Begin typing your search above and press return to search.
అతి ధీమాతోనేనా...?
By: Tupaki Desk | 30 Jan 2022 1:30 AM GMTఆత్మ విశ్వాసం ఉండాలి. అయితే అది అతి కాకూడదు, ఏపీలో చూస్తే ఇద్దరు ప్రముఖ నాయకుల మధ్య వ్యత్యాసం చాలా కనిపిస్తుంది. టీడీపీ అధినేత చంద్రబాబు ప్రతీ చిన్న విషయం మీద కూడా ఆచీ తూచీ స్పందిస్తారు. అదే వైసీపీ అధినేత జగన్ దూకుడుగా ఉంటారు. దాని వల్ల లాభం నష్టం రెండూ ఉన్నాయి. కానీ జగన్ అదే విధానం కరెక్ట్ అనుకుంటారు.
ఇక ఆత్మ విశ్వాసం కూడా జగన్ కి మెండు అని చెబుతారు. ఆయన ఏదైనా ముందుకే అన్నట్లుగా ఉంటారు. దానికి తోడు 2019 సార్వత్రిక ఎన్నికల నుంచి ఇప్పటిదాకా జరిగిన లోకల్ బాడీస్, ఉప ఎన్నికల్లో ఏక పక్ష విజయాలు నమోదు కావడంతో వైసీపీ కత్తికి ఎదురులేదని జగన్ భావిస్తున్నారా అంటే అవును అనే జవాబు వస్తోంది.
జగన్ జనాలు తన వైపే ఉన్నారు అని అనుకుంటున్నారు. ఇచ్చిన హామీల మేరకు తాను సంక్షేమ కార్యక్రమాలను పూర్తిగా అమలు చేస్తున్నాను అని ఆయన ఆలోచనగా ఉంది. అయితే కేవలం సంక్షేమం ఒక్కటే సరిపోదు, అభివృద్ధి కూడా ఉండాలి. ఏపీలో చూసుకుంటే అది లోటుగా ఉంది. అదే సమయంలో ఉపాధి కల్పనా అవకాశాలు కూడా లేకుండా పోయాయి. కొత్తగా పరిశ్రమలు ఏవీ రావడంలేదు. ఇక ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసుని మరో రెండేళ్ళు జాన్ పెంచేశారు. దాని వల్ల వారికి ఎలా ఉన్నా నిరుద్యోగులు మాత్రం రగులుతున్నారు.
ఇక ప్రభుత్వ ఉద్యోగులు సైతం సమర శంఖం పూరించారు. వారి విషయంలో ప్రభుత్వం కఠినంగా ఉండాలనుకుంటోంది. కానీ వారు ఏపీ రాజకీయాల్లో ప్రభావితమైన అతి పెద్ద వర్గం. పదమూడు లక్షల మంది ఉద్యోగులు వారి కుటుంబాలు కలపి అరకోటి అంటే చాలా పెద్ద నంబర్. అయితే వైసీపీ పెద్దలు మాత్రం ఉద్యోగులు ఏమీ చేయలేరన్న ధీమాలో ఉన్నారా అన్న డౌట్లు వస్తున్నాయి.
ఇక ఎంతటి గొప్ప పాలన అందించినా కూడా అయిదేళ్ళ పాలన గడిచేసరికి అసంతృప్త జనాభా అంటూ ఒకటి ఉంటుంది. అలాగే కొన్ని సెక్షన్లు దూరం అవుతాయి. అందువల్ల మునుపటి విజయాలు అంటే ఎవరికీ సాధ్యపడవు. కానీ వైసీపీలో అయితే అధినాయకత్వం మళ్ళీ మేమే అన్న విశ్వాసంతో ఉంది. అందుకే విపక్షాలను పట్టించుకోవడంలేదు, అదే టైమ్ లో ఉద్యోగులు ఆందోళన చేపడుతున్నా పెద్దగా రియాక్ట్ కావడంలేదు అంటున్నారు.
ఒక్కో ఓటూ కలిస్తేనే విజయం సాధ్యపడుతుంది. అలగే ఒక్కో వర్గం అసంతృప్తికి లోనైతే అది ఎన్నికల్లో చేటు తెస్తుంది అన్నది చరిత్ర చెప్పిన నిజం. మరి ఏపీలో తమదే మళ్లీ మళ్ళీ విజయం అని భావిస్తున్న వైసీపీ అధినాయకత్వం మాత్రం కొంత దూకుడుగానే వెళ్తోంది అన్న మాట ఉంది. చూడాలి మరి ఏం జరుగుతుందో.