Begin typing your search above and press return to search.

ట్రంప్ పై చేతబడి ప్రయోగం?

By:  Tupaki Desk   |   26 Feb 2017 11:04 AM GMT
ట్రంప్ పై చేతబడి ప్రయోగం?
X
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సృష్టిస్తున్న అల్లకల్లోలం అంతాఇంతా కాదు. ట్రంప్ దెబ్బకు విదేశీయులే కాదు అమెరికన్లూ జడుసుకుంటున్నారు. ట్రంప్ వల్ల అమెరికాతో పాటు ప్రపంచం కూడా నాశనం కావడం ఖాయమంటున్నారు. అందుకే ట్రంప్ అమెరికాను నాశనం చేయడానికి ముందే ట్రంపును నాశనం చేయాలని పిలుపునిస్తున్నారు. అందులో భాగంగానే ప్రముఖ గాయని లానా డెల్‌ రే సోషల్ మీడియా వేదికగా బహిరంగంగా ఓ పిలుపునిచ్చింది. ట్రంప్‌, అతడి క్యాబినెట్‌‌ వల్ల అమెరికా నాశనం కాకుండా ఉండేందుకు ప్రపంచవ్యాప్తంగా మాంత్రికులంతా న్యూయార్క్‌లోని ట్రంప్‌ టవర్‌ వద్దకు రావాలని పేర్కొంటూ సామాజిక మాధ్యమాల్లో విజ్ఞప్తి చేసింది.

ఇదంతా ఒకెత్తయితే ఆమె పిలుపు అందుకొని శుక్రవారం అర్ధరాత్రి కొందరు క్షుద్ర పూజలు చేసేవారు నిజంగానే ట్రంప్‌ టవర్‌ వద్దకు చేరుకున్నారు. ట్రంప్‌కు వ్యతిరేకంగా క్షుద్రపూజలు చేశారు. ఇదే విదంగా మార్చి 26, ఏప్రిల్‌ 24 , మే 23 తేదీల్లోనూ చేయాలని లానా డెల్‌ ప్రకటించారు. ఇవి సాధారణంగా ఎంపిక చేసిన తేదీలు కావని, చేతబడి చేసేందుకు అవి బలమైన రోజులని ఆమె చెబుతున్నారు.

ట్రంప్ కు వ్యతిరేకంగా పూజలు చేయడానికి అవసరమైన సామగ్రి, పూజా విధానం కూడా ఆమె వివరించింది. అన్నీ తీసుకుని వస్తే సామూహిక క్షుద్ర పూజలు చేయొచ్చని ఈ సింగర్ చెబుతోంది. ట్రంప్ ను అంధుడిని చేయాలని కోరుతూ పూజలు చేయాలని.. అప్పుడే ఆయన మనుషులకు, చెట్లకు, గాలికి, నీటికి దేనికీ హాని చేయకుండా ఉంటాడని అంటోంది. అతడి వల్ల ప్రజల్లో ద్వేషం, అస్థిర ఆలోచనలు, భయం, రాకుండా ఉండేలా క్షుద్ర దేవతలను కోరాలని ఈ గాయని పిలుపునిచ్చింది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/