Begin typing your search above and press return to search.

విదేశీ ఆటగాళ్లు లేకున్నా.. ఐపీఎల్​ కొనసాగిస్తాం..!

By:  Tupaki Desk   |   29 May 2021 1:30 PM GMT
విదేశీ ఆటగాళ్లు లేకున్నా.. ఐపీఎల్​ కొనసాగిస్తాం..!
X
కరోనా ఎఫెక్ట్​ తో ఐపీఎల్​ 2021 ఆగిపోయిన విషయం తెలిసిందే. దీంతో ఐపీఎల్​ ఎప్పుడు కొనసాగిస్తారు. అసలు కొనసాగిస్తారా లేదా అన్న అనుమానాలు అందరిలోనూ నెలకొన్నాయి. అయితే ఐపీఎల్ కొనసాగించి తీరతామని.. భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా అధికారికంగా ప్రకటించారు. దీంతో ఐపీఎల్​ కొనసాగింపుపై ఉన్న అనుమానాలు తీరిపోయాయి. ఇదిలా ఉంటే.. ఐపీఎల్​ 2021 కొనసాగింపు మ్యాచ్​ లు యూఏఈలో జరగనున్నాయి. ఈ క్రమంలో విదేశీ ఆటగాళ్లు ఈ మ్యాచ్​ లో ఆడతారా? లేదా? అన్న విషయంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ఈ ప్రశ్నలకు శుక్లా సమాధానాలు చెప్పారు. విదేశీ ఆటగాళ్లు వచ్చినా.. రాకపోయినా.. మ్యాచ్​లు కొనసాగించి తీరతామని ఆయన చెప్పారు.

ఇవాళ వర్చువల్‌ గా జరిగిన బోర్డు ప్రత్యేక సర్వ సభ్య సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మిగిలిపోయిన 31 మ్యాచ్‌ లను సెప్టెంబర్ - అక్టోబర్‌ లో పూర్తి చేయబోతున్న విషయం తెలిసిందే.

షార్జా, దుబాయ్, అబుదాబి వేదికగా ఐపీఎల్​ మ్యాచులు కొనసాగనున్నాయి. విదేశీ ఆటగాళ్లు లేకపోయినా ఐపీఎల్​ను కొనసాగిస్తామని బీసీసీఐ స్పష్టం చేసింది. ప్రస్తుతం ఆస్ట్రేలియా ఆటగాళ్లు ఐపీఎల్​ ఆడేందుకు సిద్ధంగా ఉన్నారని బీసీసీఐ అంటున్నది.

అయితే న్యూజిలాండ్​, ఇంగ్లండ్​ క్రికెటర్లు వచ్చే పరిస్థితి లేదని సమాచారం. ఐపీఎల్​ 2021 ఆగిపోవడంతో ఫ్యాన్స్​ తీవ్ర నిరాశలో మునిగిపోయారు. బయోబబుల్​ లో ఐపీఎల్​ నిర్వహించనప్పటికీ .. కొందరు క్రికెటర్లకు కరోనా సోకింది. దీంతో అర్ధాంతరంగా టోర్నీ ఆగిపోయింది. అయితే మ్యాచ్​ కొనసాగింపు ప్రకటన కోసం అప్పటినుంచి ఫ్యాన్స్​ ఎదురుచూస్తున్నారు. ఎట్టకేలకు ఐపీఎల్​ 2021పై బీసీసీఐ నిర్ణయం తీసుకున్నది. ఈ సమావేశంలో బీసీసీఐ చైర్మన్​ సౌరవ్​ గంగూలీ కూడా పాల్గొన్నారు.