Begin typing your search above and press return to search.

వారికి తొందరెక్కువంటున్న క్రికెటర్ల భార్యలు!

By:  Tupaki Desk   |   12 Oct 2016 9:24 AM GMT
వారికి తొందరెక్కువంటున్న క్రికెటర్ల భార్యలు!
X
మూడో టెస్టులో న్యూజిల్యాండ్‌ పై విజయం సాధించి సిరీస్‌ ను 0-3తో కైవసం చేసుకున్న భారత జట్టుపై ప్రశంసల జల్లు కురుస్తోంది. ఈ సమయంలో మూడో టెస్టులోనూ అద్భుతంగా రాణించి 13 వికెట్లు పడగొట్టిన స్పిన్నర్‌ అశ్విన్‌ మ్యాన్‌ ఆఫ్‌ మ్యాచ్‌ తో పాటు మ్యాన్ ఆఫ్ ది సిరీస్ కూడా గెలిచాడు. అయితే అశ్విన్ కెరీ లో ఇది ఏడో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్. ఈ సందర్భంగా అశ్విన్‌ పై ప్రశంసల జల్లు కురిపిస్తూనే మాజీ క్రికెటర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ తనదైన స్టైల్‌ పంచ్‌ డైలాగ్‌ విసిరాడు. ఈ పంచ్ లకు అటు అశ్విన్ భార్య - ఇటు సెహ్వాగ్ భార్య కూడా గొంతు (ట్వీట్) కలపారు!

"అద్భుతంగా ఆడి ఏడోసారి మ్యాన్‌ ఆఫ్‌ ద సిరీస్‌ గెలుచుకున్న అశ్విన్‌ కు అభినందనలు.. ఇంటికి ఎందుకు తొందరగా వెళ్లాలనేది కేవలం పెళ్లయిన వాళ్లకు మాత్రమే అర్థమవుతుంది" అని చమత్కరించాడు వీరేంద్రుడు. దీంతో సెహ్వాగ్ వ్యాఖ్యలపై అశ్విన్‌ కృతజ్ఞతలు చెప్పాడు. ఇక్కడనుంచే మొదలయ్యాయి అసలు సరదా సంభాషణలు! సెహ్వాగ్ ట్వీట్ పై అశ్విన్‌ భార్య ప్రితీ అశ్విన్‌ స్పందిస్తూ... "హాహాహా.. నేనేం చేయనండి" అంటూ బదులిచ్చింది. ఇదే సమయంలో ఈ మధ్యే ట్విట్టర్‌ లో అడుగుపెట్టిన సెహ్వాగ్‌ భార్య ఆర్తి కూడా ఈ సంభాషణలోకి దిగుతూ... "నేను కూడా ఏం చేయను ప్రితీ... కానీ వాళ్లిద్దరికే (అశ్విన్‌ - సెహ్వాగ్‌) తొందరెక్కువ" అంటూ కామెంట్‌ చేసింది. మొత్తానికి ఈ సరదా సంభాషణ నెటిజన్లకు బాగా నచ్చేయడంతో తెగ షేర్స్ చేసేస్తున్నారు.

కాగా ఈ సిరీస్ తో మరికొన్ని రికార్డులు అశ్విన్ తన ఖాతాలో వేసుకున్నాడు. ఇప్పటికే అతితక్కువ మ్యాచులతో 200 టెస్ట్ వికెట్లు తీసిన రికార్డూ సొంతం చేసుకోగా, గత వందేళ్లలో ఏ బౌలర్‌ సాధించిన స్ట్రైక్‌ రేట్‌ ను అశ్విన్‌ సొంతం చేసుకున్నాడు. టెస్టుల్లో అశ్విన్‌ స్ట్రైక్‌ రేట్‌ 49.4 కావడం గమనార్హం. ఒక వికెట్‌ పడగొట్టడానికి ఆ బౌలర్‌ వేసే బంతులను బట్టి అతని స్ట్రైక్‌ రేట్‌ను నిర్ధారిస్తారు. సింపుల్‌గా చెప్పాలంటే.. ఆ బౌలర్ వేసిన ప్రతి 50 (49.4) బంతులకు అశ్విన్‌ ఒక వికెట్‌ పడగొడుతూ వచ్చాడన్నమాట. వీటిలో ఐదేసి వికెట్లు 21 సార్లు తీసుకోగా, 10 వికెట్లను ఆరుసార్లు సాధించాడు.

టాప్ 5 అత్యుత్తమ స్ట్రైక్ రేటు కలిగిన స్పిన్నర్ల వివరాలను ఒకసారి పరిశీలిస్తే...

రవిచంద్రన్ అశ్విన్ (ఇండియా: 2011 - 2016) - 39 మ్యాచ్ లు - 49.4 స్ట్రైక్ రేట్

మెగ్ గిల్ (ఆస్ట్రేలియా: 1998 - 2008) - 44 మ్యాచ్ లు - 54 స్ట్రైక్ రేట్

మురళీదరన్ (శ్రీలంక: 1992 - 2010) - మయాచ్ లు 133 - 55 స్ట్రైక్ రేట్

షేన్ వార్న్ (ఆస్ట్రేలియా: 1992 - 2007) - మ్యాచ్ లు 145 - 57.4 స్ట్రైక్ రేట్

గ్రేం స్వాన్ (ఇంగ్లాండ్: 2008 - 2016) - మ్యాచ్ లు 60 - స్ట్రైక్ రేట్ 60.1

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/