Begin typing your search above and press return to search.

పెళ్లి కాకున్నా క‌లిసి ఉంటే త‌ప్పు కాద‌న్న సుప్రీం!

By:  Tupaki Desk   |   7 May 2018 3:50 AM GMT
పెళ్లి కాకున్నా క‌లిసి ఉంటే త‌ప్పు కాద‌న్న సుప్రీం!
X
ఇద్ద‌రు మేజ‌ర్లు పెళ్లి బంధంతో ఒక్క‌టి కాకున్నా.. వారిద్ద‌రూ ఇష్ట‌పూర్వ‌కంగా క‌లిసి ఉండే హ‌క్కు వారిద్ద‌రికి ఉంటుంద‌న్న విష‌యాన్ని స్ప‌ష్టం చేసింది సుప్రీం. స‌హ‌జీవ‌నాన్ని చ‌ట్ట‌స‌భ‌లూ గుర్తిస్తున్నాయ‌న్న విష‌యాన్ని గుర్తు చేసింది. అంతేకాదు.. పెళ్లి చేసుకోవ‌టానికి చ‌ట్ట‌ప‌రంగా ఉన్న వ‌య‌సు కంటే త‌క్కువ వ‌య‌సులో పెళ్లి చేసుకున్న ఒక పెళ్లిని కేర‌ళ హైకోర్టు ర‌ద్దు చేస్తూ తీసుకున్న నిర్ణ‌యాన్ని సుప్రీం ప‌క్క‌కు పెట్టేయటం గ‌మనార్హం.

ఈ ఆస‌క్తిక‌ర ఉదంతంలోకి వెళితే.. మే 30 నాటికి నంద‌కుమార్ 21 ఏళ్లలోకి అడుగుపెడ‌తాడు. హిందూ వివాహ చ‌ట్ట ప్ర‌కారం పెళ్లి చేసుకునే అబ్బాయికి 21 ఏళ్లు.. అమ్మాయికి 18 ఏళ్ల వ‌య‌సు త‌ప్ప‌నిస‌రి. ఇదిలాఉంటే.. నంద‌కుమార్ 21 ఏళ్ల కంటే త‌క్కువ వ‌య‌సులోనే తుషార్ ను పెళ్లి చేసుకున్నారు. ఇదిలా ఉండ‌గా.. నంద‌కుమార్ కు చ‌ట్ట‌ప‌రంగా పెళ్లి చేసుకోవ‌టానికి 21 ఏళ్ల వ‌య‌సు కంటే కొద్ది నెల‌ల త‌క్కువ‌గా ఉండ‌టం.. అత‌నితో తుషార అనే అమ్మాయిని పెళ్లాడ‌టాన్ని కేర‌ళ హైకోర్టు త‌ప్పు ప‌ట్టింది.

అంతేకాదు.. నంద‌కుమార్‌కు ఇచ్చి పెళ్లి చేసిన తుషార్ త‌ల్లిదండ్రుల‌ను జైలుకు పంపుతూ కేర‌ళ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీనిపై నంద‌కుమార్ సుప్రీంను ఆశ్ర‌యించారు. ఈ కేసువిచార‌ణ సంద‌ర్భంగా సుప్రీం ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసింది. చ‌ట్ట‌ప‌రంగా నంద‌కుమార్ కు పెళ్లి చేసుకునే వ‌య‌సు లేన‌ప్ప‌టికీ.. ఈ ఉదంతంలో మాత్రం పెళ్లిని ర‌ద్దు చేయాల్సిన అవ‌స‌రం లేద‌ని పేర్కొంది.

నంద‌కుమార్..తుషార‌లు హిందువుల‌ని.. వారి పెళ్లి స‌మ‌యానికి చ‌ట్ట‌ప్ర‌కారం స‌రిప‌డా వ‌య‌సు లేకున్నా.. వారి పెళ్లిని 1955 హిందూ వివాహ చ‌ట్టం ప్ర‌కారం ర‌ద్దు చేయాల్సిన అవ‌స‌రం లేద‌ని పేర్కొంది. అంతేకాదు.. నంద‌కుమార్.. తుషార‌లు మేజ‌ర్లు అని.. వారిద్ద‌రూ పెళ్లి బంధంతో ఒక్క‌టి కాకున్నా.. వారిద్ద‌రికి క‌లిసి జీవించే హ‌క్కు ఉంద‌ని పేర్కొంది. ఈ సంద‌ర్భంగా కేర‌ళ హైకోర్టు ఇచ్చిన ఆదేశాల్ని ప‌క్క‌న పెట్టేసింది. తుషార‌కు ఎవ‌రితో క‌లిసి ఉండాల‌న్న అంశంపై నిర్ణ‌యం తీసుకునే హ‌క్కు ఉంద‌ని తేల్చి చెప్పింది.