Begin typing your search above and press return to search.
కన్నబిడ్డను తాకకుండానే..కరోనాతో కన్నుమూసిన తల్లి..కంటతడి పెట్టిస్తోన్న ఘటన!
By: Tupaki Desk | 25 April 2020 3:00 PM GMTకరోనావైరస్ ప్రస్తుతం ప్రపంచంలోని ప్రతి దేశాన్ని భయంతో వణికిపోయేలా చేస్తుంది. ఈ కరోనా దెబ్బకి ప్రతి ఒక్కరు అల్లాడిపోతున్నారు. ఈ కరోనా కారణంగా జరిగిన ఓ ఘటన గురించి తెలుసుకొని ఇప్పుడు ప్రపంచం మొత్తం కంటతడి పెడుతుంది. ఎంతో ఆశగా తన బిడ్డని ఎత్తుకొని అమ్మ తనాన్ని ఆస్వాదించాలని పరితపించిన ఓ తల్లి.. కన్న బిడ్డను కూడా కళ్లారా చూసుకోకుండానే కరోనాతో కన్నుమూసింది. ఈ విషాద ఘటన ఇంగ్లాండ్ లోని బర్మింగ్ హమ్ లో చోటు చేసుకుంది.
ఈ ఘటనకి సంబంధించిన పూర్తి వివరాలు చూస్తే .. ఫోజియా హనీఫ్ (29), వాజీద్ అలీ దంపతులకు ఏడేళ్ల క్రితం వివాహం అయ్యింది. గతేడాది హనీఫ్ కు ఓ బిడ్డ పుట్టి చనిపోయింది. మళ్లీ కొన్ని రోజుల క్రితం గర్భం దాల్చడంతో.. ఆ దంపతులు చాలా జాగ్రత్తగా ఉంటున్నారు. తరచుగా వైద్య పరీక్షలు చేయించుకుంటున్నారు. 31 వారాల గర్భంతో ఉన్న హనీఫ్ కు కొద్దిగా జ్వరంగా అనిపించడంతో ఆమె భర్త హాస్పిటల్ కు తీసుకెళ్లాడు. రెండు రోజులపాటు హాస్పిటల్ లో ఉంచి కరోనా పరీక్షలు చేస్తామని డాక్టర్లు చెప్పారు. మరుసటి రోజు కరోనా పాజిటివ్ అని చెప్పారు. కానీ వైరస్ ప్రభావం తక్కువగానే ఉంది కాబట్టి ఇంటికి తీసుకెళ్లొచ్చని చెప్పారు.
కానీ ఇంటికి వెళ్లిన నాలుగు రోజుల తర్వాత ఆమెకు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తాయి. దీనితో వెంటనే అంబులెన్స్ లో ఆమెను హాస్పిటల్ కు తరలించారు. హాస్పిటల్ కు తీసుకెళ్లడానికి ముందు అంబులెన్స్ లో చెక్ చేస్తే బీపీ, షుగర్ అన్నీ బాగానే ఉన్నాయి. కానీ ఆమెను బర్మింగ్ హమ్ లోని హార్ట్‌ల్యాండ్ హాస్పిటల్ లో రికవరీ వార్డులో చేర్పించారు. ఏప్రిల్ 2న సర్జరీ చేసి బాబును బయటకు తీశారు. కానీ పసిబిడ్డకు రిస్క్ వద్దు అనే ఉద్దేశంతో హనీఫ్ ను రికవరీ వార్డుకు పంపించి.. బిడ్డను వేరే చోట ఉంచారు.
ఓ దశలో ఆమె కోలుకుంటోందని చెప్పారు. ఫోన్లో మాట్లాడించడంతో ఆమె తండ్రి, భర్త ఒకింత ఉపశమనం పొందారు. కరోనా కారణంగా బిడ్డను చూడలేకపోయానని బాధపడుతున్న హనీఫ్ కు.. ఆ చిన్నారి ఫొటోలను చూపించారు. తన బిడ్డ ఫొటోలను చూసి ఆ తల్లి ఎంతో మురిసిపోయింది. కరోనా నుండి కోలుకోనీ ఇంటికి వెళ్లి అమ్మ తనాన్ని ఆస్వాదించాలని అనుకుంది. కానీ , ఆ తరువత ఆమె పరిస్థితి విషమించడంతో ఆమెను ఇంటెన్సివ్ కేర్ యూనిట్ లో చేర్పించి వెంటిలేటర్ మీద ఉంచారు. హనీఫ్ భర్తను పిలిచి ఆమె పరిస్థితి విషమిస్తోందని.. రక్తం గడ్డకట్టిందని, ఆమె కోమాలోకి వెళ్లిందని డాక్టర్లు చెప్పారు. డాక్టర్లు ఏం చెబుతున్నారో అతడికి అర్థం కాలేదు. అంతలోనే ప్రొటెక్టివ్ ఎక్విప్‌మెంట్ ఇచ్చి.. హనీఫ్ ను ఉంచిన ఐసీయూలోకి ఆమె భర్తను, తండ్రిని పంపించారు. ఆ తర్వాత ఏప్రిల్ 6న ఆమె వెంటిలేటర్ ను ఆపేశారు.
దీంతో తన బిడ్డను ఓసారి కూడా ప్రత్యక్షంగా చూడకుండానే.. ఓసారైనా హత్తుకోకుండానే ఆ తల్లి కరోనా కారణంగా మరణించింది. కొడుకు పుట్టిన ఆరు రోజులకే భార్యను కోల్పోవడంతో వాజీద్ అలీ దుఃఖాన్ని ఆపుకోలేకపోయాడు. అతడితోపాటు ఇతర కుటుంబ సభ్యులు హనీఫ్ ను కోల్పోయిన బాధ నుంచి ఇంకా కోలుకోలేదు. బిడ్డకు కరోనా నెగటివ్ అని వచ్చినప్పటికీ హాస్పిటల్‌లో ఉంచి చికిత్స అందిస్తున్నారు. పెళ్లయిన ఏడేళ్ల తర్వాత పుట్టిన బిడ్డ కావడంతో ఆ తల్లి మురిసిపోయింది. గత ఏడాది ఆమె తొలి బిడ్డను తనతో తీసుకెళ్లిన ఆ దేవుడు ఈసారి ఆమె బిడ్డను ఉంచేసి ఆమెను తనతో తీసుకెళ్లాడు.