Begin typing your search above and press return to search.
మూడు రాజధానులపై పక్కా ప్లాన్ తోనే....?
By: Tupaki Desk | 15 Sep 2022 4:35 AM GMTమూడు రాజధానులు ఇపుడు ఏపీని వేడెక్కిస్తున్న అంశం. అతి కొద్ది రోజులు మాత్రమే జరుగుతున్న వర్షాకాల సమావేశాల్లో అత్యంత కీలకమైన అంశంగా మూడు రాజధానులు మారబోతున్నాయని అంటున్నారు. మూడు రాజధానుల బిల్లు ఈ సమావేశాల్లోనే ప్రవేశపెట్టి అమోదించుకోవడానికి ప్రభుత్వం చాలా పట్టుదలగా ఉంది అంటున్నారు.
బిల్లుని చట్టంగా మార్చి ఏకంగా అమరావతి టూ విశాఖకు కీలక కార్యాలయాలు తరలించే విధంగా సర్కార్ పెద్దలు భారీ స్కెచ్ గీస్తున్నారు అని అంటున్నారు. అదే కనుక జరిగితే అపుడు విపక్షానికి గట్టి దెబ్బ తగిలే అవకాశం ఉంటుంది. అయితే ఈ విషయంలో సర్కార్ ఆలోచనలు ఎంత పదును తేరి ఉన్నా ఎంత దూకుడుగా వెళ్తున్నా కూడా కొన్ని న్యాయపరమైన చిక్కులు చికాకులు ఉంటాయని అంటున్నారు.
మరి వాటిని ప్రభుత్వం ఎలా అధిగమిస్తుంది అన్నది చర్చగా ఉంది. ఎట్టి పరిస్థితుల్లోనూ దసరా తరువాత నుంచి విశాఖ వేదికగా పాలన చేయాలని ముఖ్యమంత్రి జగన్ నిర్ణయించుకున్న క్రమంలో మూడు రాజధానుల వ్యవహారం ఏపీలో హీటెక్కిపోతోంది. అసెంబ్లీలో మూడు రాజధానుల బిల్లు ఎలా ప్రవేసపెడతారు, హై కోర్టు తీర్పును ఉల్లంఘిస్తారా అని మాజీ మంత్రి టీడీపీ సీనియర్ నేత యనమల రామక్రిష్ణుడు ప్రశ్నిస్తున్నారు.
అయితే ప్రభుత్వ వర్గాలు మాత్రం అన్ని రకాలైన జాగ్రత్తలు తీసుకునే బిల్లుని ప్రవేశపెడుతున్నామని, పైగా ఇది రాజ్యాంగానికి న్యాయ సూత్రాలకు లోబడే ఉంటుందని చెబుతున్నారు. ఇప్పటికే దీని మీద పూర్తి కసరత్తు అయిందని, ఇక దాన్ని జాగ్రత్తగా అంటే అంతా అనుకున్న విధంగా అమలు చేయడమే మిగిలింది అంటున్నారు.
శాసనసభలో సుదీర్ఘమైన చర్చ అంతా మూడు రాజధానుల చుట్టే తిప్పి దాన్ని ఆమోదించుకోవడం తోనే వర్షాకాలం సమావేశాలు మొత్తం సమయం వాడుకోవాలని ప్రభుత్వం ఉంది అంటున్నారు. మరో వైపు కేంద్ర మంత్రి నారాయాణస్వామి ఏపీ టూర్ లో మీరు ఎన్ని రాజధానులు పెట్టుకున్నా పెట్టుకోండి కానీ అమరావతి అభివృద్ధిని మాత్రం మరచిపోకండని చెప్పడాన్ని కూడా రాజకీయాల్లో ఆసక్తికరమైన అంశంగా చూస్తున్నారు.
అంటే కేంద్రానికి ఏపీ రాజధానుల మీద పెద్దగా ఆసక్తి కానీ కుతూహలం కానీ లేదని అర్ధమవుతోంది. అదే టైం లో కేంద్రం అమరావతినే తాము రాజధానిగా గుర్తిస్తున్నట్లుగా పేర్కొంటోంది. అంటే ఎన్ని రాజధానులు అయిన ప్రధాన రాజధానిగా అమరావతి మాత్రమే ఉండాలన్నది కేంద్ర బీజేపీ వర్గాల ఉద్దేశ్యంగా కనిపిస్తోంది. అదే సమయంలో మేముఒకే ఒక రాజధానికే నిధులు ఇచ్చి సాయం చేస్తామని చెబుతోంది.
ఇక కేంద్రం ఇచ్చే నిధులను అమరావతికి వాడాలా రేపటి రోజున విశాఖకు వాడాలా అన్నది కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇష్టం మేరకే ఉంటుందా లేక దానికి కచ్చితంగా అమరావతికి మాత్రమే అని కేంద్రం ఏమైనా నిబంధనలు విధిస్తుందా అన్నది కూడా చూడాలి. ఏది ఏమైనా ఏపీలో మూడు రాజధానుల అంశానికి కౌంట్ డౌన్ స్టార్ట్ అయినట్లే. దీని పరిణామాలు ఎలా ఉంటాయో చూడాల్సిందే.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.