Begin typing your search above and press return to search.

కొత్త కండీష‌న్?: రూ.10ల‌క్ష‌లు విత్ డ్రా చేస్తున్నారా?

By:  Tupaki Desk   |   10 Jun 2019 11:18 AM GMT
కొత్త కండీష‌న్?:  రూ.10ల‌క్ష‌లు విత్ డ్రా చేస్తున్నారా?
X
ఏడాదిలో రూ.10ల‌క్ష‌లు. నెల‌కు రూ.80వేలు. ప్ర‌తి నెలా ఇంత మొత్తాన్ని డ్రా చేసే వారు త‌క్కువే ఉంటారు. కానీ.. కొన్ని సంద‌ర్భాల్లో మ‌న‌కు సంబంధం లేని విష‌యాల్లో కూడా న‌గ‌దు ఇచ్చిపుచ్చుకోవ‌టం.. ఎవ‌రికైనా డ‌బ్బులు అవ‌స‌ర‌మైతే స్నేహంగా స‌ర్ద‌టం.. చేబ‌దుళ్లు తీసుకోవ‌టం.. ఇవ్వ‌టం లాంటి పంచాయితీలు చాలానే ఉంటాయి. ఇలాంటి వాటి నేప‌థ్యంలో ఏడాది వ్య‌వ‌ధిలో డ‌బ్బును బ్యాంకు నుంచి డ్రా చేయ‌టం.. మ‌ళ్లీ అందులో వేయ‌టం లాంటివి త‌ర‌చూ చేసే వారు కోట్ల‌ల్లో ఉంటారు.

ఈ సంక్లిష్ట‌త‌ను అర్థం చేసుకుంటే స‌రే. అలా కాకుండా వెనుకా ముందు చూసుకోకుండా పెట్టే కొత్త ప‌రిమితులు మ‌ధ్య త‌ర‌గ‌తి జీవుల‌కు కొత్త ఇబ్బందుల‌కు గురి చేయ‌టం ఖాయం. తాజాగా వ‌స్తున్న వార్త‌ల్ని చూస్తే.. మధ్య‌త‌ర‌గ‌తి.. ఎగువ మ‌ధ్య త‌ర‌గ‌తి జీవులు తీవ్రంగా ప్ర‌భావిత‌మ‌య్యే నిర్ణ‌యాన్నికేంద్రం తీసుకోనున్న‌ట్లుగా వార్త‌లు వ‌స్తున్నాయి.

ఇంత‌కీ.. ఆ నిర్ణ‌యానికి సంబంధించిన స‌మాచారం ఏమంటే.. బ్లాక్ మ‌నీకి చెక్ చెప్పేందుకు వీలుగా కేంద్ర ఒక నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు చెబుతున్నారు. ఏడాదిలో రూ.10ల‌క్ష‌ల కంటే ఎక్కువ విత్ డ్రా చేసే వారి మీద త్వ‌ర‌లో ప‌న్నులు విధించేలా నిర్ణ‌యం తీసుకోవాల‌న్న ఆలోచ‌న‌లో కేంద్రం ఉన్న‌ట్లు చెబుతున్నారు.

అంతేకాదు.. ఎక్కువ మొత్తంలో న‌గ‌దును విత్ డ్రా చేయాలంటే ఆధార్ ధ్రువీక‌ర‌ణ త‌ప్ప‌నిస‌రి చేయాల‌న్న ఆలోచ‌న‌లో కేంద్రం ఉన్న‌ట్లుగా తెలుస్తోంది. కొన్నిజాతీయ మీడియాల‌లో వ‌చ్చిన వార్త‌ల ప్ర‌కారం.. ప్ర‌స్తుతం ప్ర‌తిపాద‌న‌ల ద‌శ‌లో ఉన్న ఈ నిర్ణ‌యంపై స‌మ‌గ్ర ప‌రిశీల‌న జ‌రిపి త్వ‌ర‌లో ఒక నిర్ణ‌యానికి రానున్న‌ట్లుగా చెబుతున్నారు.

తాజా నిర్ణ‌యం పేద‌.. మ‌ధ్య‌త‌ర‌గ‌తి వ‌ర్గాల‌కు భారం కాకూడ‌ద‌న్న యోచ‌న‌లోకేంద్రం ఉన్న‌ట్లు చెబుతున్నారు. ఇటీవ‌ల ఆర్ బీఐ ద్ర‌వ్య ప‌ర‌ప‌తి విధాన స‌మీక్ష సంద‌ర్భంగా నిఫ్ట్.. ఆర్టీజీఎస్ బ్యాంకు లావాదేవీల‌కు ఛార్జీల‌నుర‌ద్దు చేస్తూ నిర్ణ‌యాలు తీసుకున్నారు. తాజాగా ఏడాదిలో రూ.10ల‌క్ష‌ల‌కు పైన బ్యాంకుల నుంచి విత్ డ్రా చేసిన వారికి ప‌న్నులు విధించాల‌ని నిర్ణ‌యం తీసుకునే దిశ‌గా మోడీ స‌ర్కారు అడుగులు వేస్తోంద‌ని చెబుతున్నారు. అదే జ‌రిగితే.. ప‌లు వ‌ర్గాల నుంచి వ్య‌తిరేక‌త వ‌చ్చే వీలుంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.