Begin typing your search above and press return to search.
అటెన్షన్ ప్లీజ్: పెళ్లికి రూ.2.5 లక్షలు ఇవ్వట్లేదు
By: Tupaki Desk | 20 Nov 2016 5:58 AM GMTతప్పు ఎక్కడ జరుగుతుందో తెలీని పరిస్థితి. కొన్ని నిర్ణయాలు ఎంత వేగంగా అమలు అవుతున్నాయో.. మరికొన్ని నిర్ణయాలు మాత్రం అందుకు పూర్తి భిన్నంగా చాలా ఆలస్యంగా.. నెమ్మదిగా సాగుతున్నవైనం విస్మయానికి గురి చేస్తోంది. 13 రోజలు క్రితం ప్రధాని మోడీ టీవీ స్క్రీన్ల మీదకు వచ్చి జాతి జనులను ఉద్దేశించి ప్రసంగించిన సమయంలో పెద్దనోట్లుగా చెప్పిన రూ.1000.. రూ.500 నోట్లను రద్దు చేస్తున్నట్లుగా చెప్పారు.
రాత్రి ఎనిమిది గంటల సమయంలో ప్రకటించిన ఈ సంచలన నిర్ణయం అర్థరాత్రి 12 గంటల నుంచి అమలవుతుందని చెప్పారు. మోడీ నోట మాట వచ్చిందో లేదో.. తమ దగ్గరున్న పెద్ద నోట్లను వదిలించుకునే పనిని చాలామంది మొదలు పెట్టారు. అయితే.. జనాల్లో కొందరు అప్పటికే అలెర్ట్ అయి పెద్దనోట్లను తీసుకోవటం మానేశారు. ప్రధాని నోట రద్దు మాట అలా వచ్చిందో లేదో.. ఇలా అమల్లోకి వచ్చేసిన పరిస్థితి.
ఇదే తరహాలో.. ప్రధాని ప్రకటించిన అన్ని నిర్ణయాలు యుద్ధ ప్రాతిపదికన అమలు కావాలి కదా? అని అనుకుంటే తప్పులో కాలేసినట్లే. ప్రధాని టీవీల్లో చెప్పిన విషయాన్ని ఎలాంటి ఆదేశాలు రాకున్నా.. బ్యాంకులు ఫాలో అయిపోయిన వైనం తెలిసిందే. అలాంటిది కేంద్ర ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి శక్తికాంత్ దాస్ స్వయంగా మీడియాతో మాట్లాడుతూ.. పెళ్లిళ్లు జరుగుతున్న వారికి రూ.2.5లక్షల మొత్తాన్ని ఇవ్వాలని కేంద్రం నిర్ణయించినట్లుగా ప్రకటించారు.
ఈ నిర్ణయాన్ని ప్రకటించి దాదాపు మూడు రోజులకు పైనే అవుతుంది. కానీ.. ఇప్పటివరకూ ఆ నిర్ణయాన్ని అమలు చేసింది లేదు. అదేమని అడిగితే.. తమకు లిఖితపూర్వకంగా సమాచారం అందలేదని.. తాము ఏమీ చేయలేమని బ్యాంకర్లు చేతులు ఎత్తేసిన వైనం కనిపిస్తుంది. అసలు ప్రశ్న ఏమిటంటే.. ప్రజలకు ఇబ్బంది పడే అంశాన్నిఎలాంటి లిఖితపూర్వక ఆదేశాలు రాకున్నా అమలు చేసే బ్యాంకు సిబ్బంది.. కేంద్ర ఆర్థికశాఖకు చెందిన కీలక అధికారి తానే స్వయంగా టీవీ స్క్రీన్ ల మీదకు వచ్చి.. పెళ్లిళ్లు జరుపుకునే కుటుంబాలకు సాంత్వన కలిగిస్తూ వారికి రూ.2.5లక్షలు (షరతులున్నాయి) విత్ డ్రా చేసుకునే వీలు కల్పిస్తున్నట్లు ప్రకటించారు.
ఈ ప్రకటన విడుదల చేసి మూడు.. నాలుగురోజులు గడుస్తున్నా.. ఈ రోజుకు అమలుకాని పరిస్థితి. పెళ్లిళ్లు పెట్టుకున్న కటుంబాలు.. ప్రభుత్వ నిర్ణయం నేపథ్యంలో పెళ్లి పనులు వదులుకొని బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నా.. పై నుంచి తమకు తగిన ఆదేశాలు రాలేదని.. వచ్చిన తర్వాత మాత్రమే తాము అమలు చేస్తామని కరాఖండిగా చెబుతున్నారు. ఒక అంచనాప్రకారం.. రిజర్వ్ బ్యాంకు నుంచి పెళ్లిపై చట్టబద్ధమైన ఆదేశాలు సోమవారం తర్వాత మాత్రమే వచ్చే వీలుందన్నఅభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇలాంటి వాటితో ప్రజలు తీవ్ర అసంతృప్తికి గురి అవుతున్న విషయాన్ని మోడీ అండ్ కో గుర్తిస్తే మంచిది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/