Begin typing your search above and press return to search.
ఫేస్ బుక్ లో కరోనా వైరస్...అందుకే కీలక నిర్ణయం
By: Tupaki Desk | 7 March 2020 6:06 PM GMTఫేస్ బుక్ లో కరోనా అంటే ఫేస్ బుక్ వాడితే కరోనా వస్తుందని కాదండి బాబు. ఫేస్ బుక్ కార్యాలయంలోని ఓ వ్యక్తికి కరోనా సోకింది అని. ఇది తెలిసిందే అంటారా. దానికి కొనసాగింపు తెలుసుకోండి మరి. ఫేస్‌బుక్ ఉద్యోగుల్లో ఒకరికి కోవిడ్ వైరస్ ఉన్నట్లు నిర్ధారణ అవడంతో యాజమాన్యం లండన్ లోని తన కార్యాలయాన్ని శుక్రవారం నుంచి మూసివేసింది. మళ్లీ కార్యాలయాన్ని తెరిచే వరకు ఇంటి వద్ద నుంచి పనిచేయాల్సిందిగా ఉద్యోగులను ఆదేశించింది.
లండన్ ఆఫీసు నిర్ణయం గురించి సంస్థ ప్రతినిధి ఒకరు వివరిస్తూ - సింగపూర్ లో ఫేస్ బుక్ కంపెనీ కార్యాలయంలో పనిచేసే ఓ ఉద్యోగి గత ఫిబ్రవరి 24వ తేదీ నుంచి 26వ తేదీ వరకు లండన్ లోని ఈ కార్యాలయానికి విచ్చేశారట. అయితే, అనంతరం ఆయనకు కరోనా వైరస్ సోకినట్లు నిర్ధారణ అయిందట. దీంతో షాక్ తిన్న ఫేస్ బుక్ మిగతా వారి భద్రత కోసం ‘ఫేస్ బుక్’ లండన్ కార్యాలయాన్ని మూసివేసింది. తాము మళ్లీ సమాచారం ఇచ్చేవరకూ ఆఫీసుకు రానవసరం లేకుండా ఇంటివద్ద నుంచే పనిచేయాలని కోరింది.
దీంతోపాటుగా ఉద్యోగులకు ఫేస్ బుక్ పలు కీలక సూచనలు చేసింది. ఉద్యోగుల్లో ఎవరైనా జలుబు - దగ్గు, -జ్వరంతో బాధ పడుతున్నట్లయితే వారు వెంటనే ఆస్పత్రి సందర్శించి వైద్య చికిత్స చేయించుకోవాలని తెలిపింది. ఇక కార్యాలయం విషయానికి వస్తే... లండన్ లోని భవనంలో వైరస్ ఆనవాళ్లు లేకుండా చేసేందుకు వైద్య పరంగా శుద్ధి కార్యాక్రమాన్ని చేపడుతున్నామని తెలిపింది. అది పూర్తయ్యాక మళ్లీ కార్యాలయాన్ని తెరుస్తామని పేర్కొంటూ అప్పుడే ఉద్యోగులు ఆఫీసు బాట పట్టాలని కోరింది.