Begin typing your search above and press return to search.
వైరల్: విమానంలో భర్తను పరిగెత్తించి కొట్టిన భార్య
By: Tupaki Desk | 25 July 2019 6:23 AM GMTలవర్స్ ఒకరినొకరు చెంపదెబ్బలు కొట్టుకుంటేనే అసలు సిసలైన ప్రేమ అని ఒక డైరెక్టర్ శెలవిచ్చారు. ఈ కొత్త లాజిక్ ను కొందరు మేథావులు విమర్శించారు కొందరు జీనియస్ లు సమర్థించారు. చెంపదెబ్బకే ఇంటెన్స్ లవ్ అనుకుంటే... ల్యాప్ టాప్ తో కొట్టుకుంటే ఇంకా ఘాటు ప్రేమ అనే కదా అర్థం! పాపం మన భారతీయుల చెంప దెబ్బల ప్రేమ.. అబ్బనీ తియ్యనీ దెబ్బ సరసాలు అమెరికాలో జనాలకు తెలుసో లేదు కానీ ఇప్పుడు వారు లాప్ టాప్ లతో కొట్టుకుంటున్నారట.
ఈ కొత్త టెక్నాలజీతో మా చెడ్డ ఇబ్బంది వచ్చి పడింది. ఎవరైనా భార్య చపాతీ కర్రతో భర్తను ఇంటెన్స్ లవ్ చూపిస్తూ ఒక్కటిచ్చింది అంటే అదేమీ న్యూస్ కాదు.. కానీ ఎవరైనా ఔత్సాహిక నెటిజన్ కనుక ఆ చపాతి కర్ర దెబ్బ ఎపిసోడ్ ను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే ఏమవుతుంది?.. సెన్సేషన్ అవుతుంది. రీసెంట్ గా అమెరికాలోని మియామీలో ఒక జంట(అక్కడ పాతుకుపోయిన మన ఇండియన్స్ కాదు) ఫ్లైట్ ఎక్కింది. అయితే సడెన్ గా భార్యామణి కోపం కట్టలు తెంచుకుంది. లాప్ టాప్ తో మొగుడిని ఎడాపెడా బాది పారేసింది. ఈ గయ్యాళి భార్య దెబ్బకు సీట్ లో నుంచి లేచి పారిపోతూనే ఆ భర్త.. "నాపై దాడి చేస్తున్నావా?" అని ప్రశ్నిస్తే.. "నేను దాడి చేస్తున్నానా.. నేను దాడి చేస్తున్నానా?" అంటూ బదులిస్తూ ప్రశ్నిస్తూ.. ఇంగ్లీష్ లో బండ బూతులు తిడుతూ ఇంకా నాలుగు తగిలించింది.
అయినా భర్త ఎందుకు భయపడుతున్నాడు.. సన్నగా.. వీక్ గా ఉన్నాడా అని చూస్తే అదేమీ లేదు. మాంచి కండపుష్టితో నిండు కుండలా ఉన్నాడు.. అయినా భార్యదెబ్బకు బెంబేలెత్తిపోయాడు. ఈ తతంగాన్ని ఫ్లైట్ లో ఉండే సహ ప్రయాణీకులు చక్కగా వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇదో పెద్ద వైరల్ న్యూస్ అయింది. ఈ వీడియో చూస్తుంటే మన టాలీవుడ్ హిట్ కమెడియన్స్ జోడీ బ్రహ్మానందం - కోవై సరళ గుర్తురావడం ఖాయం. కొన్ని సినిమాల్లో కోవై సరళ బ్రమ్మిని ఇలానే ఆటాడుకుంటుంది. సరిగ్గా అదే తరహాలో అమెరికా కోవై సరళ భర్త అంతు చూసింది.
ఇంతకీ ఆ అమెరికా భార్యామణికి ఇంత కోపం ఎందుకు వచ్చింది అంటే.. భర్త సోషల్ మీడియాలో వేరే మహిళల ఫోటోలు చూస్తున్నాడట!! మరి ప్రపంచంలో ఇంతకంటే ఇంటెన్స్ లవ్ ఉంటుందా చెప్పండి? లవ్ కు రియల్ మీనింగ్ తెలియని ఈ పాడు ప్రపంచం.. హిపోక్రాటిక్ జనాలు ఇంటెన్స్ లవ్ ను ఎప్పటికి అర్థం చేసుకుంటారో ఏంటో? అంతా బాగానే ఉంది కానీ.. ఫోటో స్టొరీలు చదివే తెలుగు నెటిజనులు జాగ్రత్త.. భార్య ఉందో లేదో గమనించకుండా ఆశగా బికినీలను చూస్తూ.. అందాలను కళ్ళతోనే జుర్రుకుంటూ ఫోటో స్టొరీలు చదివితే ఇలాంటి ఎపిసోడ్ లే రిపీట్ అయ్యే అవకాశం ఉంది. భార్యలది ఎప్పుడూ ఇంటెన్స్ లవ్.. ఘాటు ప్రేమ. అర్థం చేసుకోరూ..!