ రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చాడు. విప్రో/ఇన్ఫోసిస్ సీఈవో అయిన సత్య నాదెళ్ల ను ఆదర్శంగా తీసుకోండి’ అని రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు. రేవంత్ రెడ్డికి అసలు సత్యనాదెళ్ల ఏ కంపెనీ సీఈవోను తెలియకపోవడం పక్కనున్న వారిని అడిగి మరీ నోరు జారడం వీడియోలో కనిపించింది.
రేవంత్ నోరుజారిన ఈ వీడియోను టీఆర్ఎస్ సోషల్ మీడియా సైన్యం అందిపుచ్చుకుంది. రేవంత్ రెడ్డిని ట్రోల్ చేస్తోంది. ఇప్పుడు ‘సత్య నాదెళ్ల విప్రో/ఇన్ఫోసిస్ సీఈవో’ అన్న రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు ఆయన పరువు తీసేలా తయారయ్యాయి. అందుకే నేతలు ప్రసంగించేంటప్పుడు చాలా జాగ్రత్తగా తెలుసుకొని మాట్లాడాలని సూచిస్తున్నారు.