Begin typing your search above and press return to search.

మెట్రో స్టేష‌న్ లో మ‌హిళ సూసైడ్ అటెంప్ట్‌!

By:  Tupaki Desk   |   7 Nov 2018 5:14 AM GMT
మెట్రో స్టేష‌న్ లో మ‌హిళ సూసైడ్ అటెంప్ట్‌!
X
కార‌ణం ఏమైనా కానీ హైద‌రాబాద్ మెట్రో మ‌రోసారి వార్త‌ల్లోకి ఎక్కింది. కుటుంబ క‌ల‌హాల‌తో విర‌క్తి చెందిన మ‌హిళ ఒక‌రు కొత్త‌పేట‌లోని విక్టోరియా మెమోరియ‌ల్ మెట్రోస్టేష‌న్ లో సూసైడ్ అటెంప్ట్ చేశారు. ఈ ఉదంతం తీవ్ర క‌ల‌క‌లాన్ని రేపింది. మెట్రో స్టేష‌న్ పైకి ఎక్కి కింద‌కు దూకేసిన మ‌హిళ ఉదంతం సంచ‌ల‌నంగా మారింది.

ప‌టిష్ట భ‌ద్ర‌త మ‌ధ్య మెట్రో స్టేష‌న్లు ఉంటాయ‌ని గొప్ప‌లు చెప్పుకునే హైద‌రాబాద్ మెట్రో రైల్ అధికారులు.. ఒక మ‌హిళ స్టేష‌న్ లోకి వెళ్లి.. అక్క‌డి రైలింగ్ మీద నుంచి దూకి ఆత్మ‌హ‌త్యాయ‌త్నం చేశారు. మ‌రింత జ‌రుగుతున్నా ఎవ‌రూ నిరోధించ‌లేదెందుకు? అన్న‌ది ఇప్పుడు ప్ర‌శ్న‌గా మారింది.

వాస్త‌వానికి మెట్రో స్టేష‌న్లు స‌హ‌జ‌మైన వెలుగు కోసమ‌న్న పేరుతో.. ర‌క్ష‌ణ చ‌ర్య‌లు చేప‌ట్ట‌లేదు. న‌డి రోడ్డు మ‌ధ్య‌లో ఫిల్ల‌ర్ల మీద నిర్మించిన మెట్రో స్టేష‌న్ పైకి వెళ్లిన‌ప్పుడు అక్క‌డి రైలింగ్ ఒక మోస్త‌రు ఎత్తుతో ఉంటుంది. ఎవ‌రైనా ఆత్మ‌హ‌త్య చేసుకోవాల‌నుకున్నా.. విప‌రీత చ‌ర్య‌ల‌కు పాల్ప‌డాల‌న్నా అందుకు అనువుగా ఉంటుంది.

దీనికి తోడు మెట్రో స్టేష‌న్ల‌లో ఒక్కో ఫ్లాట్ ఫాం మీద సెక్యురిటీ సిబ్బంది ఒక్క‌రు మాత్ర‌మే ఉంటారు. మెట్రో ఆరంభంలో ఒక్కో ఫ్లాట్ ఫాం మీద క‌నీసం ముగ్గురు ఉండేవారు. త‌ర్వాతి కాలంలో నిర్వాహ‌ణ భారాన్ని త‌గ్గించుకునే క్ర‌మంలో ఒక్కో ఫ్లాట్ ఫాం మీద ఒక్క‌రిని మాత్ర‌మే ఉంచుతున్నారు. దీంతో.. ఒక వైపుకు సెక్యురిటీ అధికారి ఉంటే.. మ‌రోవైపు ఈ త‌ర‌హా ఘ‌ట‌న‌ల‌కు అవ‌కాశం ఇచ్చే ప‌రిస్థితి ఉంది.

దీనికి తోడు మెట్రో స్టేష‌న్ డిజైనింగ్ కూడా ఇలాంటి వాటికి అవ‌కాశం ఇచ్చేలా ఉంద‌న్న వాద‌న వినిపిస్తోంది. మెట్రో స్టేష‌న్లోకి ప్ర‌వేశించిన త‌ర్వాత.. అక్క‌డ నుంచి దూకేయ‌టానికి వీలుగా డిజైన్ ఉంది. దీన్ని వెనువెంట‌నే మార్చాల్సిన అవ‌స‌రం ఉంద‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. ఇక‌.. మెట్రో స్టేష‌న్ పై నుంచి దూకిన మ‌హిళ‌కు గాయాలు అయిన‌ట్లుగా చెబుతున్నారు. ఆమెను స్థానిక ఎన్టీఆర్ న‌గ‌ర్‌కు చెందిన స్వ‌ప్న‌గా పోలీసులు గుర్తించారు. కింద ప‌డి గాయాల‌పాలైన ఆమెను వెంట‌నే ఉస్మానియా ఆసుప‌త్రికి త‌ర‌లించారు. ఆత్మ‌హ‌త్యాయ‌త్నానికి పాల్ప‌డిన ఆమెపై పోలీసులు కేసు న‌మోదు చేసి ద‌ర్యాఫ్తు చేస్తున్నారు.