Begin typing your search above and press return to search.
ఆ ఇద్దరి రాకతో ఐపీఎల్ వేలానికే కళొచ్చింది..!
By: Tupaki Desk | 20 Feb 2021 10:30 AM GMTచెన్నై వేదికగా నిన్న ఐపీఎల్ 2021 వేలం జరిగిన విషయం తెలిసిందే. ఈ వేలంలో ప్రాంచైజీలను కొనుగోలు చేయడానికి పలు జట్లు విపరీతంగా పోటీపడ్డాయి. కొందరు ఆటగాళ్లను ఎవరూ కొనుగోలు చేయకపోగా.. మరికొందరేమో ఊహించిన రీతిలో అత్యధిక రేటు పలికారు. ఇదిలా ఉంటే ఈ మొత్తం కార్యక్రమంలో ఓ పిక్ ఇప్పడు సోషల్‌మీడియాలో తెగ వైరల్ అవుతున్నది.
కోల్‌కతా నైట్‌రైడర్స్ యజమానులుగా షారూఖ్‌ఖాన్, జూహీచావ్లా కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ సారి వేలం కార్యక్రమానికి వీళ్ల పిల్లలు వచ్చారు. షారూఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్, జూహీ చావ్లా కూతురు జాహ్నవి మెహతా ఈ వేలం కార్యక్రమానికి హాజరయ్యారు.
కోల్‌కతా నైట్ రైడర్స్ ఫ్రాంచైజ్ సహయజమానులతో కలిసి ఈ ఇద్దరు టేబుల్ దగ్గర కూర్చున్న ఫోటోను జూహీ చావ్లా సోషల్ మీడియా ద్వారా షేర్ చేశారు. ‘కేకేఆర్ కిడ్స్ ఆర్యన్ , జాహ్నవిలను టేబుల్ దగ్గర చూడడం ఆనందంగా ఉంది’ అంటూ ఆమె రాసుకొచ్చారు. ఈ ఫొటో ఇప్పుడు సోషల్‌మీడియాలో తెగ వైరల్‌గా మారింది.
వీళ్లపై సోషల్‌మీడియాలో నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ‘వారసులొచ్చారు’ అంటూ కొంతమంది కామెంట్లు పెడుతుంటే.. వీళ్ల ఎంట్రీతో ఐపీఎల్ వేలానికి కళ వచ్చిందని మరికొందరు కామెంట్లు పెడుతున్నారు. ప్రస్తుతం ఎక్కడ చూసినా ఐపీఎల్ వేలంపైనే చర్చ జరుగుతోంది. ఇక ఐపీఎల్ సీజన్ వచ్చేసిందంటే రచ్చ మామూలుగా ఉండదు. సినిమా విడుదల కూడా వాయిదా వేస్తారంటే ఐపీఎల్‌కు ఉన్న క్రేజ్ ఏమిటో మనం అర్థం చేసుకోవచ్చు.