Begin typing your search above and press return to search.

ట్రంప్ వేసుకున్న‌ మందుతో.. క‌రోనా ఖ‌త‌మేన‌ట‌!

By:  Tupaki Desk   |   13 Jun 2021 8:30 AM GMT
ట్రంప్ వేసుకున్న‌ మందుతో.. క‌రోనా ఖ‌త‌మేన‌ట‌!
X
దేశంలో క‌రోనా సెకండ్ వేవ్ ఏ స్థాయిలో విజృంభించిందో అంద‌రికీ తెలిసిందే. నిత్యం ల‌క్ష‌లాది కేసులు.. వేలాది మ‌ర‌ణాల‌తో మార‌ణ‌హోం సృష్టించింది. ప్ర‌స్తుతం కాస్త శాంతిస్తున్న‌ప్ప‌టికీ.. థ‌ర్డ్ వేవ్ హెచ్చ‌రిక‌లు వినిపిస్తూనే ఉన్నాయి. ఈ నేప‌థ్యంలో క‌రోనాను ‘కాక్ టెయిల్’ తో ఖతం చేయొచ్చని ఓ మందు తెర‌పైకి వ‌చ్చింది. మ‌రి, దీని వివ‌రాలేంటీ? ఎలా ప‌నిచేస్తుంది? అన్న‌ది చూద్దాం.

దాని పేరు ‘మోనోక్లోనల్ యాంటీబాడీస్ కాక్ టెయిల్ డ్రగ్’. ప్రస్తుతం తెలంగాణలో ఏఐజీ, య‌శోద ఆసుప‌త్రుల్లో ప్ర‌యోగాత్మంగా వినియోగిస్తున్నారు. క‌సిరివిమాబ్‌, ఇమ్డెవిమాబ్ మందుల‌ను క‌లిపి దీన్ని రూపొందించారు. ఈ మందు వాడిన వారిలో ఆసుప‌త్రికి వెళ్లాల్సిన అవ‌స‌రం చాలా త‌క్కువ‌గా ఉంటుంద‌ని, దాదాపు 70 శాతం మ‌ర‌ణాలు త‌గ్గుతాయ‌ని నిపుణులు చెబుతున్నారు.

అమెరికా అధ్య‌క్షుడిగా ఉన్న స‌మ‌యంలో ట్రంప్ క‌రోనా బారిన ప‌డిన సంగ‌తి తెలిసిందే. ఆ స‌మ‌యంలో మోనోక్లోన‌ల్ యాంటీబాడీస్ మందునే ఆయ‌న తీసుకున్నారు. దీంతో.. ప్ర‌పంచం మొత్తం ఈ మందుపై ఆస‌క్తి చూపించింది. అయితే.. దీని ఖ‌రీదు చాలా ఎక్కువ‌. అమెరికాలో ఒక్క ఇంజెక్ష‌న్ ఖ‌రీదు దాదాపు 20 వేల డాల‌ర్లు. మ‌న క‌రెన్సీలో రూ.14 ల‌క్ష‌లు! అందుకే.. చాలా మంది దీన్ని తీసుకోవ‌ట్లేదట‌. అయితే.. ఇప్పుడు ఇండియాలో దీని ఖ‌రీదు రూ.60 వేల‌కే అందుబాటులోకి వ‌స్తోంద‌ని నిపుణులు చెబుతున్నారు.

ఇప్ప‌టి వ‌ర‌కు పై రెండు ఆసుప‌త్రుల్లోని దాదాపు 50 మందికి ఈ మందు ఇవ్వ‌గా.. ఒక్క రోజులోనే జ్వ‌రం, బాడీ పెయిన్స్ త‌గ్గిపోయాయ‌ట‌. సైడ్ ఎఫెక్ట్స్ కూడా పెద్ద‌గా లేవ‌ని చెబుతున్నారు. బ్రిట‌న్‌, సౌతాఫ్రికా, బ్రెజిల్ వేరియంట్ల‌పై ఈ మందు బాగా ప‌నిచేస్తోంద‌ని చెబుతున్న వైద్యులు.. ఇండియా వేరియంట్ల‌పై ప‌రిశోధిస్తున్న‌ట్టు చెబుతున్నారు. రెండు వారాల్లో క్లారిటీ వ‌స్తుంద‌ని, ఆ త‌ర్వాత వినియోగం పెంచ‌నున్న‌ట్టు చెబుతున్నారు.

ప్ర‌స్తుతం అమెరికాలో రెండు కంపెనీలు మాత్ర‌మే ఈ మందును త‌యారు చేస్తున్నాయి. ఇండియాలో జైడ‌స్ కంపెనీకి అనుమ‌తి ఇచ్చిన‌ట్టు తెలుస్తోంది. భార‌తీయ కంపెనీలు త‌యారు చేస్తే.. 10 నుంచి 15 వేల‌కే ఇంజ‌క్ష‌న్ అందుబాటులోకి రావొచ్చ‌ని చెబుతున్నారు. థ‌ర్డ్ వేవ్ ముంగిట ఇది ఎంతో ఉప‌యోగంగా ఉంటుంద‌ని అంటున్నారు. మ‌రి, ఏం జ‌రుగుతుంది? అన్న‌ది చూడాలి.