Begin typing your search above and press return to search.
యువతి దారుణ హత్య..గోనెసంచిలో మృతదేహం!
By: Tupaki Desk | 30 Jan 2018 10:21 AM GMTఓ పక్క దేశానికి హైదరాబాద్ ను రెండో రాజధానిని చేయాలని తెలంగాణ సర్కార్ ఉవ్విళ్లూరుతోంది.....మరోపక్క అందుకు భిన్నంగా కాస్మోపాలిటన్ సిటీ హైదరాబాద్ లో నానాటికీ క్రైమ్ రేట్ పెరిగిపోతోంది. ముఖ్యంగా మహిళపై లైంగిక దాడులు - అత్యాచారాలు - హత్యలు రోజురోజుకూ పెరిగిపోవడం ప్రజలను కలవరపెడుతోంది. తాజాగా, మంగళవారం నాడు నగరంలో జరిగిన రెండు వేర్వేరు ఘటనల్లో ఇద్దరు యువతులు కిరాతకంగా హత్యకు గురికావడం తీవ్ర కలకలం రేపింది.
ఈ రోజు ఉదయం కొండాపూర్ లోని శ్రీరాంనగర్ కాలనీ బొటానికల్ గార్డెన్ సమీపంలో అనుమానాస్పదంగా ఉన్న ఓ గోనె సంచిని స్థానికులు గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని ఆ గోనె సంచిని తెరచి చూశారు. ఆ సంచిలోముక్కులుగా నరికిన ఓ యువతి మృతదేహాన్ని గుర్తించారు. చనిపోయింది ఓ మహిళ అని నిర్ధారించుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆ యువతి ఎవరు - అమెను అతికిరాతకంగా ఎందుకు చంపవలసి వచ్చింది అన్నవిషయాలను కనిపెట్టేందుకు విచారణ ప్రారంభించారు.
ఈ ఘటన గురించి వార్త వెలువడిన కొద్ది సేపటికే హయత్ నగర్ లో అనూష అనే మరో యువతి హత్యకు గురైంది. దుండగులు ఆమె తలపై బండరాయితో బలంగా మోది హత్యచేశారు. నల్లగొండ జిల్లా దేవరకొండకు చెందిన అనూష.. కొంతకాలంగా హైదరాబాద్ లో పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగం కోసం కోచింగ్ తీసుకుంటోంది. ఇటీవల ఆమెకు మోహన్ అనే యువకుడితో నిశ్చితార్థమైందని, హత్యలో అతడి ప్రమేయం ఉండొచ్చని మృతురాలి కుటుంబీకులు అనుమానిస్తున్నారు. నిశ్చితార్థం తర్వాత మోహన్ ....అనూషను వేధిస్తున్నాడని, అతడి మొబైల్ స్విచాఫ్ చేసి ఉందని అనూష సోదరులు మీడియాకు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు, చందానగర్ లో శనివారం జరిగిన మూడు హత్యల ఉదంతం సోమవారం వెలుగు చూసిన సంగతి తెలిసిందే. అపర్ణ అనే మహిళతో సహజీవనం చేస్తున్న మధు.....అపర్ణ - ఆమె కూతురు కార్తికేయ(5), తల్లి జయమ్మ(50)లను దారుణంగా హతమార్చాడం తీవ్ర కలకలం రేపింది.