Begin typing your search above and press return to search.
రాజకుటుంబంలో భార్యలు రాజేసిన చిచ్చు
By: Tupaki Desk | 23 Aug 2022 2:30 AM GMTబ్రిటన్ రాజకుటుంబంలో విభేదాలు మాత్రం సమసిపోవడంలో ఇద్దరు రాజుల భార్యల వల్ల ఇవి చిరిగి చాటవుతున్నాయి. బ్రిటీష్ రాజకుటుంబానికి చెందిన ప్రిన్స్ చార్లెస్ మొదటి భార్య చనిపోయి పాతికేళ్లు అయినా కూడా ఆమె ఇద్దరు కొడుకుల మధ్య మనస్పర్ధలు సమసిపోలేదు. రాచ మర్యాదల నుంచి ప్రిన్స్ హ్యారీ, ఆయన భార్య తప్పుకుంటున్నట్టు ప్రకటించడంతో వివాదానికి ఆజ్యం పోసింది. ప్రిన్స్ విలయమ్స్ (40)తో హ్యారీ (37)ల మధ్య మనస్పర్ధలు మాత్రం తగ్గడం లేదు. విలియం, రాయల్ స్థాపనను స్వీకరించి మరిన్ని బాధ్యతలను చేపట్టి హుందాగా ముందుకెళుతున్నాడు. ఇక హ్యారీ ఏమో కాలిఫోర్నియాలో జీవితం కోసం రాజ సంప్రదాయాలను తిరస్కరించి భార్యతో కలిసి రాజప్రసాద వ్యవహారాలపై సంచలన ఆరోపణలు చేశారు.
అన్నదమ్ముల వైరం చాలా దూరం వెళ్లిందని.. వాళ్లు తిరిగి కలుసుకోవడం అనుమానేమనని రాజకుటుంబ వ్యవహారాలు చూసిన వారు చెబుతున్నారు. పరిస్థితులనేవి ఎలా మారిపోయాయో ఆయన పాత సంగతులను గుర్తు చేస్తూ మరీ చెప్తున్నారాయన..
తన 36 ఏళ్ల వయసులో బ్రిటీష్ రాణి డయానా 1997లో రోడ్డు ప్రమాదంలో మరణించారు. అప్పటికి రాజకుమారులు విలియన్ 15 ఏళ్లు, హ్యారీ 12 ఏళ్ల వయసు. ఇద్దరూ ఎటోన్ బోర్డింగ్ స్కూళ్లో చదివారు. విలయమ్ పై చదువులకు యూనివర్సిటీ వెళ్లగా.. హ్యారీ మాత్రం మిలటరీ ట్రైనింగ్ తీసుకున్నాడు.
ఇక విలయమ్ 2011లో తన ప్రియురాలు కేట్ మిడెల్ టన్ తో వివాహం వరకూ తమ్ముడు హ్యారీతో అనుబంధం బాగానే ఉంది. విలయం పెళ్లి అయ్యాక రాజకుటుంబంలో గొడవలు మొదలయ్యాయి. హ్యారీ 2018లో మేఘన్ ను వివాహం చేసుకోవడం.. భార్య కోసం రాజరికాన్ని వదులుకోవడంతో పరిస్థితులు తారుమారయ్యాయి. అప్పటి నుంచే అన్నాదమ్ముల మధ్య అలజడి మొదలైంది.
ఓ ఇంటర్వ్యూలో మా అన్నాదమ్ముల దారులు వేరంటూ హ్యారీ చేసిన ప్రకటన సంచలనంగా మారింది. ఆపై హ్యారీ, మేఘన్ లు రాజరికాన్ని వదిలేసుకుంటూ అమెరికాకు వెళ్లిపోవడంతో ఇంటిపోరు రచ్చకెక్కింది.
చాలా కాలం విభేదాల తర్వాత 2021 జులైలో కెన్ సింగ్టన్ ప్యాలెస్ బయట డయానా విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ఈ ఇద్దరు అన్నాదమ్ములు హాజరయ్యారు. దీంతో ఒక్కటయ్యారంటూ కథనాలు వచ్చాయి. ఆ తర్వాత హ్యారీ, అతడి భార్య ఇంటర్వ్యూలో చేసిన విమర్శలతో విలయం నొచ్చుకున్నాడు. అప్పటి నుంచి సోదరుడి ముఖం చూడడానికి కూడా ఇష్టపడడం లేదు. 2022 క్వీన్ ఎలిజబిత్ జూబ్లీ వేడుకల్లోనూ అన్నాదమ్ములు మాట్లాడుకోలేదు.
ఎంత మనస్పర్ధలున్నప్పటికీ విలియం-హ్యారీ ఇలా భార్యల వల్ల గొడవలు పెట్టుకొని విడిపోయి దూరంగా వెళ్లడాన్ని రాజకుటుంబ అభిమానులు అస్సలు జీర్ణించుకోవడం లేదు. వివాహాలు అయ్యాక ఈ లొల్లిలు మొదలుకావడంతో అందరూ వారి భార్యలనే ఆడిపోసుకుంటున్నారు.