Begin typing your search above and press return to search.
రవిప్రకాష్ 18 కోట్లు ఆ హీరో ద్వారా హవాలా చేశాడా?
By: Tupaki Desk | 2 July 2020 11:10 AM GMTసంవత్సరకాలంగా స్తబ్దుగా ఉన్న టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాష్ ఫోర్జరీ, నిధుల మళ్లింపు కేసులో తాజాగా కదలిక వచ్చింది. టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాష్ పై ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ కేసు నమోదు చేసింది. రవిప్రకాష్ తోపాటు మరో ఇద్దరు అసోసియేటెడ్ బ్రాడ్ కాస్టింగ్ కంపెనీ లిమిటెడ్ లో 2018 సెప్టెంబర్ నుంచి 2019 మే వరకు రూ.18 కోట్ల నిధులను అనుమతుల్లేకుండా తీశారని ఆ సంస్థ ప్రతినిధి గతంలో బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. 2019 అక్టోబర్ లో కేసు నమోదు కాగా.. ఈడీ ఎన్ ఫోర్స్ మెంట్ కేస్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ (ఈసీఐఆర్) నమోదు చేసింది. అలాగే రవిప్రకాష్ కు సమన్లు ఇచ్చి ప్రశ్నించేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది.
టీవీ9 సంస్థలో రూ.18 కోట్ల స్కాం జరిగిందనే ఆరోపణలపై 2019 అక్టోబర్ లో రవిప్రకాష్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. రవిప్రకాష్ తోపాటు మరో ఇద్దరిపై కేసు నమోదైంది. తాజాగా ఈడీ ఇప్పుడు ఈ కేసులోకి ఎంట్రీ ఇచ్చింది. 2018లో అలంద మీడియా టీవీ9లో మెజార్టీ షేర్లను కొనుగోలు చేసింది.అయితే ఆ అకౌంట్లను పరిశీలిస్తే ఈ స్కాం బయటపడినట్లు సంస్థ చెప్పింది. డైరెక్టర్లు, షేర్ హోల్డర్ల అనుమతి లేకుండానే రవిప్రకాష్ డబ్బులు తీశాడని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రస్తుతం రవిప్రకాష్ బెయిల్ పై విడుదలై విచారణను ఎదుర్కొంటున్నాడు. ఇప్పుడు ఈడీ రంగ ప్రవేశంతో కేసు మరో మలుపు తిరిగింది.
టీవీ9లో ఫోర్జరీ, టీవీ9 లోగో అమ్మకం.. 18 కోట్ల నిధుల మళ్లింపులో ఏడాది కిందట సైబరాబాద్ సీసీఎస్ పోలీసులు నాటి టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాష్, మాజీ సీ.ఎఫ్.ఓ మూర్తి, టాలీవుడ్ హీరోకు నాడు నోటీసులు జారీ చేశారు. 18 కోట్ల నిధులను ఇదే ఆ హీరో ద్వారా హవాలా చేశాడు అని అనుకుంటున్నారు. ఆ హీరోతో రవిప్రకాష్ కు బాగా సాన్నిహిత్యంగా ఉంటాడు. ప్రస్తుతం సినిమాలు లేక రాజకీయం బాటపట్టి చంద్రబాబుకు మొన్నటి ఎన్నికల వరకు బాకా ఊదాడు. ఫేడ్ అవుట్ అయిన ఈ హీరో ఎప్పుడూ ప్రెస్ మీట్స్ పెట్టి న్యూస్ లో ఉండేవాడు. రవిప్రకాష్, సదురు హీరో ఇద్దరూ కలిసి అమెరికా కూడా చాలా సార్లు కనపడ్డారు. టీవీ9లో ఈ హీరోకు బాగా ప్రిఫెరెన్స్ ఇచ్చేవారు. టీవీ9లో పలు షేర్లు కూడా ఈ హీరోకు రవిప్రకాష్ అక్రమంగా బదలాయించాడని ఆరోపణలున్నాయి.
రవిప్రకాశ్ హవాలా కుంభకోణంలో ఈ హీరో పాత్ర బాగా ఉందని ప్రచారం ఉంది. ఇప్పుడు ఈడీ కేసు విచారణలో రవిప్రకాష్ తో మరో ఇద్దరిపై కేసు నమోదు చేశారు. అందులో ఒకరు ఈ హీరోనేని అంటున్నారు. నెక్ట్స్ హీరో పని కూడా అవుతుందనే ప్రచారం సాగుతోంది.