Begin typing your search above and press return to search.

ఆమె బాడీలో డ్రగ్ ప్యాకెట్స్

By:  Tupaki Desk   |   31 Aug 2015 4:59 AM GMT
ఆమె బాడీలో డ్రగ్ ప్యాకెట్స్
X
ఆ మధ్యన ఓ హాలీవుడ్ సినిమా వచ్చింది. అందులో.. అమాయకుల్నికిడ్నాప్ చేసి.. వారి పొట్టలో డ్రగ్ ప్యాకెట్స్ కుట్టేసి..వారిని లక్షిత ప్రదేశాలకు చేర్చాక.. వాటిల్లో నుంచి తీసేసే పెద్ద ముఠా.. అయితే.. అలా పొట్టలో కుట్టేసిన డ్రగ్ పొట్లాం ఒకరిలో పగిలిపోవటం.. అత్యంత శక్తివంతమైన డ్రగ్ శరీరంలో కలిసి.. మనిషి మేధో తనానికి కొన్ని కోట్ల రెట్ల శక్తి సామర్థ్యాలు సొంతం కావటం.. దాంతో సదరు ముఠాను అంతమొందించి.. తాను చనిపోయే కథాంశంతో వచ్చింది.

మిగిలిన సంగతి ఎలా వచ్చినా.. మనిషి పొట్టలో డ్రగ్ పొట్లాటలను కుట్టేసి.. స్మగుల్డ్ చేసిన వైనం.. తాజాగా హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ లో గుర్తించారు. తీవ్ర కలకలం రేపిన ఈ ఘటనను చూసిన అధికారులు.. వైద్యులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

ఇప్పటివరకూ బంగారాన్ని.. డ్రగ్ ను దొంగతనంగా తీసుకొస్తూ.. దొరికిపోవటం తెలిసిందే. తాజాగా.. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నుంచి కొకైన్ ప్యాకెట్లను దుబాయ్ నుంచి అక్రమంగా తీసుకొస్తున్న మూసా అనే మహిళను అధికారులు అదుపులోకి తీసుకున్నారు. దక్షిణాఫ్రికా నుంచి దుబాయ్ మీదుగా ఇండియాకు వచ్చిన మూసా పొట్టలో మొత్తం 24 కొకైన్ ప్యాకెట్లు వెలికి తీశారు.

ఈ డ్రగ్ ప్యాకెట్లను జననేంద్రియం.. మలద్వారం నుంచి పొత్తికడుపులో పెట్టినట్లుగా భావిస్తున్నారు. ఒక్కో క్యాప్సూల్ లో ఒక అంగుళం మందం.. మూడు అంగుళాల పొడవు ఉన్నట్లు గుర్తించారు. తాజా ఉదంతం బయటకు వచ్చిన నేపథ్యంలో.. అసలు ఈ డ్రగ్ రాకెట్ల వెనుక సూత్రధారులు.. పాత్రధారుల్ని గుర్తించాల్సి ఉంది. హాలీవుడ్ సినిమాల్లో కనిపించే సీన్లు.. మన ముంగిట్లో దర్శనమిస్తున్న వేళ.. ఈ డ్రగ్ రాకెట్ వ్యవహారంపై ప్రత్యేకంగా దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. లేకుంటే.. భారీ మూల్యం చెల్లించే ప్రమాదం పొంచి ఉందన్న విషయం అధికారులు గుర్తిస్తే మంచిది.