Begin typing your search above and press return to search.
ఐదు సార్లు సీఎం...ఆస్తి విలువ తెలిస్తే షాక్!
By: Tupaki Desk | 30 Jan 2018 7:18 PM GMTఆయన ఓ రాష్ట్రానికి ముఖ్యమంత్రి....ఒకటికాదు....రెండు కాదు....1998 నుంచి వరుసగా 5 సార్లు ఆ రాష్ట్రాన్ని పరిపాలించారు. ప్రజలే ఆయన ఆస్తిపాస్తులు....తన ముఖ్యమంత్రి పదవికి వచ్చే జీతంలో కూడా మూడోవంతు మాత్రమే తీసుకునే ఉదార నేత.....ఇప్పటికీ సొంత ఇల్లు లేని ప్రజా నేత....ప్రజారంజక పాలనే పరమావధిగా.....నిస్వార్థ రాజకీయ నేతగా ప్రఖ్యాతి గాంచిన ఆ ముఖ్యమంత్రి మరెవరో కాదు...త్రిపుర సీఎం మాణిక్ సర్కార్. 5 సార్లు ఓ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి...వేల కోట్ల రూపాయల ఆస్తులు కూడబెడుతున్న ఈ రోజుల్లో.....కేవలం రూ.1520 రూపాయలే ఆస్తిపాస్తులుగా కలిగి ఉండడం నిజంగా గొప్ప విషయమే. దేశంలోని అతిపేద ముఖ్యమంత్రిగా రికార్డు క్రియేట్ చేసిన మాణిక్ సర్కార్....సోమవారం దాఖలు చేసిన ఎన్నికల నామినేషన్ లో విస్తుపోయే వాస్తవాలను వెల్లడించారు.
త్వరలో జరగబోతోన్న త్రిపుర శాసనసభ ఎన్నికలకు ధన్‌పూర్ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగబోతోన్న మాణిక్ సర్కార్ నిన్న నామినేషన్ దాఖలు చేశారు. సర్కార్ సమర్పించిన అఫిడవిట్ లో తన పేరిట అగర్తలలో 0.0018 ఎకరాల వ్యవసాయేతర భూమి ఉన్నట్లు చూపించారు. అందులో, తన ప్రస్తుత ఆస్తి రూ.1,520/-గఆ చూపించారు. ఈ నెల 20వ తేదీకి ఆయన బ్యాంకు ఖాతాలో రూ. 2,410లు ఉన్నాయి. 2013లో ఎన్నికల సమయంలో ఆయన బ్యాంకు ఖాతాలో రూ. 9,720/-లు మాత్రమే ఉన్నాయి. సీఎంగా సర్కార్ కు వచ్చే జీతం రూ. 26,315/-. ఆ డబ్బును పార్టీ(సీపీఐ) నిధికి విరాళమిస్తారు. అందుకోసం ఆయనకు నెలకు రూ. 9,700/-లు పార్టీ అలవెన్సుగా తిరిగి చెల్లిస్తారు. సర్కార్ కు మొబైల్ ఫోన్ కూడా లేదు...సోషల్ మీడియా ఖాతాలు లేవు. సర్కార్ భార్య పాంచాలి భట్టాచర్జీ ఓ రిటైర్డ్ గవర్నమెంట్ ఉద్యోగి. ఆమె ఖాతాలో మాత్రం రూ.12 లక్షల నగదున్నట్లు అఫిడవిట్ లో చూపారు. సీఎం అధికారిక నివాసంలో ఉంటున్న వీరికి సొంత ఇల్లు లేదు. సర్కార్ భార్య తరచూ అగర్తలాలోని రిక్షాల్లో ప్రయాణిస్తూ కనిపిస్తారు. కొద్ది రోజుల క్రితం గుంటూరుకు వచ్చిన పాంచాలిని చూసిన ప్రజలు ఆమె సీఎం భార్య అంటే నమ్మలేదని వార్తలు వచ్చాయి. ఇంత సాదాసీదాగా జీవితాన్ని గడుపుతున్నందునే ప్రజలు ఆయనకు మళ్లీ మళ్లీ పట్టం కడుతున్నారు.