Begin typing your search above and press return to search.

ఆ నినాదంతో తెలుగుదేశం పార్టీలో కలవరం పుడుతోందా!

By:  Tupaki Desk   |   3 Oct 2019 7:01 AM GMT
ఆ నినాదంతో తెలుగుదేశం పార్టీలో కలవరం పుడుతోందా!
X
'రాజన్న చదవిస్తే.. జగనన్న ఉద్యోగం ఇచ్చారు..' అని అంటున్నారు నూతనంగా నియమితమైన విలేజ్ సెక్రటేరియట్ ఉద్యోగులు. ఒకేసారి జగన్ మోహన్ రెడ్డి జంబో రిక్రూట్ మెంట్ ను అమలు చేసిన సంగతి తెలిసిందే. కనీవినీ ఎరగని స్థాయిలో ఈ నియామకాలు జరిగాయి. ఒక రాష్ట్రంలో ఒకేసారి లక్షకు పైగా ఉద్యోగాల భర్తీ అంటే మాటలు కాదు. అది కూగా గ్రూప్ ఫోర్ స్థాయి ఉద్యోగాలు అవి!

మంచి జీతభత్యాలు, ప్రభుత్వ ఉద్యోగి అనే పేరు రెండూ ఉంటాయి.అది కూడా భారీ స్థాయిలో రిక్రూట్ చేశారు. మరింత భారీ రిక్రూట్ మెంట్లు ఉంటాయి..బాగా చదువుకోండి.. అంటూ సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రకటించేశారు కూడా. ఇక ఉద్యోగం పొందిన వాళ్లు 'రాజన్న చదవిస్తే..జగనన్న ఉద్యోగం ఇచ్చారు' అని అంటున్నారు.

వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో..ఫీజు రీయింబర్స్ మెంట్ పథకం ప్రారంభం అయిన సంగతి తెలిసిందే. దీంతో అనేక మంది పేద పిల్లలు కూడా అప్పటి నుంచి ఉన్నత చదువులు చదవడానికి అవకాశం ఏర్పడింది.

బీసీలతో పాటు ఓసీల్లోని పేదలకు కూడా ఫీజు రీయింబర్స్ మెంట్ పథకాన్ని అమలు చేశారు వైఎస్.అదొక సంచలనం. దీంతో సాధారణ కుటుంబాల నుంచి వచ్చిన పిల్లలు కూడా బీటెక్ లు, ఎంబీఏ-ఎంసీలు, ఎమ్మెల్సీలు ఉచితంగా చదువుకోగలిగారు.

ఫీజు రీయింబర్స్ మెంట్ పథకమే లేకపోతే వారిలో చాలా మంది ఆ చదువులు చదవగలిగే వారు కాదు. అలా చదివిన చాలా మందికి ఇప్పుడు ఉద్యోగాలు వచ్చాయి. పదేళ్ల కిందట నుంచి ఫీజు రీయింబర్స్ మెంట్ అమల్లోకి వచ్చింది. ఇప్పుడు అలాంటి వారిలో చాలా మంది ఉద్యోగాలు పొందారు. చదువు చెప్పిన వాళ్లను, ఉద్యోగం ఇప్పించిన వాళ్లనూ ఎవరూ మరిచిపోలేరు. జగన్ ఏకంగా లక్ష కు పైగా ప్రభుత్వ ఉద్యోగాలను ఇచ్చారు. ఒక్కో కుటుంబానికి ఒక్కో ఉద్యోగం దీపం పెడుతుంది. ఈ లెక్కన ఈ రిక్రూట్ మెంట్ అనేది తెలుగుదేశం పార్టీకి భారీ ఝలక్ అని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.